జగిత్యాల రాజకీయాల్లో మాటల యుద్ధం:జీవన్ Vs సంజయ్
అభివృద్ధి పేరుతో సమన్వయమా? పార్టీ క్రమశిక్షణపై ప్రశ్నలా?
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ కొట్టివేయడంతో, ఆయన “అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా” అని స్పష్టం చేశారు. తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని, పార్టీ మారలేదని అఫిడవిట్, పార్టీ ఫండ్ చెల్లింపుల ద్వారా రుజువు చేశానన్నారు.
అదే సమయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర రాజకీయ వ్యాఖ్యలతో రంగంలోకి దిగారు. “పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం అభివృద్ధి కాదు. కాంగ్రెస్ కార్యకర్తల కాళ్లకు అడ్డం పెట్టవద్దు” అంటూ ఎమ్మెల్యే సంజయ్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. గత 20 నెలల్లో నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.
అభివృద్ధి వర్సెస్ రాజకీయ నీతి
సంజయ్ కుమార్ మాటల్లో అభివృద్ధి ప్రాధాన్యం కనిపిస్తే, జీవన్ రెడ్డి వ్యాఖ్యల్లో పార్టీ క్రమశిక్షణ, రాజకీయ నీతి ప్రధానంగా నిలిచాయి. ఒకరు “సమన్వయం అవసరం” అంటుండగా, మరొకరు “సమన్వయం పేరుతో పార్టీ కుటుంబంలో చిచ్చు తగదని” హెచ్చరిస్తున్నారు.
స్పీకర్ తీర్పుతో చట్టపరమైన అంశం ముగిసినప్పటికీ, రాజకీయంగా మాత్రం జగిత్యాలలో చర్చ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ, అభివృద్ధి పేరుతో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సరైందా? లేక పార్టీ సరిహద్దులు దాటడమేనా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో మోగుతున్నాయి.
ప్రజల తీర్పే కీలకం
ఇద్దరు నేతల వాదనలు ఇప్పుడు ప్రజల ముందున్నాయి. ఒకవైపు “అభివృద్ధే లక్ష్యం” అన్న ఎమ్మెల్యే మాటలు, మరోవైపు “పార్టీ విలువలు కాపాడాలి” అన్న మాజీ మంత్రి హెచ్చరికలు. ఈ రాజకీయ సమీకరణల్లో చివరకు తీర్పు చెప్పేది ప్రజలేనన్నది స్పష్టమవుతోంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మున్సిపాలిటీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
జగిత్యాల ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
బిఆర్ఎస్ - బీజేపీ | కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, వార్డుల వారిగా..
వార్డు
రిజర్వేషన్
BRS
BJP
కాంగ్రెస్
1
BC(G)
నిమిషకవి వంశీకృష్ణ
పుప్పాల రాజేష్
అనిల్ కుమార్ కూసరి
2
UR(W)
వొడ్డినేని సంధ్య కుమారి
కాశెట్టి... ఐల్నేని ఆసుపత్రి వారి సౌజన్యముతో క్యాన్సర్ పై అవగాహన సదస్సు
జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసం గీతావిద్యాలయం గ్రౌండ్ లో బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ వలన అనారోగ్యము మరణాలు తగ్గించడమే అవగాహన యొక్క ముఖ్య లక్ష్యం అని వైద్యులు పేర్కొన్నారు. డా వంశీ చేతన ప్రముఖ ఆంకాలజిస్ట్, డా వినీల ,డా... క్యాన్సర్ మరణశాసనం కాదు –మెగాస్టార్ చిరంజీవి
(పి కోటేశ్వర్)
సికింద్రాబాద్, పిబ్రవరి 04 ( ప్రజామంటలు) :
క్యాన్సర్ అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదని, ముందస్తుగా గుర్తిస్తే ఈ వ్యాధిని కూడా జయించి సాధారణ జీవితం గడపవచ్చని పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ కార్యక్రమంలో ఆయన
ఈ... రూ.15 లక్షల లంచంతో తీసుకొంటూ పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్‌ఈ
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
హైదరాబాద్ కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ చిన్నారెడ్డి కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.... కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా: దివాళా కంపెనీకి వేల కోట్ల పనులు ఎలా? కెటిఆర్ ప్రశ్న
హైదరాబాద్ ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
దివాళా తీసినట్లు ప్రకటించిన కే ఎస్ ఎల్ ఆర్ ఇన్ఫ్రాటెక్ కాని 6వేల కోట్ల పనులను ఇచ్చిందని, ఇది cm రేవంత్ రెడ్డి బినామీ సంస్థ అని, బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ పత్రిక సమావేశంలో ఆరోపించారు. ఈ ప్రశ్న నేను కాదు, సుప్రీంకోర్టు గత జనవరి 23... జగిత్యాల రాజకీయాల్లో మాటల యుద్ధం:జీవన్ Vs సంజయ్
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ కొట్టివేయడంతో, ఆయన “అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా” అని స్పష్టం చేశారు. తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని, పార్టీ మారలేదని అఫిడవిట్, పార్టీ ఫండ్ చెల్లింపుల... స్పీకర్ క్లిన్ చిట్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ బీఆర్‌ఎస్‌లోనే
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు.
అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో సమన్వయం – డా. సంజయ్ స్పష్టం
ఈ తీర్పుపై... పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకో: మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడమా? అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అంశంపై స్పీకర్ ఇప్పటికే స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ఎమ్మెల్యే... జగిత్యాల మున్సిపాలిటీ – ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా
జగిత్యాల ఫిబ్రవరి 03 (ప్రజా మంటలు):
ప్రధాన పార్టీలు – బీజేపీ (BJP), కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు.(వార్డు – రిజర్వేషన్ – అభ్యర్థి పేరు – పార్టీ)
🔹 వార్డు 1 (BC-G)
అనిల్ కుమార్ కుసారి – INC
నిమిషకవి వంశీకృష్ణ – BRS
పుప్పాల రాజేష్ – BJP
🔹... బి.ఎల్.ఓ లు తమ విధులను జాగ్రత్తగా నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత
జగిత్యాల ఫిబ్రవరి 3 ( ప్రజా మంటలు)పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో బి.ఎల్.ఓ లు తమ విధులను జాగ్రత్తగా నిర్వహించాలనిఅదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత పేర్కొన్నారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో బి.ఎల్.ఓల పాత్ర కీలకమని చెప్పారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన 18 సంవత్సరాలు... క్రమశిక్షణతో ఉండడం తప్పా: జీవన్ రెడ్డి
జగిత్యాల, ఫిబ్రవరి 3 (ప్రజా మంటలు):
నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించడమే నా తప్పా? అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ—కష్టకాలంలో పార్టీని నమ్ముకుని... జగిత్యాల మాల జంగం పురోహితులచే రాజరాజేశ్వర స్వామి పల్లకి సేవ
జగిత్యాల ఫిబ్రవరి 3 ( ప్రజా మంటలు) మాల జంగం కు చెందిన వేల్పుల వంశస్థులకు మంగళవారం రాజరాజేశ్వర స్వామి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచినీళ్ల భావి వద్ద గల శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో పురాని పేటకు చెందినమాల జంగం కుల మహేశ్వర పురోహితులు లక్కం శివనాథం, మురళీదాస్, మోహన్, కోదాది... 