జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: చైర్మన్ పదవిపై అనివార్య సయోధ్య

రెబెల్స్ ప్రభావం,: బి ఫారమ్‌ల యుద్ధం : అడ్రస్ గల్లంతైన బి ఆర్ ఎస్,  పాత? కొత్త? ఎవరు కాబోయే  ఛైర్పర్సన్ ?

On
జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: చైర్మన్ పదవిపై అనివార్య సయోధ్య

చైర్మన్ పదవి : ఘర్షణా? సయోధ్యా?
నలుగురి మధ్యలో పోటీ

జగిత్యాల ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు):

జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల రాజకీయాన్ని పూర్తిగా తలకిందులు చేశాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ ఈ ఎన్నికల్లో తన రాజకీయ బలాన్ని స్పష్టంగా చూపించారు. కాంగ్రెస్ తరఫున ఆయన వర్గానికి 35 బి ఫారమ్‌లు దక్కగా, మరో 15 మంది రెబెల్ అభ్యర్థులను రంగంలోకి దించడం రాజకీయంగా సంచలనంగా మారింది.

ఇదే సమయంలో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అధిష్టానంతో ఎంతగా ప్రయత్నించినా ఆయన వర్గానికి కేవలం 15 బి ఫారమ్‌లే లభించాయి. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగిన జీవన్ రెడ్డి, తనకు జరిగిన అవమానంగా భావించి, ఎదురుతిరిగి మరో 35 మంది పాత కాంగ్రెస్ కార్యకర్తలను రెబెల్‌లుగా నిలిపారు. ఈ పరిణామం కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో చీలికను బహిర్గతం చేసింది.

బీజేపీలో పాత–కొత్త పోరు

భారతీయ జనతా పార్టీలో కూడా అంతర్గత కలహాలు స్పష్టంగా కనిపించాయి. పాత కౌన్సిలర్లను పక్కనపెట్టి, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలన్న నిర్ణయంతో బోగ శ్రావణి, ఎంపీ అరవింద్ కలిసి కొత్త అభ్యర్థులను ఎంపిక చేశారు. బియ్యం వ్యాపారంలో పేరు తెచ్చుకున్న కొండ లక్ష్మణ్‌ను, ఆయన భార్యను పార్టీలో చేర్చి చైర్మన్ అభ్యర్థిగా ముందుకు తీసుకురావడం విమర్శలకు దారి తీసింది. ఫలితంగా బీజేపీకి 6 స్థానాలు మాత్రమే దక్కాయి, అందులో 3 మంది ఇండిపెండెంట్లు (బీజేపీ రెబెల్స్) కూడా ఉన్నారు.

బీఆర్ఎస్ పతనం – ఎంఐఎం ఎంట్రీ

మొన్నటి వరకు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఈ ఎన్నికల్లో కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. ఇది గులాబీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు ఎంఐఎం తొలిసారిగా జగిత్యాలలో 2 స్థానాలు గెలుచుకుని తన ఉనికిని చాటింది.

అసలు లెక్కలు ఏంటి?

 మొత్తం 50 వార్డుల్లో

  • ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం – 18 స్థానాలు
  • జీవన్ రెడ్డి వర్గం – 17 స్థానాలు
    అంటే కాంగ్రెస్ పార్టీ పేరుతో గెలిచిన 35 స్థానాల్లో, మూడొంతుల మంది మాజీ బీఆర్ఎస్ నేపథ్యమున్నవారే కావడం గమనార్హం.
చైర్మన్ పదవి: ఘర్షణా? సయోధ్యా?

ఇప్పటి వరకు ఒకరినొకరు రాజకీయంగా తీవ్రంగా విమర్శించుకున్న సంజయ్ కుమార్–జీవన్ రెడ్డి వర్గాలు, ఇప్పుడు చైర్మన్ పదవి కోసం సయోధ్య తప్పని పరిస్థితిలో ఉన్నాయి. ఇద్దరూ తమ వర్గానికే పదవి దక్కాలని పట్టుబడుతున్నారు.

తారుమారైన 26 వార్డు ఫలితాలు
ఎమ్మెల్యే వర్గం నుంచి చైర్మన్ పదవి ఆశించిన గొల్లపల్లి మాధవి చంద్రశేఖర్ (26వ వార్డు) చివరి నిమిషంలో టికెట్ పొందినా ఓటమి పాలవడం కీలక మలుపు. అదే వార్డులో ఉన్న బీజేపీ మాజీ కౌన్సిలర్ పులి రమ (శ్రీధర్)కు టికెట్ ఇవ్వకపోవడం కూడా రాజకీయ విమర్శలకు కారణమైంది. ఈ సీటును ఇండిపెండెంట్ గా పోటీ చైనా పులి రమ మళ్ళీ గెలిచింది.
పాత? కొత్త? ఎవరు కాబోయే  ఛైర్పర్సన్ ?

మరోవైపు, గతంలో ఛైర్పర్సన్‌గా పనిచేసిన అడువాల జ్యోతి లక్ష్మణ్, అలాగే బీఆర్ఎస్‌లో పదవి అవకాశం కోల్పోయి అసంతృప్తిగా ఉన్న సమిండ్ల వాణి – ఇద్దరూ ఇప్పుడు కాంగ్రెస్‌లో, అది కూడా సంజయ్ వర్గంలో ఉండడం రాజకీయ సమీకరణాలను మరింత క్లిష్టంగా మారుస్తోంది.

జీవన్ రెడ్డి వర్గంలో ఇప్పటికీ స్పష్టమైన ఛైర్పర్సన్ అభ్యర్థి లేకపోవడంతో, ఆయన ఎవరిని ప్రతిపాదిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఆయనకు అప్తుడైన గాజుల రాజేందర్ మరదలు ములాస్తపు (గాజుల) లావణ్య మహేష్ ప్రతిపాదించే అవకాశం ఉంది. రాజేందర్ గతంలో రెండు సార్లు కౌన్సిలర్. గత ఎన్నికల్లో ఆయన వదిన ఈ వార్డులో గెలిచింది. మొత్తానికి రెండు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ, అందరివాడుగా ఉన్న రాజేందర్ మరదలు ముందు వరసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు ఇకపై పదవుల కోసం జరిగే ఒప్పందాలు, సయోధ్యలపైనే ఆధారపడి సాగనున్నట్లు స్పష్టమవుతోంది.

వర్గం / పార్టీ స్థానాలు
డా. సంజయ్ కుమార్ వర్గం (కాంగ్రెస్ బి ఫారమ్) 14
జీవన్ రెడ్డి వర్గం (కాంగ్రెస్ బి ఫారమ్) 9
సంజయ్ కుమార్ వర్గం రెబెల్స్ 4
జీవన్ రెడ్డి వర్గం రెబెల్స్ 8
బీజేపీ 6
బీఆర్ఎస్ 4
ఎంఐఎం 2
ఇండిపెండెంట్లు (బీజేపీ రెబెల్స్) 3
మొత్తం 50
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు క్యాంప్ కు తరలి వెళ్లినట్లు సమాచారం

జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ రేసులో...

1.సమిండ్ల వాణి శ్రీనివాస్ 
2.తోపారపు లావణ్య రజనీకాంత్
3.అడువాల జ్యోతి లక్ష్మణ్
4.ములాస్తపు (గాజుల) లావణ్య మహేష్ 

Join WhatsApp

More News...

National  Filmi News 

బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు

బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది. ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల...
Read More...
Crime 

భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు   గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో...
Read More...
Local News 

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు  సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర...
Read More...
Local News 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు  జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)  పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం నాయకులు. మహాత్మ జ్యోతిరావు పూలే  ఆశయాలు భారత సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య, సామాజిక సంస్కరణల మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన ఆలోచనలు చాలా ముందుచూపుతో కూడినవిఅన్నారు.     ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి
Read More...
Local News 

కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)  ప్రజల మధ్యలో ఉంటాం.. మరో మారు అధికారంలోకి వస్తాం.. జీవన్ రెడ్డి పై మంత్రి మరో మారు ఫైర్..   రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ...
Read More...
Local News 

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు కరీంనగర్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై, నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాతవాహన...
Read More...
State News 

దేశంలోనే ప్రథమ స్థానం సాధించిన కోనేరుపల్లె గ్రామం

దేశంలోనే ప్రథమ స్థానం సాధించిన కోనేరుపల్లె గ్రామం   చొప్పదండి, ఏప్రిల్ 10 (ప్రజా మంటలు): చొప్పదండి మండలంలోని కోనేరుపల్లె గ్రామం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాల్ రాజు “క్రీడా మిత్ర పంచాయతీ” ప్రణాళికలో భాగంగా యువతను క్రీడల వైపు మళ్లించే దిశగా చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది.క్వాలిటీ...
Read More...
Local News  State News 

జగిత్యాల సభకు భారీ ఏర్పాట్లు… కేసీఆర్ హాజరు ఖాయం

జగిత్యాల సభకు భారీ ఏర్పాట్లు… కేసీఆర్ హాజరు ఖాయం జగిత్యాల, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): ఈ నెల 20న నిర్వహించనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బహిరంగ సభకు సంబంధించి జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె రోడ్డు పక్కనున్న స్థలాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి తదితర నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని,...
Read More...
State News 

బీసీ మహిళల ఉపకోటా కోసం జాగృతి ఉద్యమం ఉధృతం: కవిత హెచ్చరిక

బీసీ మహిళల ఉపకోటా కోసం జాగృతి ఉద్యమం ఉధృతం: కవిత హెచ్చరిక హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉపకోటా లేకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు భయం లేకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం ఉపకోటా ఇవ్వలేదని విమర్శించారు.బీసీ మహిళలకు ఉపకోటా సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని, అవసరమైతే ఢిల్లీ స్థాయిలో పోరాటం...
Read More...
State News 

పూలే విగ్రహంపై నిర్లక్ష్యం: జాగృతి ధర్నా, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

పూలే విగ్రహంపై నిర్లక్ష్యం: జాగృతి ధర్నా, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు   హైదరాబాద్, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయకులు ఐమ్యాక్స్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్‌లో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి నేతృత్వం వహించారు.జాగృతి నేతలు మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని...
Read More...
Local News 

జీహెచ్ఎంసీలో అవినీతికి సీఎం బాధ్యులు: కవిత

జీహెచ్ఎంసీలో అవినీతికి సీఎం బాధ్యులు: కవిత హైదరాబాద్, ఏప్రిల్ 10 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టెండర్లకు బదులుగా నామినేషన్ పద్ధతిలో కోట్ల విలువైన కాంట్రాక్టులు సీఎం అనుచరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,148 కోట్ల పనులు ఇదే విధంగా ఇచ్చారని తెలిపారు.రియల్ ఎస్టేట్...
Read More...
Local News 

జగిత్యాలలో మహిళా చైతన్య బైక్ ర్యాలీ.

జగిత్యాలలో మహిళా చైతన్య బైక్ ర్యాలీ. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల 10 ఏప్రిల్ ( ప్రజా మంటలు ) :  భారతీయ సంస్కృతిని, కుటుంబ విలువలను కాపాడుకోవాలని హిందూ మహిళ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఉద్దేశించి పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జగిత్యాల పట్టణంలో మహిళలు బైక్...
Read More...