ముదిరిన మంత్రి కొండ సురేఖ OSD వివాదం - ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులు
కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించే యత్నాలు షురూ
OSD సుమంత్ కై పోలీసుల గాలింపు
ఇదంతా రెడ్డి వర్గం కుట్రగా సురేఖ ఆరోపణ
హైదరాబాద్ అక్టోబర్ 16 (ప్రజా మంటలు)::
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి, OSD సుమంత్ కొరకు వెదకడానికి చేసిన ప్రయత్నం అధికార పార్టీలో దుమారం రేపుతుంది.కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత,మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగారు.ఏకంగా ఒక మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లి నిందితుడి గురించి వెతకడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది
కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెతుకుతున్నారు.పోలీసుల నుండి తప్పించుకొని, సుమంత్, కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తుంది.
సురేఖను మంత్రివర్గం నుండి తప్పించే పనిలో భాగంగానే,నిన్న సుమంత్ ను బాధ్యతలనుండి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
మొన్న కొంతమంది రెడ్డి ముఖ్యలు తనపై కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన సురేఖ,గత కొంత కాలంగా జిల్లా ప్రజాప్రతినిధులతో విభేదాలతో శాతమౌతున్నారు.
మేడారం టెండర్ల వివాదంలో పైచేయి సాధించిన పొంగులేటి..!
మేడారం జాతర టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటితో వచ్చిన విభేదాలతో రచకెక్కున సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒంటరి అయిపోయింది. మరో మంత్రి సీతక్, ఈ విషయంలో పొంగులేటికి పరోక్షంగా మద్దతుగా నిలిచారు.
మేడారం జాతర పనుల సమీక్షకై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సురేఖ గైర్హాజరయ్యారు. దీనికి ఆమె,పని ఒత్తిడి వల్లే వెళ్లలేకపోయానని వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో పొంగులేటి, సీతక్క పాల్గొని సమీక్షించారు.
అధిష్టానం పెద్దలకు సీతక్క కూడా సురేఖపై ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది ముఖ్యమంత్రి వరంగల్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ గొడవకు కారణమైన సురేఖపై సీరియస్ ఉన్నట్లు పార్టీ ముఖ్యుల నుండి మీడియాకి సమాచారం లీక్ లు వెళుతున్నాయి.
అదంతా అబద్ధమని కొట్టేసిన మంత్రి సురేఖ.ఈలోగా సుమంత్ వ్యవహారంపై రచ్చ. సుమంత్ ను అరెస్ట్ చేస్తే కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని,ఇదంతా సురేఖను తప్పించడానికి అని అనుకొంటున్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అనవసరంగా మా పేర్లు లాగుతున్నారు - మాకు సంబంధం లేదు - మంత్రులు పొంగులేటి - ఉత్తమ్ కుమార్
-overlay.jpg-overlay.jpg.jpg)
ఈనెల 18న బీసీ బందుకు అన్ని వర్గాలు సహకరించాలి బీసీ జేఏసీ

కొండా సురేఖ మంత్రిపదవికి రాజీనామా చేస్తారా? తొలగిస్తారా?
-overlay.jpg.jpg)
బీహార్ లో కోట్లl విలువైన మద్యం,వస్తువులు, ఆయుధాలు స్వాధీనం

ముదిరిన మంత్రి కొండ సురేఖ OSD వివాదం - ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులు

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్
