చివరి గింజ వరకు మద్దతు ధరపై దాన్యం కొనుగోలు::రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి
జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)
*ధాన్యం కొనుగోలు, రేషన్ కార్డుల జారీ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్*
యాసంగి సీజన్ లో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని ధాన్యం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే.రామ కృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ లతో కలిసి ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. *ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
రైతులు పండించిన ప్రతి గింజ మద్దతు ధర పై కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, మన దగ్గర రికార్డ్ స్థాయిలో 57 లక్షల ఎకరాలలో వరి పంట సాగు జరిగిందని, ప్రభుత్వం దాదాపు 17 వేల కోట్ల ఖర్చు చేస్తూ 70 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేస్తుందని , వీటికి అదనంగా సన్న రకం ధాన్యానికి క్వింటాల్ 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నామని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్ ఎంట్రీ పూర్తిచేసిన 48 గంటల్లో రైతులకు ఖాతాలో డబ్బు జమ అవుతుందని అన్నారు. భారీ స్థాయిలో కొనుగోలు జరుగుతున్నప్పటికీ మీడియా లో సరిగ్గా కవర్ కావడం లేదని అన్నారు. పత్రికలలో వచ్చే నెగటీవ్ వార్తల స్పందించాలని, తప్పుడు వార్తలను తీప్పికొట్టాలని సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించాలని అన్నారు.
రాబోయే 15 రోజులలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
జనవరి 26, 2025 తరువాత మన రాష్ట్రంలో నూతనంగా 1,57, 467 రేషన్ కార్డులను పంపిణీ చేశామని, వీటి ద్వారా 16 లక్షల 67 వేల 936 మంది ప్రజలకు అదనంగా రేషన్ అందుతుందని మంత్రి తెలిపారు. మీసేవ కేంద్రాలు, ప్రజా పాలన కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల విచారణ పూర్తి చేసి అర్హులకు రేషన్ కార్డులను జారీ చేయాలని మంత్రి తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణా రావు మాట్లాడుతూ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని, ప్రభుత్వా నిబంధనల ప్రకారం కలెక్టర్లు ప్రణాళిక బద్దంగా యాసంగి పంట కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రెగ్యులర్ గా కలెక్టర్లు తనిఖీ చేయాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ మాట్లాడుతూ,
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 7 లక్షల 70 వేల 477 మంది రైతుల నుంచి 49 .53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 8 వేల 42 కోట్లు మద్దతు ధర కింద చెల్లించామని అన్నారు.
ప్రతి రోజు అదనపు కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను
పర్యవేక్షిస్తున్నామని అన్నారు. మే నెలాఖరు నాటికి పకడ్బందిగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. వార్తా పత్రికలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు.
ధాన్యం రవాణా కు వాహనాల ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, కలెక్టర్, ఆర్.టి.ఓ , పోలీస్ అధికారులు సమన్వయంతో ఖాళీగా ఉన్న లారీలను పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలుకు కేటాయించాలని అన్నారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం బస్తాల అన్ లోడింగ్ ఆలస్యం కాకుండా చూడాలని, హమాలీల కొరత ఉండకుండా జాగ్రత్త పడాలని అన్నారు.
గత ఆరు నెలల కాలంలో రేషన్ తీసుకోకపోవడం, ఇతర రాష్ట్రాలకు చెందిన డూప్లికేట్ బెనిఫిషరీ, చనిపోయిన వారి పేర్లు ఉండటం వంటి వివిధ కారణాల వల్ల భారత ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 96 వేల 240 రేషన్ కార్డుల పరిధిలోని లక్షా 62 వేల 777 మందు లబ్ధిదారులు అనుమానాస్పదంగా ఉన్నారని, జిల్లాల వారీగా సంబంధిత జాబితా అందించామని, వీటిపై విచారణ చేసి వివరాలు సమర్పించాలని కలెక్టర్ లకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ, కోపరేటివ్ అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెట్పల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సంజయ్
మెట్పల్లి, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెట్పల్లిలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. సంజయ్, న్యాయవాది తుల రాజేందర్ కుమార్, తులగంగవ్వ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం... అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్‌ను... రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్‌కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్... శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు
జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు... విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్
వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన... ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర
గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం... వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా... మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్ రమేష్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
టీఎన్‌జీవో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్ పల్లాటి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్‌జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ... ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC: ఎం. లవిష – 979/1000BiPC: కె. నవీన – 971/1000CEC: కె. రతిక – 935/1000... బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు
ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది.
ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల... భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు
గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో... 