భగవంతుని ముందు అందరు సమానమే..
జగిత్యాల జిల్లా ప్రతినిధి మార్చి 29(ప్రజా మంటలు):
ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం రోజున నిర్వహించిన స్వామి వార్ల రథోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.....
ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి రథోత్సవంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని,భగవంతుని ముందు అందరూ సమానమే అని, ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నంది విగ్రహం నుండి దేవాలయం వరకు వాహనాలను అనుమతించడం జరగలేదని,వచ్చే భక్తులకు అన్నదాన విషయంలో నాణ్యమైన సన్న బియ్యన్ని వాడటం జరిగిందని,ధర్మపురి నుండి హైదరాబాద్ కి వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి ఏసీ బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఎన్నికల కోడ్ అనంతరం బస్సులను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని,స్వామి వారి కృప ఆశీస్సులు ధర్మపురి ప్రజానికంపై ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
