పటన్చేరు #MDR ఫౌండేషన్ కు మరో అరుదైన అవార్డు.

On
పటన్చేరు #MDR ఫౌండేషన్ కు మరో అరుదైన అవార్డు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

పటాన్ చెరు మే 29 (ప్రజా మంటలు) : 

పేదవారికి ఏ అవసరం ఉన్నా, ఆపద్బాంధవుడుల సాయం కోసం ఫౌండేషన్ కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న గొప్ప మహానీయ వ్యక్తి మనసున్న మహారాజు #MDR ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు.

మెగా ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో 2024 ఉగాది పురస్కారాలు సోషల్ సర్వీస్ కేటగిరిలో MDR ఫౌండేషన్ ను బెస్ట్ ఫౌండేషన్ గా ఎంపిక చేసి హైదరాబాద్ బిర్లా సైన్స్ మ్యూజియంలో ఐకాన్ మరియు నంది అవార్డ్స్ ప్రధానోత్సవంలో MDR ఫౌండేషన్ కు నంది అవార్డు ప్రధానం చేశారు.

ప్రతి పేదవారికి ఏ అవసరం ఉన్న అవసరం తీరుస్తూ ఆదుకుంటున్న గొప్ప మహానియ వ్యక్తి #MDR ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు అని ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు అన్నారు. ఈ అవార్డుతో సమాజంలో మరింత బాధ్యత గుర్తు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో #MDR ఫౌండేషన్ సభ్యులు ఆసిఫ్, ప్రణయ్, పార్దు గౌడ్ తో కలసి అవార్డ్ అందుకోవటం జరిగింది.

Tags