గంగోత్రి దర్శనం సర్వ ప్రాణ హితం.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9964349493/9348422113) :
గంగోత్రి మే 31 (ప్రజా మంటలు) :
గంగోత్రి దర్శనం సర్వ ప్రాణ హితమని రాయికల్ మండలం ఇటిక్యాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ అన్నారు.
చార్ ధాం యాత్ర లో భాగంగా గంగోత్రి ని సందర్శించిన సందర్భంగా ఆయన గంగోత్రి విశేషాలను వివరించారు.
గంగోత్రి గంగాదేవి పుట్టిన ప్రదేశం గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం . ఇక్కడ గంగానది భాగీరథీ పేరుతో పిలవబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం గంగా నదిని భూమికి తీసుకు రావడానికి భగీరథుడు కారణం కనుక ఆ పేరు వచ్చింది.
దేవ ప్రయాగ నుండి గంగానదిలో అలకనంద నది ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నదిగా పిలవబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం గౌముఖ్. ఇది గంగోత్రినుండి 40 కిమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది.
హరిద్వార్, రిషికేశ్, డెహరాడూన్ నుండి ఒక రోజు ప్రయాణంచేసి గంగోత్రిని చేరవచ్చు.
ఉత్తర్ ఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ నుండి దాదాపు నూట పది కిలోమీటర్లు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి గంగోత్రిని చేరుకోవచ్చు. గంగోత్రిలో గంగాదేవాలయం ముఖ్యమైన ప్రదేశం. గంగాదేవాలయంలో ఉన్న గంగాదేవి దీపావళి నుండి మే మాసం వరకు గంగోత్రి దేవాలయంలోనూ మిగిలిన సమయంలో హార్సిల్ సమీపంలోని ముఖ్బ లోనూ ఉంటుంది.
గంగోత్రి ఆలయాన్ని 18వ శతాబ్దంలో నేపాల్ జనరల్ అయిన అమర్ సింగ్ థాపా నిర్మించినట్లు చారిత్రక నేపథ్యం
పాలరాతి రాయితో నిర్మించిన ఈ ఆలయం లోపల ఒక గర్భ గృహం, బయటి ఒక గర్భ గృహం రెండు గర్భ గృహాలను కలిగి ఉంది. లోపలి గర్భ గృహంలో గంగాదేవి ప్రధాన విగ్రహం ఉంటుంది. యమునా దేవి, అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మి, భగీరథుడు, ఆదిశంకర మహర్షి వంటి మరికొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. బయటి గర్భ గృహంలో పూజలు చేసేందుకు భక్తులను అనుమతించారు.గంగోత్రి ఆలయానికి సమీపంలో ఉన్న ప్రజలకు కనిపించే సహజ శిలలతో కూడిన శివలింగం, శివలింగం నీటిలో కలిసిపోయింది.
ఇది తక్కువ నీటి మట్టం ఉన్న సమయంలో అంటే చలికాలంలో కనిపిస్తుంది. భూమిని రక్షించడం కోసం శివుడు గంగాదేవిని ఏడు ముక్కలుగా విభజించాడని నమ్ముతారు.
ఇక్కడి సంప్రదాయక పూజలు సెమ్వాల్ కుటుంబానికి చెందిన పూజారులు నిర్వహిస్తారని చెరుకు మహేశ్వర శర్మ చెప్పారు.గంగానది ఉదృతంగా ప్రవహించే ప్రదేశంలో ఉన్న గంగాదేవికి హారతి ఇచ్చే దృశ్యం భక్తులకు మనోహర దృశ్యంగా కనువిందు చేస్తుందని అన్నారు.పర్వతారోహకులకు గంగోత్రి ముఖ్య కేంద్రం. ఇక్కడి నుండి కొందరు సాహసయాత్రికులు గౌముఖ్ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు.
ఈ ఆలయం సముద్రమట్టానికి 3,100 మీటర్ల ఎత్తులో ఉంది.గంగా మాత పూజ్యమైన గంగా నది ప్రతిరూపం. ప్రశాంతమైన తెల్లని దేవాలయం చుట్టూ దేవదార్ వృక్షసంపద, హిమాలయాల పర్వత శ్రేణులు ఉన్నాయి. గంగ రెండు ప్రధాన ప్రవాహాలలో ఒకటైన పవిత్ర నది భాగీరథి గంగోత్రి ఆలయం పక్కన ప్రవహిస్తుంది.
గంగా గురించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయని చెరుకు మహేశ్వర శర్మ పేర్కొన్నారు. భాగవతంలోను, బృహద్ధర్మ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగాను గూర్చి పెక్కు కథలున్నాయని చెప్పారు
పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగాను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగా- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి అనుసరించింది. కొంతకాలానికి శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి, బలిచక్రవర్తి నుంచి మూడడుగుల నేలను దానమడిగాడు. ముల్లోకాలను ఆక్రమిస్తూ ఒక పాదంతో బ్రహ్మలోకాన్ని ఆక్రమించాడు.
అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ భక్తి పారవశ్యంతో, తన కమండలంలోని గంగాజలంతో ఆ శ్రీహరి పాదాలను కడగగా.. పరమ పావన గంగా అక్కడే స్థిరంగా ఉండి పోయింది. అలా విష్ణుపాదాన ఒదిగిన గంగానే భగీరథుడు తపస్సుతో భువి పైకి రప్పించాడు. ఆ విధంగా గంగా దేవి 'విష్ణు పాదోద్భవ' అయ్యింది. 'బ్రహ్మ కడిగిన పాదము' అనే అన్నమాచార్య సంకీర్తన తెలుగు వారికి సుపరిచితమేనని చెరుకు మహేశ్వర శర్మ పేర్కొన్నారు.
భూలోకానికి గంగ వచ్చిన పురాణకధ :
సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అసమంజసుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగదేనువును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు.
వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగాను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు భగీరధుడు.భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగాకోసం తపస్సు చేశాడు. గంగా ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను.
కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగాను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగా పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.
స్వర్గంలో "మందాకిని"గా, భూలోకంలో "గంగా" లేదా "అలకనంద"గా, పాతాళంలో "భోగవతి"గా మూడు లోకాల్లో ప్రహించినందున గంగాను "త్రిపథగ" అంటారు.
భగీరథ రాజు శివుడిని ఆరాధించిన పవిత్ర రాయి సమీపంలో గంగా మాతకు అంకితం చేసిన ఆలయం ఉంది మహాభారత యుద్ధంలో తమ బంధువుల మరణాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాండవులు ఇక్కడ గొప్ప 'దేవ యజ్ఞం' నిర్వహించారని కధనం. భాగీరథి ఒడ్డున పూర్వీకుల ఆచారాలను నిర్వహించడం వల్ల పూర్వీకుల ఆత్మ పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతుందని, దాని నీటిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ప్రస్తుత జన్మలలో చేసిన పాపాలు శుద్ధి అవుతాయని హిందువులు నమ్ముతారు.
గంగోత్రి ఆలయం మే నెలలో అక్షయ తృతీయ పవిత్రమైన రోజున తెరుస్తారు. నవంబరు నెలలో వచ్చే యమ ద్వితీయ లేదా భాయ్ దూజ్ నాడు మూసివేస్తారు .గంగోత్రి ఆలయం ఆరు నెలలు తెరిచి ఆరునెలల పాటు మూసి ఉంచే దేవాలయం. చలికాలంలో దేవత ముఖ్బా గ్రామానికి మారుతుంది. మే నెలలో గంగానది పుట్టిన రోజుగా గంగా దసరాను ఇక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు. ఈ యాత్ర లో చెరుకు మహేశ్వర శర్మ పల్లవి తో పాటు మల్లాపూర్ మండలం రాఘవపేట కు చెందిన కల్వకుంట్ల తిరుమల రావు పుష్పాలత వేములవాడ కు చెందిన మందిరం రఘు సుచరిత నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కు చెందిన వుత్తునూరు కృష్ణమూర్తి లలిత చందుపట్ల నారాయణ లక్ష్మీ పెండ్యాల రాందాసు సుగుణ ఖానాపూర్ కు చెందిన తాండ్ర చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
హైదరాబాద్లో ప్రారంభమైన జాతీయ గిరిజన ఉత్సవం ఆది బజార్–2025’
గిరిజన కళాకారులకు మార్కెట్ వేదికను అందిస్తోంది ఆది బజార్: దివ్య దేవరాజన్
హైదరాబాద్, నవంబర్ 7 ( ప్రజా మంటలు):
హైటెక్ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్‌లో జాతీయ గిరిజన ఉత్సవం ‘ఆది బజార్–2025’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) సీఈవో దివ్య దేవరాజన్,... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తుల ఉమ ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 07 – (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవ్ఉఎండ్మ్మఆర్డి రెడ్డితో కలిసి, కరీంనగర్ జిల్లా మాజీ జిల్లాపరిషద్ చైర్‌పర్సన్ తుల ఉమ ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.... ప్రజా సంక్షేమ,అభివృద్ది పనులే కాంగ్రెస్ గెలుపుకు బాటలు
జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కవితనస్రీన్ బేగంతో కలసి జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం
సికింద్రాబాద్, నవంబర్ 07 ( ప్రజామంటలు):
రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయని జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పి.కవిత అన్నారు. మహిళా కాంగ్రెస్ ఏ–... అసలైన ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీయే.:: మోదీ ఓట్ చోరీ కాదు..140 కోట్ల దిల్ చోరీ..
బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి...
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
భారత జాతీయ ఎన్నికల కమిషనర్ గారిని ఉద్దేశించి మీరు ప్రశాంతంగా ఉద్యోగ విరమణ చేయలేరని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో బయోత్పాతాన్ని సృష్టించే విధంగా ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్
రాజ్యాంగాన్ని... మహాభారత నవాహ్నిక ప్రవచనా జ్ఞాన యజ్ఞం కరపత్ర ఆవిష్కరణ
జగిత్యాల నవంబర్ 7 ( ప్రజా మంటలు)జగదాలయ ఆధ్యాత్మిక బృందం వారి ఆధ్వర్యంలో మహాభారత నవాహ్నిక ప్రవచన జ్ఞాన యజ్ఞం డిసెంబర్ 6_ 2025 శనివారం నుండి డిసెంబర్ 14 _2025 ఆదివారం మార్గశీర్ష మాసంలో శృంగేరి శారదా పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్... ప్రభుత్వ చర్చలు సఫలం – ప్రైవేట్ కళాశాల బంద్ విరమణ
హైదరాబాద్, నవంబర్ 07 – ప్రజా మంటలు:
ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఈ చర్చల ఫలితంగా కళాశాల యాజమాన్యాలు తమ బంద్ మరియు నిరసన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం... వందేమాతరం 150 ఏళ్ల జాతీయ ఉత్సవాల్లో పీఐబీ
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
దేశభక్తి, ఐక్యత ప్రతీకగా నిలిచిన జాతీయ గేయం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పీఐబీ హైదరాబాద్ ఘనంగా నిర్వహించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), డీపీడీ యూనిట్లతో కలిసి పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలో ఈ వేడుకలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది... ప్రభుత్వ ఉద్యోగులకు 44% ఫిట్మెంట్ అమలు చేయాలి - ఎఐటియుసి నేతల డిమాండ్
సికింద్రాబాద్, నవంబర్07 (ప్రజామంటలు)::రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణలు తక్షణం అమలు చేయాలని ఎఐటియుసి అనుబంధ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.మూర్తి డిమాండ్ చేశారు.శుక్రవారం ముషీరాబాద్లోని గాంధీ వైద్య కళాశాలలో హేమలత అధ్యక్షతన జరిగిన యూనియన్ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ— ప్రభుత్వ... సెయింట్ ప్రాన్సిస్ గర్ల్స్ హైస్కూల్ లో వందేమాతరం ఉత్సవాలు
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ సెయింట్ ప్రాన్సిస్ గర్ల్స్ హైస్కూల్ లో శుక్రవారం 150 వసంతాల వందేమాతరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బాన్ని పురస్కరించుకొని స్కూల్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్సీసీ కమాండ్ ఆఫీసర్ కల్నల్ ఎంఎస్.కుమార్ ను స్కూల్ హెడ్మాస్టర్ సిస్టర్ గ్రేసీ, ఎన్సీసీ కోఆర్డినేటర్ ఏ.క్రిస్టినా నిర్మల, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు... TV5 CEO మూర్తికి హైకోర్టులో ఎదురుదెబ్బ
TV5 CEO D.H.V.S.S.N. Murthy పై సినీనటుడు ధర్మ మహేష్ ఫిర్యాదుతో కూకట్పల్లి పోలీసులు ఎక్స్టోర్షన్, బ్లాక్మెయిల్, ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. హైకోర్టు మూర్తి క్వాష్ పిటిషన్ను కొట్టివేసి విచారణ కొనసాగించమని ఆదేశించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శక్తి ప్రదర్శన – మాగంటి సునీత గెలుపుకోసం ముమ్మర ప్రచారం
షేక్పేట్ డివిజన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్,మాజీ మంత్రి రాజేశం గౌడ్,వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మసియుల్లా ఖాన్, దావ వసంత సురేష్, లోక బాపు రెడ్డి పాల్గొన్న ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 7 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ తమ బలాన్ని మరోసారి ప్రదర్శించింది. షేక్పేట్ డివిజన్లోని ... సీనియర్ సిటిజెన్స్ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా హరి అశోక్ కుమార్
జగిత్యాల (రూరల్) నవంబర్ 7 (ప్రజా మంటలు):
రాష్ట్రములో సీనియర్ సిటిజెన్స్ హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి సీనియర్ సిటిజెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని టాస్కా రాష్ట్ర అధ్యక్షులు పి. నర్సింహా రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో 10వ జిల్లా సర్వ సభ్యుల ప్రతినిధి మండలి... 