జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: చైర్మన్ పదవిపై అనివార్య సయోధ్య

రెబెల్స్ ప్రభావం,: బి ఫారమ్‌ల యుద్ధం : అడ్రస్ గల్లంతైన బి ఆర్ ఎస్,  పాత? కొత్త? ఎవరు కాబోయే  ఛైర్పర్సన్ ?

On
జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: చైర్మన్ పదవిపై అనివార్య సయోధ్య

చైర్మన్ పదవి : ఘర్షణా? సయోధ్యా?
నలుగురి మధ్యలో పోటీ

జగిత్యాల ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు):

జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల రాజకీయాన్ని పూర్తిగా తలకిందులు చేశాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ ఈ ఎన్నికల్లో తన రాజకీయ బలాన్ని స్పష్టంగా చూపించారు. కాంగ్రెస్ తరఫున ఆయన వర్గానికి 35 బి ఫారమ్‌లు దక్కగా, మరో 15 మంది రెబెల్ అభ్యర్థులను రంగంలోకి దించడం రాజకీయంగా సంచలనంగా మారింది.

ఇదే సమయంలో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అధిష్టానంతో ఎంతగా ప్రయత్నించినా ఆయన వర్గానికి కేవలం 15 బి ఫారమ్‌లే లభించాయి. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగిన జీవన్ రెడ్డి, తనకు జరిగిన అవమానంగా భావించి, ఎదురుతిరిగి మరో 35 మంది పాత కాంగ్రెస్ కార్యకర్తలను రెబెల్‌లుగా నిలిపారు. ఈ పరిణామం కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో చీలికను బహిర్గతం చేసింది.

బీజేపీలో పాత–కొత్త పోరు

భారతీయ జనతా పార్టీలో కూడా అంతర్గత కలహాలు స్పష్టంగా కనిపించాయి. పాత కౌన్సిలర్లను పక్కనపెట్టి, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలన్న నిర్ణయంతో బోగ శ్రావణి, ఎంపీ అరవింద్ కలిసి కొత్త అభ్యర్థులను ఎంపిక చేశారు. బియ్యం వ్యాపారంలో పేరు తెచ్చుకున్న కొండ లక్ష్మణ్‌ను, ఆయన భార్యను పార్టీలో చేర్చి చైర్మన్ అభ్యర్థిగా ముందుకు తీసుకురావడం విమర్శలకు దారి తీసింది. ఫలితంగా బీజేపీకి 6 స్థానాలు మాత్రమే దక్కాయి, అందులో 3 మంది ఇండిపెండెంట్లు (బీజేపీ రెబెల్స్) కూడా ఉన్నారు.

బీఆర్ఎస్ పతనం – ఎంఐఎం ఎంట్రీ

మొన్నటి వరకు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఈ ఎన్నికల్లో కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. ఇది గులాబీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు ఎంఐఎం తొలిసారిగా జగిత్యాలలో 2 స్థానాలు గెలుచుకుని తన ఉనికిని చాటింది.

అసలు లెక్కలు ఏంటి?

 మొత్తం 50 వార్డుల్లో

  • ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం – 18 స్థానాలు
  • జీవన్ రెడ్డి వర్గం – 17 స్థానాలు
    అంటే కాంగ్రెస్ పార్టీ పేరుతో గెలిచిన 35 స్థానాల్లో, మూడొంతుల మంది మాజీ బీఆర్ఎస్ నేపథ్యమున్నవారే కావడం గమనార్హం.
చైర్మన్ పదవి: ఘర్షణా? సయోధ్యా?

ఇప్పటి వరకు ఒకరినొకరు రాజకీయంగా తీవ్రంగా విమర్శించుకున్న సంజయ్ కుమార్–జీవన్ రెడ్డి వర్గాలు, ఇప్పుడు చైర్మన్ పదవి కోసం సయోధ్య తప్పని పరిస్థితిలో ఉన్నాయి. ఇద్దరూ తమ వర్గానికే పదవి దక్కాలని పట్టుబడుతున్నారు.

తారుమారైన 26 వార్డు ఫలితాలు
ఎమ్మెల్యే వర్గం నుంచి చైర్మన్ పదవి ఆశించిన గొల్లపల్లి మాధవి చంద్రశేఖర్ (26వ వార్డు) చివరి నిమిషంలో టికెట్ పొందినా ఓటమి పాలవడం కీలక మలుపు. అదే వార్డులో ఉన్న బీజేపీ మాజీ కౌన్సిలర్ పులి రమ (శ్రీధర్)కు టికెట్ ఇవ్వకపోవడం కూడా రాజకీయ విమర్శలకు కారణమైంది. ఈ సీటును ఇండిపెండెంట్ గా పోటీ చైనా పులి రమ మళ్ళీ గెలిచింది.
పాత? కొత్త? ఎవరు కాబోయే  ఛైర్పర్సన్ ?

మరోవైపు, గతంలో ఛైర్పర్సన్‌గా పనిచేసిన అడువాల జ్యోతి లక్ష్మణ్, అలాగే బీఆర్ఎస్‌లో పదవి అవకాశం కోల్పోయి అసంతృప్తిగా ఉన్న సమిండ్ల వాణి – ఇద్దరూ ఇప్పుడు కాంగ్రెస్‌లో, అది కూడా సంజయ్ వర్గంలో ఉండడం రాజకీయ సమీకరణాలను మరింత క్లిష్టంగా మారుస్తోంది.

జీవన్ రెడ్డి వర్గంలో ఇప్పటికీ స్పష్టమైన ఛైర్పర్సన్ అభ్యర్థి లేకపోవడంతో, ఆయన ఎవరిని ప్రతిపాదిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఆయనకు అప్తుడైన గాజుల రాజేందర్ మరదలు ములాస్తపు (గాజుల) లావణ్య మహేష్ ప్రతిపాదించే అవకాశం ఉంది. రాజేందర్ గతంలో రెండు సార్లు కౌన్సిలర్. గత ఎన్నికల్లో ఆయన వదిన ఈ వార్డులో గెలిచింది. మొత్తానికి రెండు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ, అందరివాడుగా ఉన్న రాజేందర్ మరదలు ముందు వరసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు ఇకపై పదవుల కోసం జరిగే ఒప్పందాలు, సయోధ్యలపైనే ఆధారపడి సాగనున్నట్లు స్పష్టమవుతోంది.

వర్గం / పార్టీ స్థానాలు
డా. సంజయ్ కుమార్ వర్గం (కాంగ్రెస్ బి ఫారమ్) 14
జీవన్ రెడ్డి వర్గం (కాంగ్రెస్ బి ఫారమ్) 9
సంజయ్ కుమార్ వర్గం రెబెల్స్ 4
జీవన్ రెడ్డి వర్గం రెబెల్స్ 8
బీజేపీ 6
బీఆర్ఎస్ 4
ఎంఐఎం 2
ఇండిపెండెంట్లు (బీజేపీ రెబెల్స్) 3
మొత్తం 50
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు క్యాంప్ కు తరలి వెళ్లినట్లు సమాచారం

జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ రేసులో...

1.సమిండ్ల వాణి శ్రీనివాస్ 
2.తోపారపు లావణ్య రజనీకాంత్
3.అడువాల జ్యోతి లక్ష్మణ్
4.ములాస్తపు (గాజుల) లావణ్య మహేష్ 

Join WhatsApp

More News...

Comment  State News 

జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: చైర్మన్ పదవిపై అనివార్య సయోధ్య

జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: చైర్మన్ పదవిపై అనివార్య సయోధ్య చైర్మన్ పదవి : ఘర్షణా? సయోధ్యా? నలుగురి మధ్యలో పోటీ జగిత్యాల ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు): జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల రాజకీయాన్ని పూర్తిగా తలకిందులు చేశాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ ఈ ఎన్నికల్లో తన రాజకీయ బలాన్ని స్పష్టంగా చూపించారు. కాంగ్రెస్ తరఫున...
Read More...

మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: బీజేపీ ఆధిక్యం, హంగ్ మున్సిపాలిటీ

మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: బీజేపీ ఆధిక్యం, హంగ్ మున్సిపాలిటీ మెటుపల్లి ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు) మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అధికారికంగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 26 వార్డులకు గానూ బీజేపీ 10 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తలా 6 స్థానాలు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డుల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో మెట్‌పల్లి...
Read More...
Local News  State News 

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ ముందంజ,

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ ముందంజ, జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి ముందంజలో నిలిచింది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు గణనీయమైన సంఖ్యలో విజయం సాధించారు. మొత్తం 50 వార్డులకు గాను కాంగ్రెస్ 23 (ఇందులో 6-8 మంది జీవన్ రెడ్డి వర్గం)స్థానాలు, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 స్థానాలు...
Read More...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: వడ్డేపల్లిలో. తెలంగాణ జాగృతి - AIFB సంచలనం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: వడ్డేపల్లిలో. తెలంగాణ జాగృతి - AIFB సంచలనం హైదరాబాద్ ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పలు జిల్లాల్లో భిన్న పార్టీల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. వడ్డేపల్లి మున్సిపాలిటీ: AIFB ఘన విజయం వడ్డేపల్లి మున్సిపాలిటీలో, తెలంగాణ jagruthi -ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) సంచలనం సృష్టించింది. మొత్తం 10 వార్డులకు గానూ 8 వార్డుల్లో...
Read More...

ఇప్పటి వరకు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

ఇప్పటి వరకు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇప్పటి వరకు11.30,  ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, వారీగా వార్డు నంబర్ పార్టీ గెలిచిన అభ్యర్థి 1 ఇండిపెండెంట్ చెట్టే గంగాధర్ 4 కాంగ్రెస్ క్యాదాసు నవీన్ 7 బీఆర్ఎస్ కోరుకంటి రాము 10 (TR నగర్) కాంగ్రెస్ చాంద్ పాషా 14 కాంగ్రెస్ బాలే లత శంకర్ 16 కాంగ్రెస్ దూమాల రాజ్ కుమార్...
Read More...

శివరాత్రి పూజకు ముక్కోట అందజేత

శివరాత్రి పూజకు ముక్కోట అందజేత   జగిత్యాల 12 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని నిజాంబాద్ రోడ్డు లో గల శ్రీమడేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలకు గాను మహాశివరాత్రి సందర్భముగా పరమశివునికి అలంకరించే ఆలయానికి సంబంధించిన వెండి ముక్కోటాను పూర్వ అధ్యక్షులు బోరుగళ్ల దేవరాజు ప్రస్తుత అధ్యక్షుడు గుండారపు రవీందర్ కు ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల పార్థసారధి శర్మ సమక్షంలో ఆలయంలో...
Read More...

శతాధిక ఆచార్యుని పరమపదం 

శతాధిక ఆచార్యుని పరమపదం  లక్షెట్టిపేట ఫిబ్రవరి 12 ( ప్రజా మంటలు)ఉభయ వేదాంతులు పౌరాణికులు శ్రీమాన్ మందపల్లి పరాంకుశ ఆచార్య (103) గురువారం ఉదయం హైదరాబాదులో తన చిన్న కుమారుని నివాసంలో పరమపదించారు. ఆయన స్వగృహం లక్షేటిపేట లో  ఆయన భౌతిక కాయాన్ని శిష్యులు బంధువుల దర్శనార్థం ఉంచారు. ఆయన సుమారు ఎనిమిది వందల పైబడి భాగవత సప్తాహాలు...
Read More...
Crime 

హైదరాబాద్‌లో జగిత్యాల యువకుని అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌లో జగిత్యాల యువకుని అనుమానాస్పద మృతి జగిత్యాల, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్‌కు చెందిన చేట్‌పల్లి సంజయ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువకుడు హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. సమాచారం ప్రకారం, సంజయ్ నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరాడు. అయితే...
Read More...
Crime  State News 

కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనని గ్రామస్థులు

కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనని గ్రామస్థులు జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఎదుల రాజేశం మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో పాడె మోయడానికి గ్రామస్థులు ముందుకు రాకపోవడం కలకలం రేపింది. గ్రామ సర్పంచ్ మరియు కుల పెద్దలు గ్రామస్తులు, దూరపు బంధువులు ఎవరూ...
Read More...

చీఫ్ మినిస్టర్ కప్ ఎంపిక పోటీలు ప్రారంభించిన అదనపు కలెక్టర్ బిఎస్ లత

చీఫ్ మినిస్టర్ కప్ ఎంపిక పోటీలు ప్రారంభించిన అదనపు కలెక్టర్ బిఎస్ లత జగిత్యాల ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకముగా తల పెట్టిన 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2025 సందర్భముగా జగిత్యాల జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు జిల్లాలోని వివిధ క్రీడా అంశములను జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు ఉదయం 10 గం. ల జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి...
Read More...
State News 

ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత

ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత   న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు): బాగ్ లింగంపల్లి ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి...
Read More...
National  Comment  International  

పశ్చిమ దేశాలలో స్టార్మర్ నాయకత్వ సంక్షోభం ప్రభావం

పశ్చిమ దేశాలలో స్టార్మర్ నాయకత్వ సంక్షోభం ప్రభావం స్టార్మర్ సంక్షోభం – మార్కెట్లపై ప్రభావం    యూకే రాజకీయ పరిణామాలు ఆర్థిక మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ నాయకత్వంపై నెలకొన్న అనిశ్చితి పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా పాలసీలు వామపక్ష వైపు మళ్లవచ్చనే భయంతో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. పౌండ్ యూరోతో పోలిస్తే 0.5% పడిపోయి €1.146...
Read More...