చిన్న పత్రికలపై వివక్షపై నిరసన : సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన

On
చిన్న పత్రికలపై వివక్షపై నిరసన : సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):

కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ గుర్తింపు ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు, ఎంప్యానల్‌మెంట్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు.

టీడబ్ల్యూజేఎఫ్ ఇచ్చిన “ఛలో సమాచార భవన్” పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు సమాచార భవన్ ఎదుట ర్యాలీ నిర్వహించి, దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు.IMG-20260217-WA1566

ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న, మధ్య తరహా పత్రికలపై అణచివేత కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 44 వేల అక్రెడిటేషన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఎంప్యానల్‌మెంట్ ఉన్న కొద్ది పత్రికలకే కార్డులు ఇస్తోందని విమర్శించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ఎన్ఐ గుర్తింపు ఆధారంగా అక్రెడిటేషన్లు ఇచ్చారని, ఇప్పుడు ఆ విధానాన్ని పక్కన పెట్టారని ఆరోపించారు.

ఎంప్యానల్‌మెంట్ పేరుతో చిన్న పత్రికలను పక్కన పెట్టడం వల్ల వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని, సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వెంటనే ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి పత్రికకు అక్రెడిటేషన్ ఇవ్వాలని, ఎంప్యానల్‌తో సంబంధం లేకుండా నెలకు కనీసం ఒక ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులకు ఉచిత ఆర్టీసీ బస్ పాస్, హెల్త్ కార్డులు, భీమా సదుపాయం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు తన్నీరు శ్రీనివాస్, కె. పాండురంగారావు, పద్మనాభరావు, యర్రమిల్లి రామారావు, హైదరాబాద్ జిల్లా నాయకులు వి. రవికుమార్, శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మం, సంతోష్, మేడ్చల్ జిల్లా నాయకులు మల్లేశం, గడ్డమీది అశోక్, సూర్యాపేట జిల్లా నాయకులు పాల్వాయి జానయ్య, హరి ప్రసాద్, వరంగల్ జిల్లా నాయకులు జక్కుల విజయ్ కుమార్, స్వామిదాస్, నిజామాబాద్ జిల్లా నేతలు కుంచెం శ్రీనివాస్, పానుగంటి శ్రీనివాస్, నల్గొండ జిల్లా నాయకులు వెలుతురు యాదయ్య, జీడిమట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఐ అండ్ పీఆర్ జాయింట్ డైరెక్టర్ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు.

Join WhatsApp

More News...

Local News 

బి.ఆర్.ఎస్ బహిరంగ సభ విజయవంతం చేయండి

బి.ఆర్.ఎస్ బహిరంగ సభ విజయవంతం చేయండి జగిత్యాల ఏప్రిల్ 15 ( ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈనెల 20వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ గురించి సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  ఎమ్మెల్సీ ఎల్ రమణ  కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ...
Read More...
Local News  State News 

పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేకంగా రైతుల ఆందోళన.. వికారాబాద్‌లో కవిత అరెస్ట్

పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేకంగా రైతుల ఆందోళన.. వికారాబాద్‌లో కవిత అరెస్ట్ వికారాబాద్, ఏప్రిల్ 15 (ప్రజా మంటలు): పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ వికారాబాద్‌లో రైతులు, తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎండలో కూర్చొని ధర్నా నిర్వహించారు.ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,...
Read More...
Local News 

జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా  జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనభట్ల దినేష్ 

జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా  జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంఘనభట్ల దినేష్  జగిత్యాల ఏప్రిల్ 14 (ప్రజా మంటలు) జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా నియామకమైన జిల్లా  గ్రంథాలయ అధ్యక్షుడు సంఘనభట్ల దినేష్ అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరం ఆవరణ టిటిడి దేవస్థాన ధ్యానమండలిలో సంగనభట్ల దినేష్ కు తుంగూరు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన అర్షకోట రాజగోపాల్...
Read More...
Local News 

మెట్పల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సంజయ్

మెట్పల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సంజయ్ మెట్పల్లి, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు): బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెట్పల్లిలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. సంజయ్, న్యాయవాది తుల రాజేందర్ కుమార్, తులగంగవ్వ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం...
Read More...
State News 

అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?

అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?   హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్‌ను...
Read More...
State News 

రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే

రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్‌కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్...
Read More...
Local News 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు  జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు...
Read More...
Crime  State News 

విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్

విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్ వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన...
Read More...
Local News 

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం...
Read More...
Local News 

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు): సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు.  తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా...
Read More...
Local News 

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్‌ రమేష్‌ 

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్‌ రమేష్‌     సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు): టీఎన్‌జీవో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్‌ పల్లాటి రమేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  టీఎన్‌జీవో యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో  సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం  సికింద్రాబాద్,  ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):  హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ...
Read More...