హీలింగ్ క్యాపిటల్ గా హైదరాబాద్. - రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

On
హీలింగ్ క్యాపిటల్ గా హైదరాబాద్. - రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను హీలింగ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్ కేర్ ను... డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో అనుసంధానించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. లండన్ కేంద్రంగా పనిచేసే ‘PHUSE’ ఆధ్వర్యంలో ‘PHUSE APAC Connect 2026’ పేరిట హెచ్ఐసీసీలో నిర్వహించిన సదస్సులో క్లినికల్ రీసెర్చ్, డేటా సైన్స్ అనుసంధానంపై దేశ, విదేశాల నిపుణులు మేధోమథనం చేశారు. శనివారం ఏర్పాటు చేసిన ఈ కాన్ఫరెన్స్ ముగింపు వేడుకకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ....

  • హెల్త్ కేర్ భవిష్యత్తు రాబోయే రోజుల్లో క్లినికల్ సైన్స్, ఏఐ, రియల్ వరల్డ్ ఎవిడెన్స్ మేళవింపుపైనే ఆధారపడి ఉంటుందన్నారు.
  • ముఖ్యంగా క్లినికల్ రీసెర్చ్ లో విప్లవాత్మక మార్పులొస్తాయని, టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతుందన్నారు.
  • ఇలాంటి తరుణంలో అందుకు అవసరమైన ఎకో సిస్టంను ఇప్పటి నుంచే తెలంగాణలో అభివృద్ధి చేసేలా దార్శనికతతో కూడిన అడుగులు వేస్తున్నామన్నారు.
  • అందులో భాగంగానే... ఏఐ సిటీ, యంగ్ ఇండియన్ స్కిల్స్ వర్సిటీ, జీనోమ్ వ్యాలీ విస్తరణ, డేటా మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైలింగ్, మెడికల్ టూరిజం పాలసీ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్ కు శ్రీకారం చుట్టామన్నారు. సైన్స్, డేటా, హ్యూమానిటీ కలిసి పనిచేసినప్పుడే సమాజానికి నిజమైన మేలు జరుగుతుందన్నారు.
  • అందుకోసం పరిశోధకులు, వైద్యులు, సాంకేతిక నిపుణులు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరముందన్నారు.
  • నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పరిశోధకులను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.

కార్యక్రమంలో PHUSE బోర్డు ఛైర్మన్ స్టీఫెన్ బాఫోర్డ్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ సర్వేష్ సింగ్, ఐటీ అడ్వైజర్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

బి.ఆర్.ఎస్ బహిరంగ సభ విజయవంతం చేయండి

బి.ఆర్.ఎస్ బహిరంగ సభ విజయవంతం చేయండి జగిత్యాల ఏప్రిల్ 15 ( ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈనెల 20వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ గురించి సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  ఎమ్మెల్సీ ఎల్ రమణ  కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ...
Read More...
Local News  State News 

పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేకంగా రైతుల ఆందోళన.. వికారాబాద్‌లో కవిత అరెస్ట్

పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేకంగా రైతుల ఆందోళన.. వికారాబాద్‌లో కవిత అరెస్ట్ వికారాబాద్, ఏప్రిల్ 15 (ప్రజా మంటలు): పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ వికారాబాద్‌లో రైతులు, తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎండలో కూర్చొని ధర్నా నిర్వహించారు.ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,...
Read More...
Local News 

జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా  జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనభట్ల దినేష్ 

జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా  జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనభట్ల దినేష్  జగిత్యాల ఏప్రిల్ 14 (ప్రజా మంటలు) జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా నియామకమైన జిల్లా  గ్రంథాలయ అధ్యక్షుడు సంఘనభట్ల దినేష్ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఆవరణ టిటిడి దేవస్థాన ధ్యానమండలిలో సంగనభట్ల దినేష్ కు తుంగూరు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అర్షకోట రాజగోపాల్...
Read More...
Local News 

మెట్పల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సంజయ్

మెట్పల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సంజయ్ మెట్పల్లి, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు): బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెట్పల్లిలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. సంజయ్, న్యాయవాది తుల రాజేందర్ కుమార్, తులగంగవ్వ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం...
Read More...
State News 

అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?

అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?   హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్‌ను...
Read More...
State News 

రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే

రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్‌కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్...
Read More...
Local News 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు  జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు...
Read More...
Crime  State News 

విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్

విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్ వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన...
Read More...
Local News 

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం...
Read More...
Local News 

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు): సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు.  తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా...
Read More...
Local News 

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్‌ రమేష్‌ 

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్‌ రమేష్‌     సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు): టీఎన్‌జీవో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్‌ పల్లాటి రమేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  టీఎన్‌జీవో యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో  సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం  సికింద్రాబాద్,  ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):  హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ...
Read More...