మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి క్షేమంగా బయటపడ్డ పసికందు
మళ్లీ అమ్మాయి పుట్టిందని తుప్పల్లో పడేసిన తల్లి
క్షేమంగా బయటపడ్డ పసికందు
రాజమండ్రి ఏప్రిల్ 15 (ప్రజామంటలు): మగ సంతానం పై ఉన్న మమకారం ఓ తల్లిని మానవత్వం లేకుండా చేసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అప్పుడే పుట్టిన పసికందును ఇరవై అడుగుల ఎత్తు నుంచి తుప్పల్లోకి విసిరేసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని కన్నీరు మున్నేరుగా విలపిస్తుంది. ఈ హృదయ విధారకరమైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో చోటుచేసుకుంది. ఇటువంటి సంఘటన గతంలో ఎక్కడ ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు. స్థానికులు, బంధువులు, వైద్యులు తెలిపిన ఈ సంఘటన వివరాలు ఎలా ఉన్నాయి.
వేమగిరి గణపతినగరం ప్రాంతానికి చెందిన తాపీ పనులు చేసే కుటుంబంలో వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వారు ముగ్గురు కూడా ప్రస్తుతం స్కూల్ కి వెళ్తున్నారు. అయితే తల్లికి మాత్రం మగసంతానంపై మమకారం వెంటాడుతూనే ఉంది. అందుకనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నట్లు నమ్మించి ఆ తర్వాత గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియనీయలేదు. అబ్బాయి పుడితే అందరికి చెబుదాం. అమ్మాయి పుడితే ఎవరికి తెలియకుండా మాయం చేద్దామని ఉద్దేశం ఉంది.బంధుమిత్రులకు చుట్టుపక్కల ఎవరికి ఈ విషయం తెలియనివ్వలేదు. చివరికి భర్తకు కూడా అనుమానం రాకుండా మసులుకుంది. పొట్ట పెరుగుతుందని భర్త అడిగితే ఈ మధ్యన ఎక్కువగా తినడం వల్ల పెరుగుతుందని నమ్మబలికింది. స్థానిక వైద్య సిబ్బందికి, అంగన్వాడీలకు గర్భిణీ అనే సమాచారాన్ని ఇవ్వలేదు. అందుకు కావలసిన వైద్య సేవలు కూడా పొందలేదు. ఈ పరిస్థితుల్లో ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. అది గమనించిన ఆ తల్లి భర్తను పిల్లలను చర్చకు పంపించింది.తనకు తానే పురుడు పోసుకుంది. అందుబాటులో ఉన్న కత్తిపీటతో ప్రేగును కత్తిరించింది. అమ్మాయి పుట్టిందని గమనించిన వెంటనే ముందుగా అనుకున్న పథకం ప్రకారం నైటిలో ఆ బిడ్డను చుట్టేసి 20 అడుగుల ఎత్తులో నుంచి తుప్పల్లోకి విసిరేసింది. అక్కడ చెత్త చెదరంతో పాటు పందులు సంచరిస్తూ ఉంటాయి.అక్కడ నుంచి ఆమె ఇంటికి వెళ్ళి పోయి స్నానం చేసి ఎవరికి అనుమానం రాకుండా మచులుకుంది.
అయితే ఆ తుప్పల నుంచి ఏడుపు వినిపిస్తుండటంతో చుట్టుపక్కల వారు అక్కడకి వెళ్ళి చూడగా ముద్దులొలికే పండంటి ఆడశిసువు కనబడిరది. కాలుకి చిన్న రాపిడిగాయం తప్ప అంతా క్షేమంగా ఉంది. అయితే ఆ అమ్మాయి ఎవరనేది అందులోనూ చర్చ మొదలైంది. బయటనుండి ఎవరో అక్కడకు వచ్చి పాడేసే అవకాశం లేనందున అక్కడి వారి పిల్లే అయివుతుందని నిద్దారణకు వచ్చి ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఇంతలో అందరితో పాటు భర్త అక్కడికి వచ్చి చూస్తే ఆ పిల్లకు చుట్టి ఉన్న నైటీ తన భార్యదని గుర్తించాడు.ఆ నైటీ ఆధారంగా ఇంటికెళ్లి భార్యను నిలదీసాడు. దీంతో జరిగిన విషయం ఒప్పుకొని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా వెల్లపించడం మొదలుపెట్టింది. మగ సంతానంపై ఉన్న మమకారంతో ఇలా చేశానని గగ్గోలు పెట్టింది.వెంటనే తల్లి బిడ్డను కడియం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే వారు అక్కడి నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం అక్కడ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు, బంధువులు తెలిపారు. ఈ సంఘటన సోమవారం నుంచి ఈ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ
