హరిద్వార్ వద్ద అధ్బుతంగా గంగా హారతి.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
హరిద్వార్ మే 29 (ప్రజా మంటలు) :
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హరిద్వార్ లో గంగాహారతి అంటే గంగా నది కోసం చేసే ప్రార్థన చాలా అధ్బుతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతుందని రాయికల్ మండలం ఇటిక్యాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ తెలిపారు.
చార్ ధామ్ యాత్ర లో భాగంగా హరిద్వార్ సందర్శించిన ఆయన హరిద్వార్ విశేషాలు తెలియజేశారు.
భారతదేశంలో గంగానది పవిత్ర నది. దీనిని దేవతగా పూజిస్తారు. ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం గంగా హారతి హర్ కి పౌరిలో గంగా సభ నిర్వహిస్తారు.
ఆరతి కోసం ఉదయం మరియు సాయంత్రం సమయం సూర్యాస్తమయం మరియు సూర్యోదయం ప్రకారం ఉంటుందని చెప్పారు గంగా హారతి వేడుకకు ఎటువంటి ప్రవేశ రుసుములు లేదా ఛార్జీలు లేవని అన్నారు.
ఈ అద్భుతమైన వేడుకలో పాల్గొనేందుకు గంగా నదికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.
గంగానది కి"పంచామృతం" పుష్పాలను సమర్పించేటప్పుడు గంగా లహరి మంత్రాన్ని జపిస్తారు.
గంగా ఆరతి చివరి భాగం గంగా నది కోసం ప్రత్యేక ఆరతి పాట, ఇది యాత్రికులు / సందర్శకులు లౌడ్ స్పీకర్ల ద్వారా వినవచ్చు. ప్రత్యేక రాగి "దియా"తో పాట సమయంలో పండితులు ఆర్తి అర్పిస్తారు. కొన్ని పండుగలు మరియు జూన్ వంటి రద్దీ సీజన్లలో ప్రత్యేకంగా సాయంత్రం వేడుకల సమయంలో అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వస్తారు. సూర్యాస్తమయ సమయానికి కనీసం ఒక గంట ముందుగా గంగానది తీరానికి చేరుకోవడం వల్ల హారతి దర్శనం బాగా జరుగుతుందని తెలిపారు.
హరిద్వార్ లో పలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయని మహేశ్వర శర్మ వివరించారు.
హరిద్వార్ నుంచి దాదాపు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో పురాణం ప్రాముఖ్యత గల చండీ దేవి మానసా దేవి ఆలయాలు ఉన్నాయని తెలిపారు.
చండీ దేవాలయం :
హిమాలయ దక్షిణ ప్రాంతంలో గల శివాలిక్ పర్వతాల లోని నీల పర్వతం పై చండీ దేవి ఆలయం నెలకొంది..
ఈ దేవాలయం 1929 లో కాశ్మీర్ రాజు అయిన సుచాన్ సింగ్ పునర్ నిర్మించినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఆలయంలో ప్రధాన దైవం "చండీ దేవి" యొక్క విగ్రహాన్ని 8 వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు నెలకొల్పినట్లు చారిత్రకుల అభిప్రాయం.
ఈ దేవాలయం హరిద్వార్ లోని పంచతీర్థాలలో ఒకటైన "నీల పర్వత తీర్థం"గా కూడా పిలుస్తారని స్థానికులు చెప్పారు.
మానసదేవీ దేవాలయం :
హిమాలయాల దక్షిణ భాగంలో గల శివాలిక్ పర్వత శ్రేణిలోని "బిల్వ పర్వతం" శిఖరం పై ఉంది. ఈ దేవాలయం హరిద్వార్ లో పంచతీర్థాలుగా పిలువబడే తీర్థాలలో ఒకటిగా పిలుస్తారు
ఈ దేవత పరమశివుని మనసు నుండి జన్మించినదని పురాణాలు తెలుపుతున్నాయి. మానస నాగరాజు అయిన వాసుకి యొక్క సోదరిగా హైందవ ధర్మం తెలుపుతుంది "మానస" అనగా భక్తుల కోర్కెలు నెరవేర్చిన దేవత అని అర్థం. ఈ దేవాలయం పరిసరంలో గల వృక్షం యొక్క కొమ్మలకు దారాలను కట్టి తమ కోర్కెలను నెరవేర్చమని భక్తులు ప్రార్థిస్తారు. వారి కోర్కెలు నెరవేరిన తర్వాత భక్తులు మరల సందర్శించి ఆ చెట్టు కొమ్మలకు మరలా దారాలను కడతారు. ఈ దేవతకు కొబ్బరికాయలు, పండ్లు, దండలు, సువాసన అగర్ బత్తీలతో పూజలు చేస్తారు.
రోప్ వే ద్వారా చండీ దేవి ఆలయం మానస దేవి ఆలయం లకు వెళ్ళవచ్చని ఆయన అన్నారు.
హరిద్వార్ లో దక్ష మహాదేవ్ ఆలయం చూడదగ్గ ప్రదేశం అని అన్నారు వివేకానంద పార్క్ ప్రేమ్ నగర్ ఆశ్రమం గౌ ఘాట్ పరమేశ్వర మహాదేవ్ ఆలయం చూడవచ్చుని అన్నారు.
గంగ హారతికి హాజరవ్వడం నా అదృష్టం అని చెరుకు మహేశ్వర శర్మ అన్నారు.
గంగ హారతి సమయంలో, అక్కడ వాతావరణం చూడదగ్గది, భక్తులు అందరూ ప్రార్థనలు చేశారు.
చుట్టూ గంగామాత స్తోత్రాలతో, మంచి ఆధ్యాత్మిక నెలకొంది. అయితే మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో పరిశుభ్రత లోపించడం వల్ల భక్తులు కాస్త ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
ఈ యాత్ర లో రాయికల్ వేములవాడ పెద్దపెల్లి కరీంనగర్ నిజామాబాద్ సిద్దిపేట ఖానాపూర్ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం
