గుండె జబ్బుల నివారణను మిషన్‌గా తీసుకుందాం : సీఎం రేవంత్ రెడ్డి

గుండె జబ్బుల నివారణ మిషన్ కావాలి – CPR శిక్షణపై సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

On
గుండె జబ్బుల నివారణను మిషన్‌గా తీసుకుందాం : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జనవరి 11 (ప్రజా మంటలు):


గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణను ఒక మిషన్‌గా తీసుకొని ప్రభుత్వం, వైద్యులు, సమాజం అంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులకు సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) శిక్షణ ఇవ్వడానికి కార్డియాలజిస్టులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే దేశవ్యాప్తంగా వేలాది ప్రాణాలను కాపాడగలమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ ఫౌండేషన్ (ICRTF) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఫెలోస్ ఇండియా సదస్సు–2026లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, దక్షిణాసియా దేశాల నుంచి దాదాపు 500 మంది కార్డియాలజిస్టులు మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో పాల్గొన్నారు.IMG-20260111-WA0758

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాను వృత్తి పరంగా డాక్టర్ కాకపోయినా, ప్రజాప్రతినిధిగా సామాజిక వైద్యుడి పాత్ర పోషిస్తూ సమాజంలోని సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. ఇప్పటికే స్థిరపడిన వైద్యులైనా, తమ నాలెడ్జ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలనే లక్ష్యంతో ఈ తరహా కాన్ఫరెన్సులకు హాజరవడం అభినందనీయమని అన్నారు. నిరంతరం నేర్చుకోవడమే విజయానికి మంత్రం అని, కొత్త విషయాలు తెలుసుకోవడం మానేస్తే కెరీర్ అక్కడితో ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు.

లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్‌కేర్ అనుబంధ రంగాల్లో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం తెలిపారు. డాక్టర్లు సమాజంలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన వర్గమని, ప్రజల ప్రాణాలను కాపాడతారన్న నమ్మకం వారిపై ఉందని గుర్తుచేశారు. వైద్యులు మానవీయతను ఎప్పటికీ మరిచిపోవద్దని సూచించారు.

ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పాలసీల రూపకల్పనలో వైద్యుల సూచనలు, సలహాలతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆధునిక సాంకేతికతతో పాటు మానవీయ స్పర్శను కలిపిన వైద్య సేవలే సమాజానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు.

ఇటీవల గుండె జబ్బులతో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో గుండె వ్యాధులపై అవగాహన కల్పించడం అత్యవసరమని సీఎం అన్నారు. విద్యార్థులకు సీపీఆర్ శిక్షణ ఇవ్వడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో అనేక ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫెలోస్ ఇండియా సదస్సు ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎన్. ప్రతాప్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎ. శరత్ రెడ్డి తదితర ప్రముఖ కార్డియాలజిస్టులు, వైద్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

More News...

National  Spiritual   State News 

మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రధాన పుణ్యక్షేత్రాలకు భారీగా బస్సులు కేటాయించారు....
Read More...

ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు వలసవాదులకు మధ్య ప్రస్తుత ఎన్నికలు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు వలసవాదులకు మధ్య ప్రస్తుత ఎన్నికలు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి    జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  జగిత్యాల పట్టణంలో 23 వార్డులో   ఎస్ కె ఎన్ ఆర్ గౌట్ జూనియర్ బాయ్స్ కాలేజీలో  మాజీ మంత్రి జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం...
Read More...
State News 

రేపే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ – బాగ్ లింగంపల్లిలో నిర్వహణ

రేపే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ – బాగ్ లింగంపల్లిలో నిర్వహణ హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఫిబ్రవరి 12న (గురువారం) ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించనున్నారు. వివిధ ఉద్యమ సంఘాల నాయకులు, తెలంగాణ...
Read More...

జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగింపు

జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగింపు జగిత్యాల, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. జగిత్యాల మున్సిపాలిటీ వివరాలు మొత్తం వార్డులు: 50 ఓటర్లు: 94,800 అభ్యర్థులు: 254 పోలింగ్ కేంద్రాలు: 149 పోలింగ్ సిబ్బంది: 745...
Read More...

ఘనంగా శ్రీ వాణి జూనియర్ కళాశాల ఫేర్వెల్ వేడుకలు

ఘనంగా శ్రీ వాణి జూనియర్ కళాశాల ఫేర్వెల్ వేడుకలు   జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణము లోని శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గత విద్యా సంవత్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు....
Read More...

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు)ఎన్నికలు నిర్వహణకు 900 మంది పోలీస్ లతో  పటిష్ట బందోబస్తు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీస్ అధికారులు,సిబ్బందితో...
Read More...

దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం

దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఈ సాయంత్రం దేశవ్యాప్తంగా UPI ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. సుమారు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో డబ్బు పంపడం, QR కోడ్ స్కాన్ చేయడం వంటి UPI లావాదేవీలు పనిచేయలేదు. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రధాన చెల్లింపు యాప్‌లలో సమస్య తలెత్తడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు...
Read More...
Local News 

జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 50 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌తో పాటు ముగ్గురు ఇతర పోలింగ్ అధికారులను...
Read More...
Local News  State News 

ధర్మపురిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి – మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు కొప్పుల ఈశ్వర్ సవాల్

ధర్మపురిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి – మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు కొప్పుల ఈశ్వర్ సవాల్ జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు): మంత్రి లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ధర్మపురిలో జరిగిన అభివృద్ధి కళ్లకు కనిపించకపోతే తాను ఏం చేయలేనన్నారు. ధర్మపురి నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో ఒకటని,...
Read More...
National  International   Crime 

జిమ్మీ లైకు 20 ఏళ్ల జైలు – హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ క్షీణత

జిమ్మీ లైకు 20 ఏళ్ల జైలు – హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ క్షీణత హాంకాంగ్ ఫిబ్రవరి 10:చైనా ప్రభుత్వానికి తీవ్ర విమర్శకుడిగా పేరుగాంచిన, హాంకాంగ్‌కు చెందిన ప్రజాస్వామ్య అనుకూల మీడియా వ్యాపారవేత్త జిమ్మీ లైకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ తీవ్రంగా క్షీణిస్తున్నదన్న ఆందోళనలకు మరింత బలం చేకూర్చింది. యాపిల్ డైలీ పత్రిక వ్యవస్థాపకుడైన జిమ్మీ లై, బీజింగ్...
Read More...
State News 

మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత

మున్సిపల్ ఎన్నికలు వ్యక్తిగత దూషణలకే పరిమితం : కవిత హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు): మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితమైందని తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో నీరు, రవాణా, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే...
Read More...