బొగ్గు కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకే హరీష్ రావుపై కక్ష సాధింపు _ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

రేవంత్ రెడ్డి 'డైవర్షన్ పాలిటిక్స్' ను వదిలేదే లేదు !!!

On
బొగ్గు కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకే హరీష్ రావుపై కక్ష సాధింపు _ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

హైదరాబాద్ 19 జనవరి (ప్రజా మంటలు) : 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి సంబంధించిన బొగ్గు కుంభకోణం బయటపడటంతోనే, దాని నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీసులు ఇచ్చి 'అటెన్షన్ డైవర్షన్' రాజకీయాలకు పాల్పడుతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు మండిపడ్డారు.

రాజకీయ వేధింపులే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమేనని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పిందని కేటీఆర్ గుర్తు చేశారు.

అత్యున్నత న్యాయస్థానమే ఆ కేసును కొట్టేసి, ఈ పొలిటికల్ డ్రామాకు తెరదించినా.. మళ్లీ ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోందని ఆయన విమర్శించారు.

అసలు ఈ నోటీసుల వెనుక ఉన్న కారణం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయిందని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డికి అడ్డగోలుగా జరిగిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని తాము సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టామని, ఈ భారీ స్కామ్ నుండి తప్పించుకోవడానికే రాత్రికి రాత్రే హరీష్ రావు కు నోటీసులు పంపారని కేటీఆర్ ఆరోపించారు.

ఇది పక్కాగా రేవంత్ రెడ్డి మార్క్ 'డైవర్షన్ పాలిటిక్స్' అని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ప్రతిపక్ష నేతలపై బురద చల్లడం, నోటీసులతో బెదిరించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హరీష్ రావు తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు నిరంతరం ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడని, అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన చూపిస్తున్న చొరవను చూసి రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోందని కేటీఆర్ అన్నారు.

అందుకే రాజకీయంగా ఎదుర్కోలేక, పాతపడిపోయిన కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

గత 24 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, తమకు చట్టం పైన, న్యాయస్థానాల పైన పూర్తి గౌరవం ఉందని తెలిపారు.

ఏ విచారణకైనా తాము సిద్ధమని స్పష్టం చేస్తూనే.. నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూడటం భ్రమ మాత్రమేనని హెచ్చరించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వేటాడటం ఆపేది లేదని, కుంభకోణాలను బయటపెడుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోరుతూ బీసీ నాయకుల చే కలెక్టర్ కు వినతి

ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోరుతూ బీసీ నాయకుల చే కలెక్టర్ కు వినతి    జగిత్యాల మార్చ్6( ప్రజా మంటలు)  జిల్లా కలెక్టర్ కి. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8000 కోట్లను వెంటనే విడుదల చేయాలని చెల్లించాలని. వినతి పత్రం సమర్పించిన బీసీ నాయకులు    (తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8000 కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్.) తెలంగాణ రాష్ట్రంలో...
Read More...
Local News 

జిల్లాలో  ఎనిమిదవ రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

జిల్లాలో  ఎనిమిదవ రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం   జగిత్యాల మార్చి 6 (ప్రజా మంటలు)జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు 30 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది.జనరల్ కోర్సులకు సంబంధించి  4193 విద్యార్థులకు గాను 4138 విద్యార్థులు హాజరు కాగా 55 విద్యార్థులు గైర్హాజరయ్యారు మరియు ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 847 విద్యార్థులకు గాను 809 విద్యార్థులు హాజరు కాగా  38...
Read More...
Local News 

త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన

త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన తిరుమల మార్చ్ 06 (ప్రజా మంటలు): కల్వకుంట్ల కవిత శుక్రవారం ఉదయం తన భర్త అనిల్‌తో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్న కవిత, శుక్రవారం ఉదయం ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత,...
Read More...
Local News  State News 

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు – 

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –  అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం...
Read More...
Local News  State News 

జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం  – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు

జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం  – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు జగిత్యాల మార్చ్ 05, (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం “కమల నిలయం”లో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నాగ శ్రావణితో కలిసి   పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ జగిత్యాలలో నవోదయ విద్యాలయం స్థాపనకు అవసరమైన భూమి కేటాయింపు అంశంపై రాష్ట్ర...
Read More...
Crime  State News 

జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి

జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు): జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్‌ను ధ్వంసం చేయడంతో పాటు...
Read More...
Local News 

జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్      

జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్       జగిత్యాల మార్చి 5 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్ లో “చాంపియన్స్ చాలెంజ్” పేరిట స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. క్రీడలు శారీరక దృఢమే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి ఈ కార్యక్రమానికి ముఖ్య...
Read More...
National  Comment  State News 

సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన?

 సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన? న్యూఢిల్లీ  మార్చ్ 05: భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా (Union Territory) మార్చే ప్రతిపాదనపై రాజకీయ, వ్యూహాత్మక వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ సరిహద్దు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటన నిర్వహించడం ఈ చర్చలకు మరింత...
Read More...
Local News 

సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు

సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు జగిత్యాల మార్చి 4 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలంలో, గత నెల 5వ తేదీన స్థాపించిన 21 అడుగుల ఎత్తైన సైకత  శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి,గార్లు  బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పులుము
Read More...
Local News 

మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత

మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత మల్యాల మార్చి 4 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా  పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్...
Read More...
State News 

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు. హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు....
Read More...
State News 

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్ హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు): హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల...
Read More...