పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని
జగిత్యాల నవంబర్ 26(ప్రజా మంటలు)
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా *రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ
రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను మూడు విడుదలలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని, డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల సంబంధించి గ్రామానికి అప్ డేట్ చేసిన రిజర్వేషన్లు, ఏ విడత పోలింగ్ ఉంటుంది, పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు వెంటనే టి-పోల్ వెబ్ సైట్, యాప్ లో నమోదు చేయాలని అన్నారు.
టి-పోల్ వెబ్ సైట్ , యాప్ లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలో పరిష్కరించాలని అన్నారు.
నవంబర్ 23న ఫైనల్ చేసిన ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ క్యాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని , పోలింగ్ కేంద్రాలలో మంచి వెలుతురు, ఫర్నిచర్, పవర్ సరఫరా వంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 27న ఉదయం 10.30 గంటల వరకు విడుదల చేయాలని అన్నారు.
నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పంచాయతీ పరిధిలోని ఓటరు జాబితా వివరాలను ప్రచురించాలని అన్నారు .
నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని అన్నారు.
పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.
నామినేషన్ల పరిశీలన నవంబర్ 30 న సాయంత్రం 5 గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైనా నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అన్నారు.
అభ్యర్థుల జాబితా పై అప్పిళ్ళ కోసం డిసెంబర్ 01, సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, డిసెంబర్ 2 నాడు ఆపిళ్ళ పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 03 మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుందని, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలని అన్నారు .
నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలని అన్నారు.
జిల్లాలో ఉన్న ప్రింటర్ల యజమానులకు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయవద్దని ఆదేశాలు జారీ చేయాలన్నారు.
ప్రతి మండలానికి ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం, ఒక ఏ.ఈ.ఓ (సహాయ వ్యయ వివరాల నమోదు అధికారి), ప్రతి జిల్లాకు ఒక స్టాటిక్ సర్వేలెన్స్ బృందం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తప్పనిసరిగా జరిగేలా పర్యవేక్షించాలని అన్నారు.
ప్రతి జిల్లాలో ఎం.సి.ఎం.సి కమిటి, జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎం.సి.ఎం.సి అనుమతి ఉండాలని అన్నారు.
ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపద్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.
ఎం.సి.సి అమలులో నిర్వహించే తనిఖీల లో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలని, సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హాజరు కావాలని వివరాలు ఆ రసీదు లో ఉండాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ
గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలు టి-పోల్ లో అప్ లోడ్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
మొదటి విడతగా 7 మండలాల్లోని 122 గ్రామ పంచాయతీలలో,
రెండవ విడుతలో 7 మండలాల్లోని 144 గ్రామ పంచాయతీలు,
మూడవ విడుతలో 6 మండలాల్లోని 119 గ్రామ పంచాయతీలకు
ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టీ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎం.సి.ఎం.సి , మీడియా సెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజ గౌడ్, జిల్లా నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
VIT యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం – క్యాంపస్‌లో ఉద్రిక్తత
వెల్లూర్ (తమిళ నాడు) నవంబర్ 26 (ప్రజా మంటలు)
VIT యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు మంగళవారం రాత్రి తీవ్రరూపం దాల్చాయి. హాస్టల్ సౌకర్యాలు, ఫీజు సమస్యలు, క్యాంపస్ నియమావళిపై విద్యార్థుల అసంతృప్తి ఒక్కసారిగా ఉధృతమై, పెద్ద సంఖ్యలో విద్యార్థులు బయటకు వచ్చి నిరసనలు చేపట్టారు. కొంతమంది విద్యార్థులు కోపోద్రిక్తులై వస్తువులు ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.... పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని
జగిత్యాల నవంబర్ 26(ప్రజా మంటలు)పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు,... ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్
హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
సినీ పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి అలియాస్ “ఐబొమ్మ రవి”కి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. రవిని గత వారం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. సోమవారం పోలీసు కస్టడీ గడువు ముగియడంతో అతన్ని కోర్టులో హాజరుపరచగా, జ్యూడిషియల్ రిమాండ్‌కు ఆదేశాలు... ఎన్నికల ప్రవర్తన నియమావలికి లోబడి విధులు నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల నవంబర్ 26( ప్రజా మంటలు)
ఎన్నికల ప్రవర్తన నియమాలికి లోబడి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మీ సత్యప్రసాద్ అన్నారు.
జిల్లాలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ మరియు నామినేషన్ పత్రాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బుధవారం... కుమ్మరిపల్లి మోడల్ స్కూల్‌లో పోలీస్ కళాబృందం అవగాహన
(అంకం భూమయ్య)
గొల్లపల్లి, నవంబర్ 26 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు వెల్గటూర్ మండలంలోని కుమ్మరిపల్లి మోడల్ స్కూల్‌లో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఐ ఉదయ్‌కుమార్ ముందుండి చేపట్టారు.
పోలీస్ కళాబృందం విద్యార్థులకు పోలీసు చట్టాలు, షీ టీమ్... పాక్ జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను చంపేశారా?
కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్) నవంబర్ 26 (ప్రజా మంటలు)
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, PTI చీఫ్ ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారన్న ప్రచారం మరోసారి అంతర్జాతీయ వాతావరణాన్ని కుదిపేసింది. ఆఫ్ఘనిస్థాన్ రక్షణశాఖకు దగ్గరగా పనిచేస్తుందన్న ఆరోపణలున్న కొన్ని మీడియా గ్రూపులు, “ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్తాన్ అధికారులు రహస్యంగా చంపేశారు” అని సంచలన కథనాలు విడుదల... ఆలయం చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు… దండివారం సందర్బంగా భక్తుల సందడి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి |నవంబర్ 26 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట శ్రీ మల్లికార్జున స్వామివారి జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధల పర్వంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు దండివారం కావడంతో అన్ని దిక్కులనుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ పరిసరాలను మంగళధ్వనులతో మరింత పవిత్రంగా మార్చేశారు.
ఉదయం నుంచే “మల్లన్న… మల్లన్న…” అంటూ నాద... రాజ్యాంగం సమానత్వానికి పునాది :ఎంపీ డా. కే. లక్ష్మణ్
హైదరాబాద్, నవంబర్ 26 (ప్రజా మంటలు):
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల్లో సిబిసి నిర్వహించిన ఫోటో ప్రదర్శనను ఎంపీ డా. కే. లక్ష్మణ్ ప్రారంభించారు.భారత రాజ్యాంగం సజీవ గ్రంథమని, సమానత్వం–హక్కుల రక్షణకు బలమైన పునాదని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ వారసత్వాన్ని పౌరులంతా కాపాడాలని పిలుపునిచ్చారు.సిబిసి అదనపు డైరెక్టర్ జనరల్... గాంధీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
సికింద్రాబాద్ నవంబర్26 (ప్రజామంటలు)::
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ యువకుడికి అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు... వివరాలు ఇవి..భూపాలపల్లి జిల్లాకు చెందిన 24 ఏళ్ల విజయ్‌కుమార్‌కు గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన ట్రాకియల్ రీసెక్షన్ అండ్ అనస్టమోసిస్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.విషం సేవించిన అనంతరం ట్రాకియోస్టమీ చేయించుకున్న రోగికి... రాజ్యాంగ స్ఫూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలు అందిద్దాం: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 26(ప్రజా మంటలు)జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలతో ఎంతో గుర్తింపు ఉన్నదని మనమంతా రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
భారత రాజ్యాంగం ఆమోదించి 76... రాజ్యాంగ దినోత్సవం: అంబేద్కర్ కు నివాళులు
సికింద్రాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు పురస్కరించుకుని ట్యాంక్ బండ్ పైన డాక్టర్ BR అంబెడ్కర్‌కు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రజలందరికీ మార్గదర్శకమైన ఏకైక గ్రంథం భారత రాజ్యాంగమని, దాన్ని గౌరవించడం మరియు కచ్చితంగా పాటించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ... సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలపై కాంగ్రెస్ ద్రోహం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు. 129 మంది కార్మికులు డిపెండెంట్ ఉద్యోగాల కోసం మెడికల్ బోర్డుకు వెళ్లగా, కేవలం 23 మందినే అన్‌ఫిట్ గా గుర్తించడం అత్యంత అన్యాయం అని ఆమె అభిప్రాయపడ్డారు.
కవిత... 