జీవన్ రెడ్డి పార్టీ మార్పు – రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపా? లేక ముగింపుకు నాంది?

గత వైభవం – ప్రారంభంలో శక్తివంతమైన ఎదుగుదల

On
జీవన్ రెడ్డి పార్టీ మార్పు – రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపా? లేక ముగింపుకు నాంది?

జగిత్యాలపై అధిక భావోద్వేగం – బలమా? బలహీనతా?


తెలంగాణ రాజకీయాల్లో అప్పుడప్పుడూ వ్యక్తిగత నిర్ణయాలు పెద్ద చర్చలకు దారి తీస్తాయి. అలాంటి నిర్ణయాల్లో ఒకటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం,.  వెనుక ఉన్న రాజకీయ లెక్కలు, వ్యక్తిగత పరిస్థితులు, స్థానిక వర్గ రాజకీయాలు— అన్ని కలిసి చూస్తే ఇది కేవలం పార్టీ మార్పు కాదు, ఒక దీర్ఘకాల రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా కనిపిస్తోంది.


గత వైభవం – ప్రారంభంలో శక్తివంతమైన ఎదుగుదల


జీవన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే, ప్రారంభ దశలోనే మంచి అవకాశాలు దక్కాయి. 1981 లో మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షులుగా, 1983 లో తెలుగు దేశం పార్టీ నుండి, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా, మంత్రి వర్గంలో స్థానం పొందడం ఆయన రాజకీయ ప్రతిభకు నిదర్శనం. అయితే, ఆ విజయాన్ని స్థిరమైన ఆధిపత్యంగా మార్చుకోవడంలో మాత్రం ఆయన పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు.


1980ల నుంచే జగిత్యాల నియోజకవర్గం వర్గ రాజకీయాలకు కేంద్రమైంది. ఒక దశలో ఆయన ప్రభావం ఉన్నప్పటికీ, తర్వాతి కాలంలో వరుసగా ఎదురైన రాజకీయ ప్రతిబంధకాలు ఆయన స్థాయిని తగ్గించాయి.


జగిత్యాల రాజకీయ వాస్తవం – వర్గాల ఆధిపత్య పోరు


జగిత్యాల నియోజకవర్గంలో ప్రధానంగా వెలమ, రెడ్డి వర్గాల మధ్య పోటీ కీలక పాత్ర పోషించింది. 1983 నుండి 2014వరకు ఈ ప్రాంతంలో అధికారం మారుతూ వచ్చినా, ఒక వర్గం పూర్తిగా ఆధిపత్యం చెలాయించలేకపోయింది.

గతంలో వేల రాజకీయ ఆధిపత్యం ఉన్న ఈ నియోజకవర్గం 1983 ఎన్నికల్లో రెడ్డి వర్గానికి దక్కింది. ఆతరువాత, 1985,1994, 2009, ఎన్నికలలో బీసీ వర్గాలకు చెందిన గుడిసెల రాజేశం గౌడ్, ఎలుగందుల రమణ విజయం సాధించి జీవన్ రెడ్డికి చెక్ పెట్టారు. 

అంటే వేలం నాయకత్వం. పరిస్థితులకు అనుకూలంగా బీసీలకు మద్దతు ప్రకటించడంతో, రెడ్డి వర్గానికి ఎదురుదెబ్బ తలిగింది. కానీ,  పదకొండు సార్లు పోటీ చేసిన జీవన్ రెడ్డి 6 సార్లు గెలిచి వెలమ వర్గాన్ని 2018 వరకు అడ్డుకున్నారు. 


అయితే 2018 తర్వాత పరిస్థితులు మారాయి. వెలమ వర్గం ప్రభావం పెరగడంతో, బీసీ నాయకులలో ఐక్యత లేకపోవడం, BRS పార్టీ వెలమ నాయకులకే ప్రాధాన్యత ఈయడంతో, జీవన్ రెడ్డి శకానికి ముగింపు పలికినట్లు అయింది.

జీవన్ రెడ్డి వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. 2023 ఎన్నికల్లో కూడా ఓటమి పాలవడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నార్థక చిహ్నం పెట్టింది.


కాంగ్రెస్‌లో అసంతృప్తి – మార్పుకు దారితీసిన కారణం


జీవన్ రెడ్డి పార్టీ మార్పుకు ప్రధాన కారణం కాంగ్రెస్‌లో పెరిగిన అసంతృప్తి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గెలిచిన నాయకులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం, ఓడిపోయిన వారికి తక్కువ అవకాశాలు ఇవ్వడం ఆయనను నిరాశకు గురిచేసింది.
అంతేకాకుండా, స్థానికంగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఇతర నేతలను ముందుకు తేవడం వల్ల ఆయన స్థానం క్రమంగా బలహీనపడింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు పార్టీని వీడే నిర్ణయం తీసుకున్నారు.


బీఆర్ఎస్‌లో భవిష్యత్తు – అవకాశాలా? లేక అనిశ్చితి?


బీఆర్ఎస్‌లో చేరడం ద్వారా జీవన్ రెడ్డి రాజకీయంగా పునరుద్ధరణ పొందుతారా అన్నది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఆయన వయస్సు 75 ఏళ్లు. రాజకీయాల్లో వారసత్వం లేకపోవడం కూడా ఒక పెద్ద లోపంగా కనిపిస్తోంది.
కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకురాకపోవడం వల్ల ఆయన తర్వాత నాయకత్వం కొనసాగించే వ్యక్తి లేరు. ఇది పార్టీలు కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి ఒక కారణంగా మారుతోంది. పార్టీలో కూడా, రెండవ తరం నాయకత్వాన్ని ఆయన ప్రోత్సహించలేదు.


పట్టణ ఓటర్లు – కీలక బలహీనత


జీవన్ రెడ్డి రాజకీయాల్లో మరో ముఖ్యమైన అంశం పట్టణ ఓటర్ల మద్దతు లేకపోవడం. జగిత్యాల పట్టణంలో ఆయనకు ఎప్పుడూ స్పష్టమైన మెజార్టీ రాలేదు. గ్రామీణ ఓట్లతో గెలిచిన సందర్భాలు ఉన్నా, పట్టణ ఓటర్లు మాత్రం ఆయనకు అనుకూలంగా లేరు.

ఇది భవిష్యత్తులో మరింత పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది.


నియోజకవర్గాల పునర్విభజన – కొత్త సవాళ్లు


వచ్చే ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. జగిత్యాల నియోజకవర్గం స్వరూపం మారితే, జీవన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది పెద్ద ప్రశ్న.
ఒకవేళ పట్టణ కేంద్రంగా నియోజకవర్గం మారితే, ఆయన గెలుపు అవకాశాలు మరింత తగ్గే అవకాశం ఉంది. రిజర్వేషన్ మార్పులు కూడా ఆయన రాజకీయ లెక్కలను పూర్తిగా మార్చేయవచ్చు.


జగిత్యాలపై అధిక భావోద్వేగం – బలమా? బలహీనతా?


జీవన్ రెడ్డి రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అంశం జగిత్యాలపై ఉన్న అతిప్రేమ.  ఆయన అన్నిటిని వదిలి జగిత్యాలకే పరిమితమయ్యారు.
ఈ భావోద్వేగం ఒకవైపు ఆయనకు గుర్తింపునిచ్చినా, మరోవైపు రాజకీయ అవకాశాలను పరిమితం చేసింది. కొత్త ప్రాంతాల్లో ఎదగలేకపోవడం ఆయనకు నష్టంగా మారింది.


  తగ్గుతున్న నాయకత్వ ప్రభావం


ప్రస్తుత పరిస్థితుల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నా, బీఆర్ఎస్‌లో ఉన్నా, ఆయన ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆయన పాత్ర ఎక్కువగా మీడియా వ్యాఖ్యలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజకీయంగా చూస్తే, ఇది ఒక శక్తివంతమైన నాయకుడి ప్రయాణంలో చివరి దశగా విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ మార్పు ఆయనకు కొత్త జీవం పోస్తుందా, లేక ఇది ముగింపుకు నాంది అవుతుందా అన్నది వచ్చే కాలమే తేల్చాలి..

Tags
Join WhatsApp

More News...

Comment  State News 

జీవన్ రెడ్డి పార్టీ మార్పు – రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపా? లేక ముగింపుకు నాంది?

జీవన్ రెడ్డి పార్టీ మార్పు – రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపా? లేక ముగింపుకు నాంది? జగిత్యాలపై అధిక భావోద్వేగం – బలమా? బలహీనతా? తెలంగాణ రాజకీయాల్లో అప్పుడప్పుడూ వ్యక్తిగత నిర్ణయాలు పెద్ద చర్చలకు దారి తీస్తాయి. అలాంటి నిర్ణయాల్లో ఒకటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం,.  వెనుక ఉన్న రాజకీయ లెక్కలు, వ్యక్తిగత పరిస్థితులు, స్థానిక వర్గ రాజకీయాలు— అన్ని కలిసి చూస్తే ఇది కేవలం...
Read More...
Local News 

తెలంగాణ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తుంది ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తుంది ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్    జగిత్యాల ఏప్రిల్ 3 ( ప్రజా మంటలు) చదువుతోపాటు క్రీడల పట్ల శ్రద్ధ చూపిన విద్యార్తులు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. తల్లితండ్రులతోపాటు స్వచ్ఛంద సంస్థలు సైతం క్రీడలను ప్రోత్సహించాలన్నారు. క్రీడలతో మానసిక స్థైర్యం పెంపండడమే కాకుండా, చదువు పట్ల మరింత శ్రద్ధ ఏర్పడుతుందన్నారు. జూన్ నెలలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని జగిత్యాల కు...
Read More...
State News 

ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీపై కవిత ఆగ్రహం

ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీపై కవిత ఆగ్రహం హైదరాబాద్, ఏప్రిల్ 03 (ప్రజా మంటలు): ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై భారీగా ఫీజుల భారం మోపుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకేసారి 30 నుండి 40 శాతం వరకు ఫీజులు పెంచడం దోపిడీ చర్య అని విమర్శించారు.శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె,...
Read More...
Local News  State News 

“కాళేశ్వరం పై లక్ష కోట్లు ఆరోపణలు అసత్యం – మేడిగడ్డ పునరుద్ధరణ ఎందుకు చేయట్లేదు?”: జీవన్ రెడ్డి ఫైర్

“కాళేశ్వరం పై లక్ష కోట్లు ఆరోపణలు అసత్యం – మేడిగడ్డ పునరుద్ధరణ ఎందుకు చేయట్లేదు?”: జీవన్ రెడ్డి ఫైర్ జగిత్యాల, ఏప్రిల్ 03 (ప్రజా మంటలు): పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై “లక్ష కోట్లు కొట్టుకుపోయాయి” అనే వ్యాఖ్యలు ఆశ్చర్యకరమని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల పట్టణంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు....
Read More...
Local News 

సర్దార్ సర్వాయి పాపన్న నేటి యువతకు స్ఫూర్తి డా చంద్రశేఖర్ గౌడ్

సర్దార్ సర్వాయి పాపన్న నేటి యువతకు స్ఫూర్తి డా చంద్రశేఖర్ గౌడ్ జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు) సర్దార్ సర్వాయి పాపన్న నేటి యువతకు స్ఫూర్తి అని జిల్లా గ్రంధాలే మాజీ చైర్మన్ డా చంద్రశేఖర్ గౌడ్ అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  317 వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని గొల్లపెల్లి రోడ్ బైపాస్ దారిలో ఉన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళులు...
Read More...
Local News 

శ్రీ గుండు హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

శ్రీ గుండు హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి    జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు)  పట్టణంలోని మంచి బావి దగ్గర గుండు హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా తాజామాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.  ఆడువాల జ్యోతి లక్ష్మణ్  వారి వెంట
Read More...
Local News 

ప్రజల భాగస్వామ్యంతోనే వార్డు సమస్యలు తెలుసుకోవచ్చు- మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

ప్రజల భాగస్వామ్యంతోనే వార్డు సమస్యలు తెలుసుకోవచ్చు- మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు)“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ రోజు 40వ వార్డులో నిర్వహించిన వార్డు సభ కార్యక్రమంలో హాజరై ఆయన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వార్డు సభల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి,...
Read More...
Local News 

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గొప్ప కార్యక్రమం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గొప్ప కార్యక్రమం  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల ఏప్రిల్ 2 (ప్రజా మంటలు)ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస గ్రామ పరిధిలో గల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్...
Read More...
Comment  State News 

తెలంగాణలో మహిళా రాజకీయ శక్తి – కొత్త పార్టీతో మారబోయే సమీకరణాలు

తెలంగాణలో మహిళా రాజకీయ శక్తి – కొత్త పార్టీతో మారబోయే సమీకరణాలు   వర్గాతీత రాజకీయాలకు వేదికగా జాగృతి : ఈ మార్పుకు సంకేతం?  భారతదేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, మహిళల పాత్ర ఎప్పుడూ పరిమితంగానే కనిపిస్తుంది. సామాజికంగా, సాంప్రదాయంగా స్త్రీని రెండవ స్థానంలో ఉంచిన వ్యవస్థ రాజకీయాల్లో కూడా ప్రతిబింబించింది. అయినప్పటికీ, ప్రతీ యుగంలో కొంతమంది మహిళలు ఈ అడ్డంకులను ఛేదించి తమ నాయకత్వాన్ని చాటారు.చరిత్రలో రాణి...
Read More...
Local News 

టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు గా రెండవ సారి ఎన్నికైన మారం జగదీశ్వర్ ను సన్మానించిన  జగిత్యాల టిఎన్జీఓ లు

టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు గా రెండవ సారి ఎన్నికైన మారం జగదీశ్వర్ ను సన్మానించిన  జగిత్యాల టిఎన్జీఓ లు కరీంనగర్ ఏప్రిల్ 1(ప్రజా మంటలు)ఇటీవల టిఎన్జీఓ కేంద్ర సంఘానికి జరిగిన ఎన్నికలలో  రెండవ సారి రాష్ట్ర అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నికైన మారం జగదీశ్వర్ ని  జగిత్యాల జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డి ల ఆధ్వర్యంలో జగిత్యాల టిఎన్జీఓ లు ఘనంగా సన్మానించారు. కరీంనగర్...
Read More...
State News 

కొండగట్టు లో పందిళ్ళు కూలిపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం - కవిత

కొండగట్టు లో పందిళ్ళు కూలిపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం - కవిత హైదరాబాద్, ఏప్రిల్ 01 (ప్రజా మంటలు): కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలిపోవడంతో 15 మంది భక్తులు గాయపడిన ఘటన ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన ట్విట్టర్ లో విమర్శించారు. . హనుమాన్ చిన్న జయంతి వేడుకల సందర్భంగా నాసిరకంగా ఏర్పాటు చేసిన పందిళ్ల వల్లే ఈ...
Read More...
Local News 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకుని పదవి విరమణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకుని పదవి విరమణ జగిత్యాల మార్చి 31 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం ప్రధాన అర్చకులు మేడిపల్లి రాజన్న శాస్త్రి పదవి విరమణ మంగళవారం జరగగా ఆలయ ఆవరణలో రాజన్న శాస్త్రి పద్మ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు, ఈవో సురేందర్  తదితరులు ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు. ఈ...
Read More...