గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలు కమిషన్ నిబంధనల మేరకు నిర్వహించాలి. - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

On
గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలు కమిషన్ నిబంధనల మేరకు నిర్వహించాలి. -  జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల జూన్ 5( ప్రజా మంటలు ) : 

ఈ నెల 9 న జరుగనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా , కమీషన్ నిబంధనల మేరకు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.

బుధవారం రోజున చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, పరిశీలకులు కు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...... జిల్లాలో 22 కేంద్రాల్లో 7692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష హాలులోకి ఉదయం 9.00 గంటలకు నిశిత పరిశీలన చేస్తూ కేంద్రం లోకి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 10 గంటలకు మెయిన్ ద్వారం మూసి వేయడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులను బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

పరీక్ష నిర్వహణకు ఏ ఒక్క పొరపాటుకు తావివ్వకుండా నిర్వహించాలని, ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్, పరిశీలకులు సంయుక్తంగా వారికి కేటాయించిన విధులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నియమ నిబంధనల మేరకు నిర్వహించాలని అన్నారు.

అభ్యర్థులు చేయదగినవి, చేయకూడనివి అంశాల బ్యానర్లు ప్రతీ కేంద్రంలో ఏర్పాటుచేయాలని అన్నారు.

విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. కమీషన్ నిబంధనలో పేర్కొన్న గాడ్జెస్ లను కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపారు.

అభ్యర్థులు ఒక గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, వివిధ ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థుల సౌకర్యం కోసం ముందస్తు సమయానికి బస్సు లు నడిచెవిదంగా ఏర్పాట్లు ఆర్టీసీ చేస్తుందని, పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగ కుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు.

పరీక్ష కేంద్రాలలో మెడికల్ టీమ్ లు ఏర్పాటు చేయాలని, త్రాగునీరు తదితర సౌకర్యం ఏర్పాటు చేయాలని అన్నారు. నిర్ణీత సమయాల్లో క్వశ్చన్ పేపర్, ఓ.ఏం.ఆర్. షీట్లు పంపిణీ చేయాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలలోనికి ఏ వాహనాలను అనుమతించకూడదని, బయట పార్కింగ్ చేయాలని అన్నారు.

పరీక్ష కేంద్రాల వద్ద 144 విధించడం, బందోబస్తు ఏర్పాటుచేయడం జరుగుతుందని తెలిపారు.

సెల్ ఫోన్స్, గాడ్జేస్ అనుమతించబోమని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వినోద్ కుమార్, రీజనల్ కోఆర్డినేటర్ వేణు గోపాల్, కలెక్టరేట్ పర్యవేక్షకులు విశ్వంభర్, తదితరులు పాల్గొన్నారు.

Tags