భారతీయ జీవన విధానమే ప్రపంచానికి ఆదర్శం. ఆర్ఎస్ఎస్ జిల్లా సహ కార్యవాహ సాయి మధుకర్.
జగిత్యాల అక్టోబర్ 5 (ప్రజా మంటలు)
ఎంతో ఉన్నతమైన భారతీయ జీవన విధానమే నేడు ప్రపంచానికి ఆదర్శమని, దానిని నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్ఎస్ఎస్ జిల్లా సహ కార్యవాహ సాయి మధుకర్ అన్నారు. జగిత్యాల పట్టణం గోవిందుపల్లి బస్తి విజయదశమి ఉత్సవాన్ని ఆదివారం స్థానిక ఎల్ జి గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్ధార్థ విద్యాసంస్థల డైరెక్టర్,ట్రస్మా జిల్లా అధ్యక్షుడు బోయిన్ పల్లి శ్రీధర్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేసారు.
ప్రధాన వక్త గా ఆర్ఎస్ఎస్ జిల్లా సహ కార్యవాహ సాయి మధుకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ జన్మతః దేశభక్తుడని తెలిపారు. పాఠశాల స్థాయిలోనే తోటి విద్యార్థులను కూడగట్టుకొని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పనిచేసి పాఠశాల నుండి బహిష్కరించబడ్డాడని తెలిపారు.
కలకత్తాలో వైద్య విద్యార్థిగా ఉంటూ అనుశీలన సమితి అనే విప్లవ సంస్థలో చేరి బాంబు తయారీలో కూడా శిక్షణ పొందారని తెలిపారు. స్వాతంత్ర సాధన కోసం అటవీ సత్యాగ్రహం లో పాల్గొని జైలుకు వెళ్లారన్నారు. దేశ ప్రజల్లో ఉన్న అనైక్యత కారణంగానే బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారని, దేశ ప్రజల్లో ఐక్యభావం పెంపొందించడం కోసం ఒక సంస్థ అవసరమని ఉద్దేశంతో 1925 సంవత్సరంలో విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ ను స్థాపించారని తెలిపారు.
కొద్దిమందితో నాగపూర్ లో ప్రారంభించిన సంస్థ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించిందన్నారు. ప్రతిరోజు శాఖలో ఇచ్చే శిక్షణ కారణంగానే స్వయం సేవకులు వివిధ రంగాలలో దేశం కోసం, ధర్మం కోసం నిస్వార్థంగా పని చేస్తున్నారన్నారు. ఎన్నో అవరోధాలు, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ తనదైన కార్య పద్ధతిలో పనిచేస్తూ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల కాలంలో ఎన్నో విజయాలను, సామాజిక మార్పులను సాధించిందన్నారు.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకొని భారతదేశం విశ్వ గురువుగా నిలవాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుందన్నారు. ఈ క్రమంలో సమాజంలో కొన్ని మార్పులు రావాలని ఆర్ఎస్ఎస్ భావిస్తుందని, అవే పంచ పరివర్తన్ పేరుతో ప్రజల ముందు ఉంచుతుందన్నారు. సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపి సామాజిక సమరసతను సాదించాలని, అన్ని రంగాలలో స్వదేశీ భావాన్ని పెంపొందించి స్వావలంబన తో జీవించాలని కోరారు.
పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మొక్కలు నాటడంతో పాటు సాగునీటి వనరులను పరిరక్షించుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. మనదేశంలో అతి విశిష్టమైన కుటుంబ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. పౌర విధులను పాటించడం ద్వారా దేశంలో క్రమశిక్షణాయుత వాతావరణాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీధర్ రావు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కృషికి సమాజంలోని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాలలో ₹100 కోట్ల ప్రభుత్వ భూమి వివాదం – బాధ్యత గల పౌరుడిగా భూ ఆక్రమణను వెలుగులోకి తెచ్చిన - మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెసు నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.
₹100 కోట్ల విలువ గల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని ఆరోపణల నేపథ్యంలో, జీవన్... న్యాయవాదులపై అనుచిత ప్రవర్తన కేసు - మానవహక్కుల కమీషన్ కు ఫిర్యాదు
మానవ హక్కుల కమిషన్ లో అడ్వకేట్ రామారావు ఫిర్యాదు జనగాం పోలీసులపై ఎఫ్‌ఐఆర్
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు) :
గతంలో జనగాం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించిన రఘుపతి, ఎస్‌ఐ తిరుపతి లపై న్యాయవాద దంపతులు గద్దల అమృత్‌రావు, కవితలతో అనుచిత ప్రవర్తన చేసిన ఘటనకు సంబంధించి జనగాం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు... గాంధీ రోగి సహాయకుల విశ్రాంతి భవన నిర్వాహణకు చేయూత
నిత్యవసరాలు, బ్లాంకెట్లు అందచేసిన ఎస్‌బీఐ లేడీస్ క్లబ్
సికింద్రాబాద్, అక్టోబర్ 29 ( ప్రజామంటలు):
గాంధీ ఆస్పత్రిలోని జనహిత సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న రోగి సహాయకుల విశ్రాంతి భవనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడీస్ క్లబ్, హైదరాబాద్ సభ్యులు బుధవారం సందర్శించారు. షెల్టర్ హోమ్‌లో ఉన్న లబ్ధిదారులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు.లబ్ధిదారులు మాట్లాడుతూ... ఎన్‌కౌంటర్ భయం వ్యక్తం చేసిన గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా — హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు
చండీగఢ్ అక్టోబర్ 39:
పంజాబ్‌కు తరలించే ముందు కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తన ప్రాణ భయాన్ని వ్యక్తం చేస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు.
తనను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చే అవకాశం ఉందని భగవాన్‌పురియా తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో హైకోర్టు, పంజాబ్ ప్రభుత్వాన్ని నోటీసు జారీ చేస్తూ, రాష్ట్రం నుండి వివరణ... చాచల్‌లో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల ఆందోళన — వేతన సమానత్వం సహా డిమాండ్లు
గౌహతి అక్టోబర్ 29:
గువహటి నగరంలోని చాచల్ ప్రాంతంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగుల సంఘం మరియు అఖిల అసోం హెల్త్ అండ్ టెక్నికల్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది.
ఉద్యోగులు సమాన వేతనాలు, సేవా భద్రత, అలాగే ముఖ్యమంత్రి డా. హిమంత బిశ్వ శర్మ ఇచ్చిన హామీలను... “భారత్‌తో యుద్ధం చేస్తే నష్టపోయేది పాకిస్తానే” -పాకిస్తాన్‌కు అమెరికా మాజీ సీఐఏ అధికారి హెచ్చరిక
వాషింగ్టన్/న్యూ ఢిల్లీ, అక్టోబర్ 29:భారత్‌తో యుద్ధానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) మాజీ అధికారి జాన్ కిరియాకో (John Kiriakou) హెచ్చరించారు. తన 15 ఏళ్ల కౌంటర్‌టెరరిజం సేవా కాలంలో సగం కాలాన్ని పాకిస్తాన్‌లో గడిపిన ఆయన, పాకిస్తాన్ నిరంతరం భారతదేశాన్ని ప్రేరేపించడం... చెఫ్ మాధంపట్టి రంగరాజ్ – జాయ్ క్రిసిల్డా వివాదంపై భార్య శృతి స్పందన
🎬 జాయ్ క్రిసిల్డాతో రెండో వివాహం
చెన్నై, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
జాయ్ క్రిసిల్డా వ్యవహారంతో చెఫ్ మాధంపట్టి రంగరాజ్ మరోసారి వివాదాల మద్యలో నిలిచారు. ఈ కేసులో ఇప్పటివరకు మౌనం పాటించిన ఆయన భార్య శృతి, తొలిసారిగా స్పందిస్తూ తన భావాలను ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యక్తం చేశారు.
‘మెహందీ సర్కస్’ సినిమాతో గుర్తింపు... మొంథా తుపాన్ ప్రభావం – ఐదు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
మొంథా తుపాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పలు జిల్లాల్లో గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తుఫాన్ కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ... అంతర్ రాష్ట్ర దొంగల ముఠా నాయకుడు అరెస్ట్ జగిత్యాల అదిలాబాద్ నిర్మల్ జిల్లాలలో చోరీలు
జగిత్యాల అక్టోబర్ 29(ప్రజా మంటలు)గతంలో మహారాష్ట్రలోని నాందేడు, బాస్మత్ , దర్మబాద్, హింగోలి సైతం దొంగతనాలు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్ తేదీ 13.10.2025 రోజున తెల్లవారుజామున జగిత్యాల జిల్లాలోని ధరూర్ గ్రామాలలో నాలుగు ఇండ్లలో జరిగిన దొంగతనాలు మరియు తేదీ 02.10.2025 నాడు మెట్పల్లి వైన్ షాప్ దగ్గర దొంగతనాలు చేసిన... మొంథా తుపాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం — అన్ని శాఖలకు ఆదేశాలు
డోర్నకల్ జంక్షన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుండ్రాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ - నిలిపివేత
హైదరాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
మొంథా తుపాన్ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వరి కోతల సమయం కావడంతో... కార్తీక మాసం బొమ్మల కొలువు భలే..భలే..
గత 50 ఏండ్లుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్న సుశీలమ్మ
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు):
కార్తీక మాసం వేళ మల్కాజిగిరి, మిర్జాలగూడలోని భావిగడ్డ సుశీలమ్మ (80) ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటోంది.1978లో కేవలం మూడు బొమ్మలతో ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని ఆమె 50 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.తిరుమల, అయోధ్య, కైలాసం, పల్లె... వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా యశోద హాస్పిటల్స్ లో అవేర్నెస్
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు):
వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రధాన అతిథిగా హాజరై, యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటితో కలిసి ప్రారంభించారు.
ఈ... 