కామన్ స్కూల్ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచాలి. - టి.పి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు) :
ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ లో ఓటు హక్కు కల్పించాలి.
టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ డిమాండ్
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్)3వ జనరల్ కౌన్సిల్ సమావేశం స్థానిక డి సి ఈ బి కార్యాలయంలో, జగిత్యాల జిల్లా టీపీటీఎఫ్ అధ్యక్షులు బోగ రమేష్ అధ్యక్షతన నిర్వహించడమైనది.
ఇట్టి సమావేశానికి టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై.అశోక్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ...
గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని,ప్రస్తుత ప్రభుత్వం బదిలీలు,పదోన్నతులు-ఉపాధ్యాయుల నూతన నియామకం మినహాయిస్తే, మిగిలిన అన్ని విషయాల్లో గత ప్రభుత్వము మాదిరిగానే వ్యవహరిస్తోందని,5 డి.ఏ.లు పెండింగ్ లో ఉండగా ఒక్క డి.ఏ.మాత్రమే మంజూరు చేసిన తీరు ఉద్యోగ-ఉపాధ్యాయులను తీవ్ర నిరాశ-నిస్పృహలకు గురిచేసిందని,ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగానే ఉద్యోగ-ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని,సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఒకే విధమైన విద్య కావాలని,అది కామన్ స్కూల్ విద్యా విధానం ద్వారానే సాధ్యమవుతుందని,ప్రాథమిక తరగతులలో మాతృభాషలో విద్య ఉండాలని, ప్రాథమిక తరగతుల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి,మౌలిక వసతులు కల్పించాలని, ప్రాథమిక తరగతుల్లో కూడా ఆటల కొరకు పి ఈ టి టీచర్ ను నియమించాలని తద్వారా సమసమాజ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించాలని, దానికి కావాల్సిన చట్ట సవరణ కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇట్టి జనరల్ కౌన్సిల్ సమావేశంలో టి పి టి ఎఫ్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టి పి టి ఎఫ్ జగిత్యాల జిల్లా కార్యవర్గం అధ్యక్షులుగా కొక్కుల రామచంద్రం, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల గోవర్ధన్, ఉపాధ్యక్షులుగా సిహెచ్ వి సత్య ప్రకాష్, సిహెచ్ సత్యం, గండి రాజయ్య, ఎలిగేటి సంజీవరాణి,కూరగాయల చంద్రశేఖర్,చింత మోహన్ ప్రసాద్ ,రాచమల్ల మహేష్, పాక కుమారస్వామి,జిల్లా కార్యదర్శులుగా పి రాజనర్సయ్య,వేముల సుధాకర్, పొన్నం శ్రీనివాస్, పిన్నంశెట్టి శివరంజని, గుడిసె రమేష్, కాచర్ల నాగరాజు, ఎక్కలదేవి రవి, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా బి సత్యస్వామి, సభ్యులుగా ఆర్మూర్ భీమరాజు,ఏ.రాజ మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులుగా లావుడ్య రాజయ్య ,ఎండి ఫక్రుద్దీన్,ఎల్ మంజుల, రాష్ట్ర కౌన్సిలర్లుగా కొలుగూరి కిషన్ రావు,బోగ రమేష్,గొడుగు రఘుపతి యాదవ్,పి కల్పన తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇట్టి ఎన్నికలకు అధికారిగా రాష్ట్ర కార్యదర్శి గుంటి ఎల్లయ్య,పరిశీలకులుగా లక్ష్మయ్య యాదవ్ లు వ్యవహరించారు.
ఇట్టి కార్యక్రమంలో సీనియర్ ఫెడరేషన్ నాయకులు సూద రాజేందర్,నాగేంద్రం,రవీందర్ వివిధ మండలాల బాధ్యులు చిర్నేని రాజిరెడ్డి,కొత్త రాంకుమార్,గొడుగు మధుసూదన్,కడారి ప్రకాష్ ,ఆసం శ్రీనివాస్,గజ్జల లచ్చయ్య, ఐల రఘుపతి,గొల్లపల్లి సత్యనారాయణ, సంతోష్ కుమార్, శ్రీనివాస్, తిరుపతి కందుకూరి శ్రీనివాస్, వెంకటరమణారెడ్డి, వహీద్, సలాముద్దీన్, సిరికొండ వేణు, జి చంద్రమౌళి,గంగారాం,రాజేశం మహిళా ఉపాధ్యాయులు వనిత,, మంజుల, సునీత ,సంజీవరాణి, శివరంజని ,పప్పీరాణి,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విమానంలో ‘మేడే’ అలర్ట్… లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర పరిస్థితి
న్యూ డిల్లీ ఏప్రిల్ 05 :
Air India Express కు చెందిన ఒక విమానంలో పొగ అనుమానం రావడంతో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. బాగ్డోగ్రా నుంచి ఢిల్లీకి వెళ్తున్న IX 1523 విమానం సోమవారం సాయంత్రం అత్యవసరంగా చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CCSIA), లక్నోలో ల్యాండ్ చేయబడింది.సుమారు సాయంత్రం... బంజారా ప్రముఖులతో కల్వకుంట్ల కవిత భేటీ – కొత్త రాజకీయ పార్టీపై చర్చలు
హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
బంజారా ప్రముఖులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక చర్చలు నిర్వహించారు. రిటైర్డ్ అదనపు డీజీ డీటీ నాయక్ నివాసంలో ఈ భేటీ జరిగింది.
ఈ నెల 25న పార్టీ ప్రారంభానికి ముందు, బంజారా సమాజ సమస్యలు, వారికి... మహనీయుల ఆశయాలు కొనసాగించాలి
జగిత్యాల ఏప్రిల్ 5(ప్రజా మంటలు)ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు
జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి దగ్గర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా... జ్ఞాన స్కూల్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
.జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశను పూర్తి చేసిన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హరి చరణ్ రావు మాట్లాడుతూ... సంత్ రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరణ
""
జగిత్యాల ఏప్రిల్ 5 (ప్రజా మంటలు)సంత్ రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని సామాజిక సమరసతా వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్ చౌరస్తాలో గల మోచి సంఘంలో సంఘ నాయకుల సమక్షంలో సంతు రవిదాస్ క్యాలెండర్ ఆవిష్కరించి క్యాలెండర్ తో పాటు అతని బోధనలతో కూడిన పుస్తకాన్ని కూడా సభ్యులందరికీ పంచటం... సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణ డా బాబు జగ్జీవన్ రామ్_జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)
డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన జిల్లా ఎస్పీ
స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త మరియు సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన గొప్ప నాయకుడు, భారత మాజీ ఉపప్రధానమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా... జగిత్యాలలో నిజామాబాద్ రోడ్ పై వంతెన పనులు – ట్రాఫిక్ మళ్లింపు అమలు
జగిత్యాల, ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ హైవేలో హ్యాంగౌట్ హోటల్ సమీపంలో వంతెన నిర్మాణ పనులు ఏప్రిల్ 6 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు పోలీసులు మార్గ మళ్లింపులు అమలు చేస్తున్నారు.ముఖ్య మార్పులు ఇలా ఉన్నాయి:జగిత్యాల నుంచి నిజామాబాద్ వెళ్లే RTC బస్సులు,... గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ పై దాడి ముగ్గురు పై కేసు నమోదు
గొల్లపల్లి ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
బుగ్గారం మండలానికి చెందిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న దూడ కిరణ్ ను కులం పేరుతో దూషణ మరియు ముగ్గురు దాడి చేశారని ఫిర్యాదు చేసిన డ్రైవర్, రాజశేఖర్, అమర్నాథ్, రోహన్ ముగ్గురిపై కేసు నమోదు, రాజశేఖర్ కి సంబంధించిన ఫ్లెక్సీ దూడ కిరణ్ తీ... ఒంటరితనం, వృద్ధాప్యంతో జీవితంపై విరక్తి… వృద్ధుడి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో ఒంటరితనం మరియు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన జంబుక ఆశన్న (78), తండ్రి గంగారం, ఎస్సీ మాల వర్గానికి చెందినవాడు.ఆశన్న గతంలో గ్రామ సుంకరి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. 2025... బాబు జగ్జీవన్ సేవలు చిరస్మరనీయం -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెటుపల్లి ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ )
బాబు జాగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరనీయం అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. బార్ అసోసియేషన్ మరియు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి
కార్మికుల... ప్రజా ప్రతినిధుల శిక్షణ బుగ్గారంలోనే పెట్టాలి - చుక్క శ్రీలత
బుగ్గారం, ఏప్రిల్ 05(ప్రజా మంటలు):బుగ్గారం మండల కేంద్రాన్ని పక్కనబెట్టి శేఖల్లలో వార్డ్ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాల వార్డ్ సభ్యులు హాజరు కావాల్సిన ఈ శిక్షణను దూర ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు, అసౌకర్యాలు తలెత్తుతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.“ఇది... సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం - తెలంగాణ జాగృతి హెచ్చరిక
హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):
హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి, hms కార్మిక సంఘం ఇతర స.మతాలతో కలిసి, నిర్వహించిన “సేవ్ సింగరేణి” రౌండ్ టేబుల్ సమావేశంలో సింగరేణి సంస్థపై ప్రభుత్వ వైఖరిని కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. కార్మికుల నియామకాలపై విచారణ పేరుతో ఒత్తిడి చేయడం కంటే, ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్... 