మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత

బడ్జెట్‌లో హామీలకు నిధులు కేటాయించాలి: కవిత

On
మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):


మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితమైందని తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో నీరు, రవాణా, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.

ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే రాబోయే బడ్జెట్‌లో స్పష్టమైన నిధుల కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. 1.89 లక్షల ఉద్యోగాల భర్తీకి బడ్జెట్‌లో ప్రావిజన్ పెట్టి, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు.

బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు కేటాయించి, బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉందని, అభివృద్ధి రాజకీయ సర్దుబాట్లకే పరిమితమైందని విమర్శించారు.

మహబూబ్‌నగర్ వంటి పట్టణాల్లో ఇప్పటికీ రెండు రోజులకోసారి నీళ్లు వస్తున్నాయని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మెరుగుపడలేదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉందని, బస్తీ దవాఖానాల్లో మందులు, వైద్యులు లేరని ఆరోపించారు.

రాబోయే బడ్జెట్ సుమారు రూ.3.25 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ల ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల కోసం రూ.35 వేల కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇవ్వాలని సూచించారు.

రైతు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, ప్రకటించిన మొత్తాలు, వాస్తవంగా చెల్లించిన మొత్తాల మధ్య భారీ వ్యత్యాసం ఉందని తెలిపారు. యాసంగి రైతు భరోసా ఇప్పటికీ విడుదల కాలేదని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళనకరమని, ఎలక్ట్రిక్ బస్సుల్లో ఆర్టీసీ ఉద్యోగులకే అవకాశం ఇవ్వాలని అన్నారు. మహిళలకు స్కూటీ, తులం బంగారం వంటి హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ముఖ్యమంత్రి స్పందించడం లేదని విమర్శించారు. లేబర్ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 12న జరిగే బంద్‌కు తెలంగాణ జాగృతి మద్దతు ఇస్తుందని తెలిపారు. అదే రోజు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలు సర్దుబాట్లకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ, ప్రజలు వ్యక్తులను చూసి ఓటు వేయాలని, సింహం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

 

Join WhatsApp

More News...

దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం

దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఈ సాయంత్రం దేశవ్యాప్తంగా UPI ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. సుమారు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో డబ్బు పంపడం, QR కోడ్ స్కాన్ చేయడం వంటి UPI లావాదేవీలు పనిచేయలేదు. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రధాన చెల్లింపు యాప్‌లలో సమస్య తలెత్తడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు...
Read More...
Local News 

జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 50 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌తో పాటు ముగ్గురు ఇతర పోలింగ్ అధికారులను...
Read More...
Local News  State News 

ధర్మపురిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి – మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు కొప్పుల ఈశ్వర్ సవాల్

ధర్మపురిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి – మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు కొప్పుల ఈశ్వర్ సవాల్ జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు): మంత్రి లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ధర్మపురిలో జరిగిన అభివృద్ధి కళ్లకు కనిపించకపోతే తాను ఏం చేయలేనన్నారు. ధర్మపురి నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో ఒకటని,...
Read More...
National  International   Crime 

జిమ్మీ లైకు 20 ఏళ్ల జైలు – హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ క్షీణత

జిమ్మీ లైకు 20 ఏళ్ల జైలు – హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ క్షీణత హాంకాంగ్ ఫిబ్రవరి 10:చైనా ప్రభుత్వానికి తీవ్ర విమర్శకుడిగా పేరుగాంచిన, హాంకాంగ్‌కు చెందిన ప్రజాస్వామ్య అనుకూల మీడియా వ్యాపారవేత్త జిమ్మీ లైకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ తీవ్రంగా క్షీణిస్తున్నదన్న ఆందోళనలకు మరింత బలం చేకూర్చింది. యాపిల్ డైలీ పత్రిక వ్యవస్థాపకుడైన జిమ్మీ లై, బీజింగ్...
Read More...
State News 

మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత

మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు): మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితమైందని తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో నీరు, రవాణా, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే...
Read More...

 ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కొరకే ఫ్లాగ్ మార్చ్:డిఎస్పి రఘు చందర్

 ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కొరకే ఫ్లాగ్ మార్చ్:డిఎస్పి రఘు చందర్   జగిత్యాల ఫిబ్రవరి 9 (ప్రజా మంటలు)ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో  ఎన్నికలు  నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది....
Read More...
Local News 

అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): చేసిన అభివృద్ధి పనులకే ప్రజలు పట్టం కడతారని, ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతినిధులను గెలిపిస్తేనే జగిత్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 200 కోట్ల...
Read More...
National  Filmi News 

మళ్ళీ సెన్సార్ కు జన నాయకన్ సినిమా: కోర్టులో కేసు ఉపసంహరణ

మళ్ళీ సెన్సార్ కు జన నాయకన్ సినిమా: కోర్టులో కేసు ఉపసంహరణ చెన్నై – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): TVK పార్టీ నాయకుడు దలపతి నటించిన ‘జననాయకన్’ చిత్రాన్ని మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును చిత్ర బృందం ఉపసంహరించుకున్నట్లు న్యాయస్థానానికి తెలియజేసింది. ఇంతవరకు ఉన్న ఈ చిత్ర సెన్సార్ పై ఉన్న సందేహాలను...
Read More...
National  International  

సీషెల్స్‌కు 175 మిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయం ప్రకటించిన భారత్

సీషెల్స్‌కు 175 మిలియన్ డాలర్ల అభివృద్ధి సహాయం ప్రకటించిన భారత్ న్యూఢిల్లీ – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): భారతదేశానికి ఆరు రోజుల అధికారిక పర్యటనకు వచ్చిన సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహుళ రంగాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో వాణిజ్యం, ఆర్థిక సహకారం, భద్రతా అంశాలపై పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ చర్చల అనంతరం,...
Read More...
Local News  Crime 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ జప్తు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ జప్తు ఇబ్రహీంపట్నం – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు): అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకుని, లారీ ఓనర్ మరియు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన భూక్య వంశీ (24) తన యజమాని ఇస్లావత్ శంకర్ ఆదేశాల మేరకు వేంపల్లి గ్రామ శివారులోని గోదావరి నది నుంచి ఇసుకను...
Read More...
Local News 

ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో గొల్లపల్లి బి ఆర్ ఎస్ నాయకులు

ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో గొల్లపల్లి బి ఆర్ ఎస్ నాయకులు గొల్లపల్లి ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు);    ధర్మపురి మున్సిపల్  ఎన్నికల్లో భాగంగా 6,7,,8,, వార్డుల అభ్యర్థులకు,తోడుగా ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి  కొప్పుల ఈశ్వర్  ప్రజల మధ్యలో ఓట్లు అభ్యర్థిస్తున్నా, మాజీ ఎంబిపీపి నక్క శంకయ్య గోస్కుల జలంధర్ పి ఎస్ సి ఎస్  చైర్మన్ చెందోళ గందే మాధవ రావు ఓరగంటి అశోక్
Read More...