మన కేసీఆర్ కాదు… మారిన మనిషి!” – బీఆర్ఎస్‌పై తీవ్ర దాడి, కొత్త పార్టీతో అధికారమే లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సేన - కవిత కొత్త పార్టీ
హైదరాబాద్ ఏప్రిల్ 25 (ప్రజా మంటలు);
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపేలా జాగృతి నేత కేసీఆర్‌పై నేరుగా, నిర్భయంగా విరుచుకుపడ్డారు. “ఇవ్వాళ ఉన్నది మన కేసీఆర్ కాదు… మారిన మనిషి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో ప్రజల కోసం పోరాడిన నాయకుడు, ఇప్పుడు ప్రజలను పట్టించుకోని పాలకుడిగా మారిపోయాడని విమర్శించారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, పదేళ్లలో లక్షల కోట్లు ఖర్చు చేసినా ప్రజలకు ప్రయోజనం చేకూరలేదని మండిపడ్డారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల పేరుతో భారీ వ్యయం జరిగి కూడా, సాగునీరు పరిమిత ఎకరాలకు మాత్రమే అందిందని ఆరోపించారు.
పేదల ఇల్లు కూల్చిన కానరాని కేసీఆర్
ప్రజల ఇళ్ల కూల్చివేతలు, పేదల కష్టాలు, బాధాకర సంఘటనలపై ప్రభుత్వం స్పందించకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఉద్యమ సమయంలో ప్రజల కోసం నిలిచిన నాయకత్వం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోయిందని విమర్శించారు.
మూడు ప్రధాన రాజకీయ పార్టీలపై కూడా తీవ్రంగా దాడి చేస్తూ, రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం అవసరమని స్పష్టం చేశారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు ప్రధాన రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని ప్రకటించారు:
విద్యను పూర్తిగా ఉచితంగా అందిస్తూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. వైద్యాన్ని ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంచి, ఖర్చు భారాన్ని పూర్తిగా తొలగిస్తామని తెలిపారు.
రైతును గౌరవించేలా...
రైతును గౌరవించే పాలనతో 24 గంటల విద్యుత్, అవసరమైన సాయం అందిస్తామని చెప్పారు.
యువతకు స్వయం ఉపాధి కోసం భారీ ఆర్థిక మద్దతు, అలాగే ఒకే ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
చివరగా, “ప్రజల కోసం పోరాటం చేస్తాం… అధికారాన్ని సాధిస్తాం” అంటూ గట్టిగా ప్రకటిస్తూ, తమతో కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎం.వి నరసింహారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల జూన్ 9(ప్రజా మంటలు)జగిత్యాల ఎస్ కె ఎల్ ఎన్ ఆర్ బిఈడి కళాశాల కరెస్పాండెంట్, రచయిత ఎం.వి నరసింహారెడ్డి మరణించగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట రోటరీ క్లబ్ సభ్యులు మంచాల... అటుకుల్లో బొద్దింక..
కొత్తకొండ వైన్స్ సిట్టింగ్ రూమ్‌లో ఘోరం.. సాహితీవేత్త ఎం.వి. నరసింహారెడ్డి కన్నుమూత
జగిత్యాల, జూన్ 08 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత, విద్యావేత్త, ఎస్‌కేఎల్‌ఎన్ రావు బీఈడీ కళాశాల కరెస్పాండెంట్ ఎం.వి. నరసింహారెడ్డి సోమవారం రాత్రి, తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతి సాహితీ, విద్యా రంగాలకు తీరని లోటుగా భావిస్తున్నారు.ఎం.వి. నరసింహారెడ్డి తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారు. నాలుగు వేదాలను... వరి కొయ్యలు కాల్చి పలువురి ప్రమాదానికి కారణమైన వారిపై ప్రజావాణిలో ఫిర్యాదు
జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు)
జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లి గ్రామ శివారులో తుమ్మచెట్టు కు నిప్పంటుకొని అదే మార్గంలో వస్తున్న బైరి వేణు ,కడారి భరత్ లు గాయాలపాలు అయినారు. ఇట్టి విషయంపై జిల్లా కేంద్రం విజయపురి కాలనీకి చెందిన సంబుమహేష్( 29) తండ్రి మల్లయ్య సోమవారం తుమ్మచెట్టు కాలడానికి కారకులైన
మిట్టపల్లి... ఎంవి నరసింహారెడ్డి అస్తమయం
జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు)జగిత్యాల ఎస్ కె ఎల్ ఎన్ రావు బిఈడి కళాశాల కరెస్పాండెంట్, రచయిత ఎం.వి నరసింహారెడ్డి ఈరోజు సోమవారం సాయంత్రం 7 గంటలకు జగిత్యాలలో ఆయన నివాసంలో మృతి చెందారు. ఆయన నాలుగు వేదాలు మరియు ఉపనిషత్తులు జోక్స్ బ్యాంక్ జోక్స్ టానిక్ లాంటి హాస్య రచనల పుస్తకాలు,... మమతా కాంగ్రెస్ గూటికి చేరితే... బీజేపీ వ్యూహానికి అతిపెద్ద ఎదురుదెబ్బ?
న్యూ డిల్లీ జూన్ 08 :
భారత రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఒక కొత్త రాజకీయ పునర్వ్యవస్థీకరణకు సంకేతాలిస్తున్నాయా? ఢిల్లీలో జరిగిన INDIA కూటమి సమావేశం తర్వాత రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలంటే ప్రతిపక్ష శక్తుల ఐక్యత తప్పనిసరి అనే... మారుతి స్నేహ మండలి వారిచే ప్రతిభా పురస్కారాల వితరణ
జగిత్యాల జూన్ 7( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో మారుతి స్నేహ మండలి వారిచే ప్రతిభా పురస్కారాలు అందజేయబడినవి. 2025 26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ యందు 1000 మార్కులకు గాను 982 ఎంపీసీ విభాగం నందు సాధించిన జి సుప్రీత్, ఎస్ ఎస్ సి నందు పి . హాసినిశర్మ 600/578 మార్కులు సాధించగా... హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే విద్యార్థులకు పురస్కారాల ప్రధానం
జగిత్యాల జూన్ 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో గత తొమ్మిది సంవత్సరాలుగా హనుమాన్ చాలీసా భక్త బృందం వారిచే సామూహిక పారాయణం నిర్వహించబడుచున్నది. కాగా ఈ సంవత్సరము నుండి నూతనంగా ఎస్ ఎస్ఎస్సి ,ఇంటర్మీడియట్, డిగ్రీ నందు 90% పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడానికి శ్రీకారం చుట్టారు.... ₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
జగిత్యాల, జూన్ 04 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ₹80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో గురువారం ఈ దాడి నిర్వహించారు.... నందికొండ మున్సిపల్ అధికారుల తీరుపై టీఆర్ఎస్ ఆగ్రహం
నాగార్జునసాగర్, జూన్ 4 (ప్రజా మంటలు):
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ మున్సిపల్ అధికారులు పైలాన్ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా గద్దెను కూల్చివేయడంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల జెండా గద్దెలను వదిలి టీఆర్ఎస్ గద్దెను మాత్రమే తొలగించడం వివక్షపూరిత చర్య అని... కన్నాపూర్ లో కాలిన ఈత - తాటి వనం సందర్శించిన మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల జూన్2- ( ప్రజా మంటలు)జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో గత 5 రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలిపోయిన 500 ఈత - తాటి చెట్లను జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మంగళ వారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కన్నాపూర్ గ్రామంలోని దాదాపు 27... మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల పెంపు కోసం ప్రచారo
మల్యాల జూన్ 2 (ప్రజా మంటలు)
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలను పెంచడం మరియు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలతో పోటీని ఎదుర్కొనే దృష్టితో, మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శివరామకృష్ణ మరియు అధ్యాపకులు ఇంటింటికీ ప్రచారం చేపట్టారు.
ఈ ప్రచారంలో ఎస్.ఎస్.సి. పాసైన ప్రతి విద్యార్థిని మరియు వారి తల్లిదండ్రులను కలిసి, కళాశాల... 