జీవన్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఆహ్వానం, రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు

జగిత్యాలలో కేటీఆర్ పర్యటన: 

On
జీవన్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఆహ్వానం, రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు

జగిత్యాల, ఏప్రిల్ 09 (ప్రజా మంటలు):
 
కే.టి. రామారావు (కేటీఆర్) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గత రెండున్నర సంవత్సరాలుగా వైఫల్యాలతోనే ప్రభుత్వం కొనసాగుతోందని, ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదని ఆరోపించారు.
 
గురువారం జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్‌కు జిల్లా కేంద్రం శివారులోని దరూర్ కెనాల్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ వసంత ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం కేటీఆర్ భారీ కాన్వాయ్‌తో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందిస్తూ, శాలువాలతో సన్మానించారు.
IMG-20260409-WA0026
తరువాత కేటీఆర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై జీవన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, త్వరలోనే మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను కలిసి పార్టీలో చేరే తేదీని ప్రకటిస్తానని తెలిపారు.
 
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మూడు సార్లు సుమారు 70 లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన దాదాపు రూ.27 వేల కోట్లను నిలిపివేసిందని విమర్శించారు. మరోవైపు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు.
 
బాసర పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించే విధంగా ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు.
 
అలాగే, 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. గ్యారంటీ కార్డులు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు.
 
సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రైతులు, సామాన్య ప్రజలను సీఎం అవమానపరుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అధికార మత్తులో, అహంకారంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదని, అధికారం ఎవరి సొత్తు కాదని, గతంలో ప్రజలు బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చినట్లే ఇప్పుడు కాంగ్రెస్‌కు ఇచ్చారని, భవిష్యత్తులో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
 
జీవన్ రెడ్డి వంటి అనుభవజ్ఞులైన నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరితే పార్టీ మరింత బలపడుతుందని కేటీఆర్ తెలిపారు. రైతులు, పేదలు, యువత, మహిళల జీవితాల్లో ఆనందం రావాలంటే మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలని అన్నారు.
 
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, గంగుల కమలాకర్, బాలకిషన్, రవిశంకర్, మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, సతీష్ కుమార్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
Join WhatsApp

More News...

State News 

జీవన్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఆహ్వానం, రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు

జీవన్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఆహ్వానం, రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు జగిత్యాల, ఏప్రిల్ 09 (ప్రజా మంటలు):    కే.టి. రామారావు (కేటీఆర్) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గత రెండున్నర సంవత్సరాలుగా వైఫల్యాలతోనే ప్రభుత్వం కొనసాగుతోందని, ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదని ఆరోపించారు.    గురువారం జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్‌కు జిల్లా కేంద్రం శివారులోని దరూర్ కెనాల్ వద్ద...
Read More...
State News 

కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలతో తెలంగాణలో మార్పు – కవిత ప్రకటన

కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలతో తెలంగాణలో మార్పు – కవిత ప్రకటన హైదరాబాద్, ఏప్రిల్ 09 (ప్రజా మంటలు): తెలంగాణ భవిష్యత్‌ను, చరిత్రను మార్చే రోజుగా ఈ నెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ రోజు ప్రకటించబోయే కొత్త పార్టీ ద్వారా ఈ గడ్డకు కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తామని వెల్లడించారు.బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో...
Read More...
Crime  State News 

మహబూబాబాద్ జిల్లాలో అవినీతి కేసులో హెడ్‌మాస్టర్, క్లర్క్ అరెస్ట్

మహబూబాబాద్ జిల్లాలో అవినీతి కేసులో హెడ్‌మాస్టర్, క్లర్క్ అరెస్ట్ మహబూబాబాద్, ఏప్రిల్ 08 (ప్రజా మంటలు): మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.జిల్లాలోని గూడూరు మండలం, అయోధ్యాపురం గ్రామంలోని జెడ్‌పీ హైస్కూల్ హెడ్‌మాస్టర్ శ్రీ జె. రవి కుమార్ (MEO గూడూరు)తో పాటు, జెడ్‌పీహెచ్‌ఎస్ మహబూబాబాద్‌కు చెందిన స్కూల్...
Read More...
National 

అవినీతి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది - కేరళ ప్రజలకు కవిత విజ్ఞప్తి

అవినీతి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది - కేరళ ప్రజలకు కవిత విజ్ఞప్తి హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేరళ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని సూచిస్తూ, పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ (LDF) కూటమికి మద్దతు తెలపాలని కోరారు.ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన...
Read More...
State News 

సాగునీటి తక్షణ విడుదలకు మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు

సాగునీటి తక్షణ విడుదలకు మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు): తెలంగాణ మానవ హక్కుల కమీషన్ అధ్యక్షులు జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో, ఈ రోజు   కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.సంగారెడ్డి జిల్లాలోని ఘనపూర్ అనికట్ కింద సాగుచేస్తున్న రైతులకు సాగునీరు విడుదల కాకపోవడంపై కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 20,000 ఎకరాల్లో సాగు...
Read More...
National  State News 

ఉపాధి హామీ పథకంపై కేంద్రంపై కవిత తీవ్ర విమర్శలు – పని దినాల కోతపై ఆగ్రహం

ఉపాధి హామీ పథకంపై కేంద్రంపై కవిత తీవ్ర విమర్శలు – పని దినాల కోతపై ఆగ్రహం హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్రామీణ పేదలకు కీలకంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు.కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలపై కక్షపూరిత...
Read More...
Local News 

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన జిల్లా అధ్యక్షుడు నందయ్య ,మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన జిల్లా అధ్యక్షుడు నందయ్య ,మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి జగిత్యాల ఏప్రిల్ 7 ( ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ని వారి కార్యాలయం లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్,జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య గార్ల తో కలిసిన జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి ఈ...
Read More...
State News 

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలోమరోసారి ఏసీబీ దాడులు

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలోమరోసారి ఏసీబీ దాడులు జగిత్యాల, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. సుమారు 14 మంది అధికారులతో కూడిన బృందం కార్యాలయంలోని అన్ని విభాగాల్లో విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇది రెండవసారి .   సోదాల సందర్భంగా కార్యాలయ సిబ్బంది మొబైల్ గత...
Read More...
Local News  State News 

జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ కొనసాగుతోంది – ఏప్రిల్‌లోనే కొత్త కార్డులు జారీ - కమీషనర్ ప్రియాంక 

జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ కొనసాగుతోంది – ఏప్రిల్‌లోనే కొత్త కార్డులు జారీ - కమీషనర్ ప్రియాంక  హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు): రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సి.హెచ్. ప్రియాంక తెలిపారు.ఇటీవల అక్రిడిటేషన్ దరఖాస్తులపై వస్తున్న వార్తలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే అందిన...
Read More...
National 

విమానంలో ‘మేడే’ అలర్ట్… లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర పరిస్థితి

విమానంలో ‘మేడే’ అలర్ట్… లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర పరిస్థితి న్యూ డిల్లీ ఏప్రిల్ 05 : Air India Express కు చెందిన ఒక విమానంలో పొగ అనుమానం రావడంతో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. బాగ్‌డోగ్రా నుంచి ఢిల్లీకి వెళ్తున్న IX 1523 విమానం సోమవారం సాయంత్రం అత్యవసరంగా చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CCSIA), లక్నోలో ల్యాండ్ చేయబడింది.సుమారు సాయంత్రం...
Read More...
State News 

బంజారా ప్రముఖులతో కల్వకుంట్ల కవిత భేటీ – కొత్త రాజకీయ పార్టీపై చర్చలు

బంజారా ప్రముఖులతో కల్వకుంట్ల కవిత భేటీ – కొత్త రాజకీయ పార్టీపై చర్చలు హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):   బంజారా ప్రముఖులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక చర్చలు నిర్వహించారు. రిటైర్డ్ అదనపు డీజీ డీటీ నాయక్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ నెల 25న పార్టీ ప్రారంభానికి ముందు, బంజారా సమాజ సమస్యలు, వారికి...
Read More...
Local News 

మహనీయుల ఆశయాలు కొనసాగించాలి

మహనీయుల ఆశయాలు కొనసాగించాలి జగిత్యాల ఏప్రిల్ 5(ప్రజా మంటలు)ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు   జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి దగ్గర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో  డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు  ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా...
Read More...