ఇందాపూర్ డెయిరీ చంద్రబాబుదే – టీటీడీ నెయ్యి స్కాంపై ఆధారాలతో జగన్ సంచలన ఆరోపణలు
టీటీడీ నెయ్యి సరఫరాలో అక్రమాలు – సీబీఐ విచారణ జరగాలి
అమరావతి ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):
తిరుపతి లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యి వెనుక పెద్ద స్కాం దాగి ఉందని, ఇందాపూర్ డెయిరీ పూర్తిగా చంద్రబాబుకు చెందినదేనని వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలను ప్రజల ముందుంచుతూ, నిజాలు బయటకు వచ్చాక ప్రజలే ఆలోచించాలని వ్యాఖ్యానించారు.
హెరిటేజ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 16, 2026 నాటికి ఇందాపూర్ డెయిరీని మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా చూపించారని, వివాదం బయటపడిన వెంటనే ఫిబ్రవరి 15, 2026 తేదీతోనే కో-మ్యాన్యుఫాక్చరింగ్ లొకేషన్‌గా మార్చారని జగన్ వెల్లడించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో హెరిటేజ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ హెడ్‌ను తొలగించిందని తెలిపారు.
2015లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ నెయ్యి సరఫరా వ్యవహారాల్లో ఇందాపూర్ డెయిరీని ప్రమేయం చేశారని, 2016 మార్చి 18న ఇందాపూర్ డెయిరీ నెయ్యి నాణ్యత లోపించిందని గుర్తు చేశారు. డిస్‌క్వాలిఫై అయిన మూడు నెలల్లోనే చంద్రబాబు ఇందాపూర్ డెయిరీకి మళ్లీ అర్హత కల్పించారని జగన్ ఆరోపించారు.
నవంబర్ 27, 2016న హెరిటేజ్ మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ ద్వారా ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి టెండర్ ఇచ్చారని, అప్పట్లో కేజీ నెయ్యి ధర రూ.321గా నిర్ణయించారని తెలిపారు. 2024లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే అదే ఇందాపూర్ డెయిరీకి మళ్లీ టెండర్ ఖరారై, కేజీ నెయ్యి ధర రూ.658కి పెరిగిందని విమర్శించారు.
టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సంస్థలకు కేంద్ర ల్యాబ్ పరీక్షల అనంతరం మాత్రమే సర్టిఫికెట్లు ఇస్తారని తెలిపారు. అలాగే బోలే బాబా ఆర్గానిక్ డెయిరీ, హర్ష్ డెయిరీకి చెందినదేనని ఆధారాలు ఉన్నాయని జగన్ అన్నారు. 2018 జూన్ 26న చంద్రబాబు హయాంలోనే బోలే బాబాకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చారని, 2019 మార్చి 6న 82 వేల కేజీల నెయ్యి సరఫరాకు ఆర్డర్లు ఇచ్చారని వెల్లడించారు.
బోలే బాబా సంస్థ తమది హెరిటేజ్‌తో కలిసి పనిచేస్తోందని ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఇండియా మార్ట్‌లో ప్రకటించిందని తెలిపారు. హెరిటేజ్ విజయవాడ, హెరిటేజ్ హైదరాబాద్ వేర్వేరు కాదని, హెరిటేజ్ రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఒకటే కాదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు చేసిన అక్రమాలపై సీబీఐ లేదా అంతకంటే ఉన్నత స్థాయి సంస్థలు విచారణ జరిపి జైలు శిక్ష విధించినా తప్పులేదని జగన్ వ్యాఖ్యానించారు. టీటీడీ నెయ్యి సరఫరా వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్‌ను... రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్‌కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్... శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు
జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు... విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్
వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన... ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర
గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం... వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా... మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్ రమేష్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
టీఎన్‌జీవో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్ పల్లాటి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్‌జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ... ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC: ఎం. లవిష – 979/1000BiPC: కె. నవీన – 971/1000CEC: కె. రతిక – 935/1000... బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు
ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది.
ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల... భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు
గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో... ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం
జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర... 