తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణి జమ్మ మల్లారి మృతి
ఒగ్గువనితకు వినమ్ర శ్రద్ధాంజలి పురుషాధిక్య రంగంలో సవారి చేసిన తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణి జమ్మ మల్లారి ఇక లేరు
తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు విగ్రహం
ఒగ్గు వనితకు వినమ్ర శ్రద్ధాంజలి
మహిళాస్వరంతో మల్లన్న మేల్కొలుపు —
పురుషాధిక్య రంగంలో ధైర్యంగా సవారి చేసిన మల్లారి ఇక లేరు.
కళా ప్రపంచంలో ఆడవేషం కట్టిన పురుషులు అనేకమంది లబ్ధప్రతిష్ఠులుగా నిలిచారు. కానీ పురుష ఆహార్యాన్ని ధరించి, ఒక జానపద కళారూపాన్ని జీవితాంతం భుజాన మోసిన స్త్రీమూర్తుల కథలు అరుదుగా మాత్రమే వినిపిస్తాయి. అలాంటి అరుదైన, అపూర్వమైన ఒగ్గుకళాకారిణి జమ్మ మల్లారి.
ఉగ్గుపాల వయసు నుంచే ఒగ్గుకథల వైపు మొగ్గు చూపిన ఆమె, ఆరు దశాబ్దాలకు పైగా పురుష ఆహార్యంలోనే ఆ జానపద కళారూపాన్ని తన జీవితంగా మార్చుకుంది. అయితే కామరతి వంటి ప్రత్యేక కళారూప ప్రదర్శనల్లో మాత్రం స్త్రీమూర్తిగా కనువిందు చేసింది. ఒగ్గుకళకే జీవితాన్ని అంకితం చేసి, తెలంగాణలో తొలి మహిళా ఒగ్గుకథ కళాకారిణిగా గుర్తింపు పొందిన మహనీయురాలు జమ్మ మల్లారి.
నపీర నాదమై మోగిన కంచుకుతిక – జమ్మ మల్లారి.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామం ఆమె జన్మస్థలం. జమ్మ గుండాలు–చెన్నమ్మ దంపతులకు ఏడుగురు ఆడకూతుళ్లు, ముగ్గురు కొడుకులు. వారిలో ఒకరు మల్లారి. తండ్రి గుండాలు స్వయంగా ఒగ్గుకళాకారుడు. దేవుడి లగ్గాలు చేస్తూ, ఒగ్గుకథలు చెప్తూ జీవితం సాగించిన వ్యక్తి.
ఇతర సంతానం అంతగా ఆసక్తి చూపకపోయినా, మల్లారి మాత్రం చిన్ననాటి నుంచే ఒగ్గుకథలపై అపారమైన మక్కువ పెంచుకుంది. తండ్రితో కలిసి దేవుడి లగ్గాలకు, ఒగ్గు ప్రదర్శనలకు వెళ్తూ తాళం కొట్టడం, డోలు వాయించడం, శృతి పట్టడం నేర్చుకుంది. అలా వారసత్వ కళ ఆమె చేతుల్లో నెమ్మదిగా బలపడింది.
పదహారేళ్లకే తొలి ప్రదర్శన
పదహారేళ్ల వయసులోనే తొలిసారి స్వయంగా ఒగ్గుకథ చెప్పింది మల్లారి. ఆ తొలి ప్రదర్శనే ప్రేక్షకులను కట్టిపడేసింది. అలా మొదలైన ప్రస్థానం జీవితాంతం ఆగలేదు. బీరప్ప కథ, మల్లన్న కథ, ఎల్లమ్మ వ్యథ — ఏ గాథనైనా అనర్గళంగా, అద్భుతమైన లయ సమన్వయంతో ఆమె కథాగానం చేసేది.
పురుషులే ఆధిపత్యం చెలాయించిన రోజుల్లో గజ్జె కట్టి, తలపాగా చుట్టి, భుజాన గొంగళి వేసుకొని పురుష ఆహార్యంలోనే వేదికపై నిలబడింది. ఆమె కథ మొదలైతే చాలు… జనాలు పనులన్నీ వదిలిపెట్టి ప్రదర్శన వద్ద మైమరచిపోయేవారు. సొంత ఊరిలో మొదలైన ప్రదర్శనలు క్రమంగా ఇతర గ్రామాలకు, జిల్లాలకు విస్తరించాయి. వేలాది వేదికలపై తెలంగాణ ఒగ్గుకథకు ఆమె అపూర్వమైన ప్రతిష్ఠ తీసుకొచ్చింది.
దేవుడికే అంకితం చేసిన జీవితం
సాధారణ కుటుంబ జీవితం వైపు తిరగలేదు మల్లారి. పద్దెనిమిదో ఏట బీరప్ప స్వామినే భర్తగా స్వీకరించి, తన జీవితాన్ని దేవుడికే అంకితం చేసింది. ఒగ్గుకథనే తన సంతానంగా భావించి పెంచింది.
తెలంగాణలో ఎక్కడ బీరప్ప కల్యాణం జరిగినా “మల్లారి ఉండాల్సిందే” అన్నంతగా ఆమెకు గుర్తింపు వచ్చింది. వేలాది దేవుడి లగ్గాలు చేయించి భక్తి పరంపరను నిలబెట్టింది.
అనర్గళ గాత్రం… అప్రతిహత నిబద్ధత
చదువుకోలేకపోయినా, తండ్రి చెప్పిన ప్రతి కథను మస్తిష్కంలో చెక్కించుకుంది. గంటల తరబడి సాగే కథలను ఎలాంటి పుస్తకం చూడకుండా వినిపించే అపూర్వ సామర్థ్యం ఆమె సొంతం.
“నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు ఒగ్గుకథ చెబుతాను” అని 80 ఏళ్ల వయసులోనూ చెప్పిన ఆమె వినమ్రత అందరినీ ఆకట్టుకుంది. ఆరోగ్యం సహకరించకపోయినా, కథకు పిలుపు వస్తే శక్తినంతా కూడదీసుకుని వేదికపై నిలబడేది.
తెలంగాణ తర్వాతే దక్కిన గౌరవం
దశాబ్దాలపాటు కళా సేవ చేసినప్పటికీ గుర్తింపు ఆలస్యంగా వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ప్రభుత్వం జానపద కళలకు ప్రోత్సాహం ఇచ్చిన తర్వాతే మల్లారికి తగిన గౌరవం దక్కింది. భాషా సాంస్కృతిక శాఖ అప్పటి సంచాలకులు Dr. Harikrishna Mamidi గారి చొరవతో
2020 మార్చి 8న రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. లక్ష రూపాయల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించారు.
పురస్కారం స్వీకరించినప్పుడు మల్లారి అన్న మాటలు నేటికీ చిరస్మరణీయం:
“ఇది నాకు జరిగిన సన్మానం కాదు… మన ఒగ్గు కళకు జరిగిన గౌరవం.”
శివైక్యం… కానీ శిఖరం శాశ్వతం
07-02-2026 న జమ్మ మల్లారి శివైక్యం చెందడం ఒగ్గు సమాజానికి తీరని లోటు.
అయితే ఆమె గాత్రం, ఆమె వినిపించిన గాథలు, ఆమె నిబద్ధత తెలంగాణ జానపద చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.
“నేను బతికున్నంతకాలం ఒగ్గుకథ చెబుతా… ఈ జీవితానికి ఇది సాలు” అని చెప్పిన మల్లారి జీవితం నిజంగా అజరామరం.
తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం, తెలంగాణ బిసి కమీషన్ తొలి మాజీ చైర్మన్ బి ఎస్ రాములు మల్లారి మృతికి సంతాపం తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –
అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం... జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు
జగిత్యాల మార్చ్ 05, (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం “కమల నిలయం”లో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నాగ శ్రావణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ జగిత్యాలలో నవోదయ విద్యాలయం స్థాపనకు అవసరమైన భూమి కేటాయింపు అంశంపై రాష్ట్ర... జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి
జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు):
జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్‌ను ధ్వంసం చేయడంతో పాటు... జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్
జగిత్యాల మార్చి 5 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్ లో “చాంపియన్స్ చాలెంజ్” పేరిట స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
క్రీడలు శారీరక దృఢమే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి
ఈ కార్యక్రమానికి ముఖ్య... సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన?
న్యూఢిల్లీ మార్చ్ 05:
భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా (Union Territory) మార్చే ప్రతిపాదనపై రాజకీయ, వ్యూహాత్మక వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ సరిహద్దు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటన నిర్వహించడం ఈ చర్చలకు మరింత... సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు
జగిత్యాల మార్చి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలంలో, గత నెల 5వ తేదీన స్థాపించిన 21 అడుగుల ఎత్తైన సైకత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి,గార్లు బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పులుము మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత
మల్యాల మార్చి 4 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత పరిశీలించారు.
పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్... కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన
హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు.
హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు.... నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):
హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల... ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత
జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు) పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ .
శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ... జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు
జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.
హోళీ సందర్భంగా... దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక
న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు):
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు.
AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International... 