రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?
ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా? రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి? కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?
జగిత్యాల రాజకీయాలను ఒక కుదుపు కుడిపిన రాజకీయ హత్య
ఇది జీవన రెడ్డి రాజకీయ చరిత్ర ముగింపుకు కుట్రనా?
రేపటి భవిష్యత్ నిర్ణయమేమిటి?
కాంగ్రెస్ లో సీనియర్ల పరిస్థితి ఇంతేనా?
జగిత్యాలలో జరిగిన కాంగ్రెస్ నాయకుడు మార గంగారెడ్డి హత్య తరువాత అక్కడ ఏం జరగనున్నది?
రాజకీయంగా జీవన్ రెడ్డి పరిస్థితి ఏమిటి?
జగిత్యాల రాజకీయాలలో అనూహ్య మార్పులకు నాంది
ఎటూ తేల్చుకోలేని స్థితిలో జీవన రెడ్డి
చాపకింది నీరులా కాంగ్రెస్ లో బిఆర్ఎస్ వ్యవహారం
(సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్)
జగిత్యాల రాజకీయాలలో కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టనుందని, తలపండిన రాజకీయ నాయకుడు, జగిత్యాల రాజకీయాలలో కురువృద్ధుని లాంటి తాటిపర్తి జీవన్ రెడ్డి జీవితంలో అనుకోని మలుపులకు, మార్పుకు నాంది కానుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంత పెద్ద కుదుపును ఆయన 40 ఏళ్ల తరువాత తట్టుకోవాల్సిన పరిసతీలు ఏర్పడ్డాయి.
సామాజిక ఉద్యమాల నేపథ్యంలో, యువ న్యాయవాదిగా ఉంటూ, 1981 లో జరిగిన పంచాయత్ సమితి ఎన్నికల్లో మల్యాల నుండి సమితి అధ్యక్షునిగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, రెండేళ్ల లోపే 1982-83 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జగిత్యాల నుండి గెలిచిన జీవన్ రెడ్డి, అనుకోని పరిస్థితులలో 1984 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరి, అప్పటి నుండి జగిత్యాల నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుత జగిత్యాల జిల్లాలో తిరుగులేని నాయకునిగా చలామణి అవుతున్న జీవన రెడ్డికి, ఆయన పైనే రెండుసార్లు గెలిచిన బి ఆర్ ఎస్ అభ్యర్థి డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం, డానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వత్తాసు పలకడం, జీవన్ రెడ్డి ఆహాన్ని, ఆధిపత్యాన్ని కూకటివెళ్లతో పేకిలించి వేసిందనే చెప్పవచ్చు.
డిల్లీ వరకు వెళ్ళినా, సీనియర్లు ఎంత మంది చెప్పినా, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ కాదనలేక, ఆయనకే అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని జీవన రెడ్డికి, ఆయన సహచరుడు, ఆత్మీయుడు మార గంగారెడ్డి హత్య, అదీ, మొన్నటి వరకు బి ఆర్ ఎస్ పార్టీలో ఉన్న ఒక యువకుని చేతిలో హత్యకు గురికావడం, ఆయనకు కొలుకొని దెబ్బగా చెప్పుకొంటున్నారు. గంగారెడ్డి హత్య జరిగి రెండు రోజులైనా, ఆయన కొలుకోలేకపోతున్నారు. విషణ్ణ వదనంతో ఉన్న ఆయనను చూసిన ఎవరికైనా ఆయన ఎంతగా క్రుంగిపోయారో ఇట్టే పసికట్ట వచ్చు.
ఆయన ఎంత ఆవేశంగా ఉన్నా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎవరిని విమర్శించినా, కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో కదలిక రావడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఓదార్చడానికి ఫోన్ చేసినా, హైదరాబాద్ లో విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ, జీవన్ రెడ్డి నిన్న మీ పార్టీకొ దండం -- ,నీకో దండం .. పార్టీలో ఉండాలా వద్దా .. అంటూ చేసిన విమర్శలు అన్నీ ఆయన వ్యక్తిగతమని కొట్టి పారేశారు. మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపి మధు యాష్కీ లాంటి వారు కొంత సీరియస్ గా తీసుకొన్నా, దానిపై ఎలాంటి రచ్చ చేసే పరిస్థితిలో లేరనే తెలుస్తుంది.
అంతంత మాత్రమే ఆధిక్యంతో శాసన సభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, గతంలో బిఆర్ఎస్ చేసినట్లుగా, మొత్తం పార్టీని తనలో కలుపుకోవాలని చేసిన ప్రయత్నంలో 10 మంది మాత్రమే కాంగ్రెస్ లో చేరడం, అందులో కూడా చేరిన కొందరు కూడా తమకు ప్రాధాన్యత లభించడం లేదని కినుకు వహించి, దూరం - దూరంగా నే ఉంటున్నారు. దీనికి తోడు, బి ఆర్ ఎస్ పార్టీ హైకోర్ట్ వీరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని వేసిన పిటిషన్ వీరి తలపై కత్తిలా వేలాడుతుంది. అందులో కడియం శ్రీహరి, దానం నాగేంద్ర, తెల్లం వెంకట రావు ల పేర్లు మాత్రమే ఉన్నా, వారి పట్ల హైకోర్ట్ ఇచ్చే రేపు తెర్పే, మిగతా 7 గురు ఎమ్మెల్యేల కు వర్తిస్తుందని అనుకొంటున్నారు. సంవత్సరంలోగా, ఉప ఎన్నికలకు పోవడానికి ఎవరు కూడా సిద్దంగా లేరు.
ఈ నేపథ్యంలో, జగిత్యాలలోనే కాకుండా, అదే రోజు పఠాన్ చెరువు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ నాయకులపై కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గడ్డం మహీపాల్ రెడ్డి వర్గీయులు దాడిచేయడం కూడా పార్టీలో కలకలం రేపింది. రాష్ట్ర ప్రజలను ఆకర్షించిన ఉదంతాలు ఈ రెండే అయినా, కొత్తగా పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల నియోజక వర్గాలలో పాత -కొత్త కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. ఉన్న పార్టీలోని వారే కాకుండా కొత్తగా వచ్చిన వారు, మొన్నటి వరకు అధికారం అనుభవించి, కాంగ్రెస్ కార్యకర్తలను అనేక లకు గురి ఇబ్బందులకు గురి చేసిన వారే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీళ్ళు నిండిన చేరువులోకి కప్పలు వచ్చినట్లు వచ్చి, ఆధిపత్యం చెలాయించడాన్ని పాత కాంగ్రెసన కార్యకర్తలు భరించలేకపోతున్నారు.
జగిత్యాల నియోజకవర్గంలో మొదటి నుండి ఒక సామాజిక వర్గానికి జీవన్ రెడ్డి పట్ల సానుకూలత లేదు. దాదాపు 36 సంవత్సరాల తరువాత ఆ వర్గానికి అధికారం వచ్చింది. జీవన రెడ్డి రెండవ సారి ఎమ్మెల్యేగా, వరుసగా రెండవసారి ఓడిపోవడం, అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బి ఆర్ ఎస్ పార్టీ ఆధీనలో ఉన్న మున్సిపల్ కూడా కాంగ్రెస్ వశం అవడం కొందరికి కంటిలో నలకలా మారిపోయింది.
మొదటి నుండి అంతా తానే అయి, ఒక్కడే పార్టీని వంటి చేతితో నడిపిన జీవన్ రెడ్డి, కొత్తగా ఎమ్మెల్యే పార్టీలో చేరి ఆధిపత్యం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరో ఐదు నెలల్లో తన ఎమ్మెల్సీ పదవి కాలపరిమితి ముగిసిపోనుండగా, మళ్ళీ పోటీ చేయాలనే తపన ఉన్నా, మొన్నటి రెండు ఎన్నికల్లో ఓడిపోయిన బాధ ఆయనను ముందుకు పోకుండా చేస్తుంది. తనకంటూ ఒక వర్గం అంటూ లేని ఏకైక సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి, పెద్దగా ఆర్థిక బలం కూడా లేకపోవడంతో రాబోయే రోజుల్లో అతన్ని ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదని ఒక వర్గం భావిస్తుంది.
ఎన్నడూ రాజకీయ హత్యలు, గొడవలు లేని జగిత్యాల రాజకీయాలలో మొదటిసారిగా మారు గంగారెడ్డి హత్య, నాయకులనే కాకుండా ప్రజలను కూడా ఉలిక్కిపడేట్లు చేసింది. అంతా శ్మశాన వైరాగ్యంలో ఉన్న ఈ పరిస్థితులలో, ఎమ్మెల్యే డా. సంజయ్ ఈ హత్యకు తనకు ఎలాంటి సంభందం లేదని, దీని వెనుక ఉన్నది ఎవరైనా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇంకా బి ఆర్ ఎస్ లోనే ఉన్నట్లు, అభివృద్ధి కొరకే కాంగ్రెస్ తో నడుస్తున్నాననే ప్రకటన చేయడం కూడా అందరినీ గందరగోళంలో పడేసింది. ఇంతకూ ఆయన ఏ పార్టీలో ఉన్నట్లు అనే ప్రశ్న తలెత్తుతుంది.
మహారాష్ట్ర, జార్ఖండ్ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఈ గోడవలను కాంగ్రెస్ నేపథ్యం పట్టించుకో లేక పోవచ్చు. ఆ ఎన్నికల తర్వాత, ఈనెల 24 హైకోర్ట్ ఇచ్చే తీర్పు, ఆదేశాల మేర ఆతరువాతి కార్యక్రమం ఉండవచ్చని, కొత్తగా చేరిన వరైకి ముఖ్యమంత్రి అండ ఉండడం వల్ల సీనియర్లు అయినా వారి మాటకు అంతగా ప్రాధాన్యత లభించక పోవచ్చని, సర్దుకొమ్మని చెప్పి, ఊరడించి పంపే అవకాశాలే ఎక్కువగా ఉండవచ్చని అనుకొంటున్నారు. ఏమైనా, జగిత్యాల నియోజక వర్గంలో ప్రజాబలం ఉన్న నాయకునిగా ఎప్పటికీ నిలిచిపోయే నాయకుడు జీవన్ రెడ్డి. ఈ సంధి కాలంలో జీవన రెడ్డి లాంటి అనుభవం ఉన్న వారు మౌనంగా ఉండక తప్పదేమో. కాలమే ఇలాంటి వాటికి పరిష్కారం చూపాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనుమానాస్పద వ్యక్తులకు లాడ్జ్ గదులు ఇవ్వొద్దు, గుర్తింపు పత్రాలు తప్పనిసరి: టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్
జగిత్యాల మే 20(ప్రజా మంటలు)
చుక్క గంగారెడ్డి ప్రతినిధి
పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పట్టణ పోలీస్ స్టేషన్ పరిదిలోని లాడ్జ్ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్వాహకులు తప్పనిసరిగా పాటించవలసిన భద్రత నిబంధనలు మరియు మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ,... పదేళ్లలో పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా… ఇప్పుడు పాదయాత్ర డ్రామాలా?
:హైదరాబాద్, మే 19 (ప్రజా మంటలు):
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలంటూ వచ్చే నెలలో బీఆర్ఎస్ చేపట్టనున్న పాదయాత్రపై తెలంగాణ రక్షణ సేన నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్ట్ను పూర్తి చేయకుండా ఇప్పుడు పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.బంజారాహిల్స్లో జరిగిన మీడియా సమావేశంలో... ఎన్నికల వాగ్దానాలు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్కు బీసీ నాయకులు వినతి
జగిత్యాల మే 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం లో అదనపు కలెక్టర్ జి. రాజగౌడ్ కి వినతి పత్రం అందజేసిన బీసీ నాయకులు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానములో ఇచ్చిన హామీ ప్రకారము 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. పెండింగ్ స్కాలర్ షిప్లను విడుదల చేయాలి.
బీసీ రాష్ట్ర కార్యదర్శి... సైబర్ నేరాల డ్రగ్స్ వినియోగంపై పోలీస్ కళా బృందం అవగాహన సదస్సు
గొల్లపల్లి మే 18 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సోమవారం ఎండపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు .
ఈ సందర్భంగా వెల్గటూర్ ఎస్ఐ,ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలు,... TG EAPCET – 2026 ఫలితాలలో జ్యోతి పూర్వ విద్యార్థుల ఘన విజయం
జగిత్యాల మే 17 (ప్రజా మంటలు)ఆదివారం విడుదల అయిన TG EAPCET – 2026 ఫలితాలలో JYOTHI HIGH SCHOOL IIT ACADEMY పూర్వ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి సంస్థ ఖ్యాతిని మరింత పెంచారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించి విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను సంస్థ... నీతి, నిజాయితీకి మారుపేరు డాక్టర్ జస్టిస్ జి. చంద్రయ్యకు నివాళులు: మాజీ మంత్రి రాజేశం గౌడ్
హైదరాబాద్, మే 16 (ప్రజా మంటలు):
విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ జస్టిస్ జి. చంద్రయ్య అకాల మరణం బాధాకరమని మాజీ సీనియర్ మంత్రి గొడిశెల రాజేశం గౌడ్, మాజీ న్యాయమూర్తి నవ మోహన్ రావు, పాత్రికేయులు ప్రభాకర్ రావు, ఎల్జేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మినేని వికాస్... ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 15 ( ప్రజా మంటలు) :
ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో విద్యాశాఖ వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ – జగిత్యాల ఆధ్వర్యంలో ఓల్డ్ బస్ స్టాండ్ జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి... తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం పైలాన్ వేరే చోటుకు మార్చాలని బ్రాహ్మణ సంఘం చే నిరసన.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
ఖమ్మం మే 15 (ప్రజా మంటలు) :
నగరంలో లకారం ట్యాంక్ బండ్ సెంటర్లో భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భముగా ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహము. ప్రాంతంలో తుమ్మల నాగేశ్వరరావు 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో చేసినటువంటి కార్యక్రమాల... బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణులు సద్వినియోగపరచుకోవాలి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
బండ్లగూడ, నాగోల్ మే 14(ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణ సద్వినియోగపరచుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకరణ ఉత్సవం గురువారం బండ్లగూడ, నాగోల్... “తెలంగాణ దళిత సాహిత్య చరిత్రను విస్మరించొద్దు” :బి.ఎస్. రాములు బహిరంగ లేఖ..
హైదరాబాద్ మే 14 (ప్రజా మంటలు):తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురిస్తున్న పునాస ఎప్రిల్-జూన్ 2026 సంచికలో ప్రచురితమైన “తెలుగు సాహిత్యంలో అంబేద్కర్ ప్రభావం” వ్యాసంపై ప్రముఖ సామాజిక తత్వవేత్త, రచయిత, బీసీ కమీషన్ తొలి చైర్మన్ బి.ఎస్. రాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కోయి కోటేశ్వరరావుకు బహిరంగ లేఖ రాశారు.... బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలి: కవిత
హైదరాబాద్ మే 13 (ప్రజా మంటలు):
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని, ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.బుధవారం... కొండగట్టు అంజన్న భక్తులకు ఎం ఎస్ ఆర్ డి ఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ
కొండగట్టు మే 12 ( ప్రజా మంటలు)హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తుల సౌకర్యార్థం మ స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్* ( ఎం ఎస్ ఆర్ డి ఎఫ్) ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ సేవా కార్యక్రమం నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు అరటి... 