ఢిల్లీలో ఓసిల మహా ధర్నాను విజయవంతం చేయాలి ధర్నా పోస్టరును ఆవిష్కరించిన ఓసి నేతలు
జగిత్యాల ఫిబ్రవరి 14 ( ప్రజా మంటలు)
ఓసి ల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23 న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి ఓసి ల మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఓసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, జగిత్యాల జిల్లా కన్వీనర్ మహంకాళి రాజన్నలు తెలిపారు.
ధర్నా పోస్టరును శనివారం ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య నాయకులు జగిత్యాల లో ఆవిష్కరించారు.
ఈసందర్భంగా కిషన్ రెడ్డి, రాజన్న లు దేశవ్యాప్తంగా ఓసిల స్థితి గతులను అధ్యయనం చేసి జాతీయ స్థాయిలో ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. మాట్లాడుతూ అగ్రవర్ణాల్లోని ఆర్ధికంగావెనుక బడి ఉన్నవారు రిజర్వేషన్లు లేమి కారణంగా అటు సంక్షేమ పథకాలఫలాలు ఇటు రాజకీయ పదవులు పొందలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పై రాజకీయ పబ్బం కోసం కొందరు ఆయా కులాల్లోని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుపేద ఓసి లు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
అంబెడ్కర్ ఆలోచన విధానo ప్రకారం వెనుకబడిన తరగతుల వారికి పదేళ్ళ వరకు రిజర్వేషన్లు అమలుచ్చేయాలని అంటే 70 ఏళ్ళు దాటినా వాటిని అలానే కంటిన్యూ చేయడం వల్ల ఓసిలకు తీరని అన్యాయం జరుగుతున్నదాన్నారు.
జనరల్ స్థానాల్లో కూడా ఓసి లకు రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వక పోవడం వల్ల రాజకీయంగానూ వెనుక బడి పోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేసేందుకు జాతీయ ఈడబ్ల్యూఎస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి, మహంకాళి రాజన్నలు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఓసి జేఏసీ జగిత్యాల జిల్లా ఓసి నాయకులు సిరిసిల్ల వేణుగోపాల్, సిరిసిల్ల రాజేందర్ శర్మ, సంత గౌతమ్ రెడ్డి, పుల్లూరి సత్యనారాయణ, మేతే ఉమాపతి శర్మ, కటకం చంద్రమౌళి, అయిల్నేని స్వప్న రావు, దేవరశెట్టి జనార్దన్,బండారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీలో ఓసిల మహా ధర్నాను విజయవంతం చేయాలి ధర్నా పోస్టరును ఆవిష్కరించిన ఓసి నేతలు
జగిత్యాల ఫిబ్రవరి 14 ( ప్రజా మంటలు)
ఓసి ల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23 న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి ఓసి ల మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఓసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, జగిత్యాల జిల్లా కన్వీనర్ మహంకాళి రాజన్నలు
ఈసందర్భంగా... శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు
సారంగాపూర్ ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు)
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక... భక్తులను ఆకర్షిస్తున్న కలియుగ దైవం సైకత శిల్పం
జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గత పది రోజుల క్రితం ప్రతిష్టించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి సైకత శిల్పం, రోజురోజుకు ప్రజలు దర్శించుకోవడం పెరిగిపోయింది. శివ కేశవులు ఒకే చోట ఉండాలనుకున్నారేమో శివరాత్రికి శివుని సైకత లింగం కూడా వెంకటేశ్వర స్వామి ముందు... శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణ వేడుకలు
జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం అరవింద నగర్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో, శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయార్చకులు రోహిత్ శర్మ, ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశు శర్మ, భరత్ శర్మ, కార్యక్రమ క్రతువు నిర్వహించారు. అనంతరం మహా అన్న ప్రసాదం భక్తులందరికీ అందించారు.... శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా రుద్ర హవనం
జగిత్యాల ఫిబ్రవరి 14 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రోడ్డులో గల రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమడేలే శ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీ గణపతి పూజ, పుణ్యాహవాచనము, నవగ్రహ ఆరాధన, స్థాపితదేవత ఆరాధన నిర్వహించారు. అంతకముందు ఉదయము మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
శ్రీ రుద్ర... లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలపై అవగాహన కార్యక్రమం
జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని శ్రీ చైతన్య, శ్రీనిధి విద్యా సంస్థలలో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కల్పించే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్రస్థాయి లీడ్ ఇండియా శిక్షణ సమన్వయకర్త తాడూరి శ్రీనివాస్ ఆచార్య మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలకు ఎలా... పోలింగ్ బూత్‌లో మైనర్ ఓటింగ్ ఘటన
ముంబయి, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
మహారాష్ట్రలో జరిగిన జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌లో మైనర్ బాలుడు ప్రవేశించిన ఘటనపై మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు బాధ్యులైన ఒక పోలింగ్ అధికారి, ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.... మీనా ప్రధాన పాత్రలో ‘రోస్లిన్’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల
చెన్నై ఫిబ్రవరి 13:
థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన కొత్త వెబ్ సిరీస్ రోస్లిన్ ట్రైలర్ విడుదలైంది. ఈ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు జితు జోసెఫ్ షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు.
సిరీస్‌కు సుమేష్ నందకుమార్ దర్శకత్వం వహించగా, కథను వినాయక్ శశికుమార్ రచించారు. మాథ్యూ జార్జ్ ఈ సిరీస్‌ను నిర్మించారు.
ఈ సిరీస్‌లో ప్రముఖ నటి మీనా ప్రధాన... జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులకు సన్మానం
జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దేవేందర్ నాయక్, అవారి పవిత్ర శివ కేసరి బాబు, కోరుగంటి రాము, హరీష్‌లు జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్. రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్... దామోదరం సంజీవయ్య 105వ జయంతి: మాజీ సీఎం సేవలు చిరస్మరణీయం
కరీంనగర్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,... ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడంతోనే కాంగ్రెస్ గెలిచింది - కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికలు కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా మిగిలే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి ... DMK కూటమిలో కాంగ్రెస్‌కు ఎక్కువ వాటా? 2021 ఫలితాల ప్రస్తావనతో మాణికం ఠాకూర్ వ్యాఖ్యలు
చెన్నై ఫిబ్రవరి 14:
తమిళనాడు రాజకీయాల్లో కూటమి సమీకరణలపై చర్చకు తెరలేపుతూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావించిన ఆయన,“డీఎంకే నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధికార భాగస్వామ్యం కోరే హక్కు ఉంది. ప్రభుత్వంలో పంచుకునే హక్కు... 