జగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జెండా ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్, జిల్లా ఎస్పీ అశోక్
జగిత్యాల జనవరి 26 ( ప్రజా మంటలు):
విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 125 మంది ఉద్యోగులకు ప్రశంస పత్రాలు ప్రదానం
జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సోజగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘజగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా, రాష్ట్ర శోభ సంతరించుకుని నిర్వహించబడ్డాయి. జాతీయ గీతాలాపనతో, సైనిక బ్యాండ్‌ల మధ్య జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, ఎన్సిసి పరేడ్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశ పౌరులకు సమాన హక్కులు, బాధ్యతలు కల్పిస్తుందని పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవం గురించి క్షుణ్ణంగా వివరించారు.
జిల్లాలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, పౌరసేవలు, సంక్షేమ పథకాలు మరియు ఇతర విభాగాల్లో సాధించిన పురోగతి పై ఆయన విభాగాల వారీగా ఉపన్యాసించారు.
.jpg)
వ్యవసాయ రంగంలో రైతులకు మద్దతు ధరలు, పంట బీమా, సన్న రకం వడ్లకు బోనస్, రైతు సేవా కేంద్రాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఖరీఫ్–రబీ సీజన్లలో పంటల విస్తీర్ణం పెరిగినట్టు వివరించారు. మార్కెట్ యార్డుల్లో ఎం ఎస్ పి చెల్లింపులు పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు.

ఆరోగ్యరంగంలో జిల్లాలో పి హెచ్ సి, సి హెచ్ సి, మాతృశిశు ఆరోగ్యం, అంగన్వాడీ సేవలు సమర్థవంతంగా సాగుతున్నాయని తెలిపారు.

విద్యా రంగంలో పాఠశాలల మౌలిక సదుపాయాల పెంపు, డిజిటల్ బోధన, లైబ్రరీలు మరియు లాబ్‌ల ఏర్పాటుతో విద్యార్థుల అకాడమిక్ వాతావరణం మెరుగుపడినట్టు వివరించారు. బాలికల విద్య ప్రోత్సహానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, సి సిరోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్, త్రాగునీటి సరఫరా వంటి పౌరసేవలు అమలు అవుతున్నాయని తెలియజేశారు. పట్టణాభివృద్ధిలో రోడ్లు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ట్యాంకుల పునరుద్ధరణ, పారిశుద్ధ్య చర్యలు అమలు అవుతున్నాయని వివరించారు.
విధుల్లో ప్రతిభ కనబరిచిన వివిధ ఆయా శాఖల ఉద్యోగులకు ప్రశంస పత్రాలు మరియు బహుమతులు అందజేశారు. "ప్రతి ఉద్యోగి విధి నిర్వహణ అంటే పవిత్ర బాధ్యత. ప్రజా సేవ అంటే నమ్మకం నిలబెట్టడం" అంటూ పేర్కొన్నారు. ఉద్యోగులు మరింత బాధ్యతగా విధులు నిర్వర్తించి అభివృద్ధిలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలన్నారు.
పోలీస్, రెవెన్యూ, విద్య, ఆరోగ్య, మెప్మా, గ్రామపంచాయితీలు, డి ఆర్ డి ఏ, ఐ సి డి ఎస్ మరియు ఇతర శాఖలు అవార్డులు అందుకున్నాయి.
*ప్రభుత్వ శాఖల స్టాళ్లు ప్రధాన ఆకర్షణ*
వ్యవసాయ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా, పిల్లల దివ్యాoగుల వయోవృద్దుల మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ, పట్టణ పేదరిక నిర్ములన సంస్థ ( మెప్మా ), తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, ఎస్సీ, ఎస్టీ, బి. సి మైనార్టీ సంక్షేమ శాఖ, జగిత్యాల జిల్లా పోలీస్ మరియు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రజల దృష్టిని ఆకర్షించాయి.
సంక్షేమ, ఆరోగ్యం, పింఛన్లు, వ్యవసాయం, విద్య, పౌరసరఫరాల పథకాల అమలు వివరాలు, గణాంకాలు, ఫోటో డాక్యుమెంట్స్ ప్రదర్శించబడగా జిల్లా కలెక్టర్ స్టాళ్లను సందర్శించి శాఖల వారిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు.
ఈ వేడుకలకు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులుమరియు ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, ఆర్డీవో మధు సూదన్, కలెక్టరేట్ ఏ.వో షాదబ్ హకిమ్ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, సమబంధిత కార్యాలయాల సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
హైదరాబాద్ / వరంగల్ జనవరి 26, (ప్రజా మంటలు):మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్న ఆయన, పార్టీ మార్పు వెనుక ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. త్వరలో... ఇన్నయ్యకు జాగృతి అండగా ఉంటుంది: జనగాంలో కవిత వ్యాఖ్యలు
జనగాం, జనవరి 26 (ప్రజా మంటలు):
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఎవరూ మాట్లాడని సమయంలోనే ‘దగాపడ్డ తెలంగాణ’ అనే పుస్తకాన్ని ప్రచురించి, 1997లో అదే పేరుతో సభ నిర్వహించి ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఇన్నయ్య అని జాగృతి నేతలు పేర్కొన్నారు. తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో మందిని ఉద్యమంలోకి తీసుకువచ్చారని తెలిపారు.... కల్లెడ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుపుకునే జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవమని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ మెనేని రవీందర్ రావు అన్నారు.
గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ చేట్కూరి... రాయికల్‌లో టీయూడబ్ల్యూజే–ఐజేయు నూతన కార్యవర్గం ఎన్నిక
రాయికల్, జనవరి 26 (ప్రజా మంటలు):
రాయికల్ పట్టణంలో టీయూడబ్ల్యూజే–ఐజేయు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షుడు గడ్డల హరికృష్ణ, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడిగా గుర్రాల వేణుగోపాల్, ఉపాధ్యక్షుడిగా వాసరి రవి, ప్రధాన కార్యదర్శిగా నాగమల్ల శ్రీకర్,... పలు వార్డులలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి
జగిత్యాల జనవరి 26 (ప్రజా మంటలు)
గణతంత్ర దినోత్సవ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని పలు వార్డ్ లలో యూత్ నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, మాజీ... జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల జనవరి 26 (ప్రజా మంటలు)
77 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు కార్యాలయ అధికారులకు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ....ఎందరో త్యాగధనుల ఫలితం మే గణతంత్ర... జగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల జనవరి 26 ( ప్రజా మంటలు):
విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 125 మంది ఉద్యోగులకు ప్రశంస పత్రాలు ప్రదానం
జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సోజగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘజగిత్యాల పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్... ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగం టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు
జగిత్యాల జనవరి (26 ప్రజామంటలు)జిల్లా కార్యాలయంలో ఘనంగా గణ తంత్ర దినోత్సవ వేడుకలు
ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిన గొప్ప పత్రం భారత రాజ్యాంగం అని టియూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస రావు అన్నారు. 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో... రామకృష్ణ విద్యాసంస్థల భారీ జాతీయ పతాక ర్యాలీ
జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు):
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో రామకృష్ణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాక ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల, NSV డిగ్రీ కళాశాల, NSV జూనియర్ కళాశాలలకు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు 550 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని మోస్తూ... భారత రాజ్యాంగం ఎంతో గొప్పది రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం కల్పించింది ప్రతి ఒక్కరు హక్కులతో పాటు బాధ్యతలు కలిగి ఉండాలి
జగిత్యాల జనవరి 26 (ప్రజామంటలు)
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్ల ప్రతి పౌరుడికి సమానత్వం స్వేచ్ఛ న్యాయం అందించిందని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుఎల్లాల రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తహసిల్ చౌరస్తాలో గల జగిత్యాల ప్రెస్ క్లబ్ ( టి యు డబ్ల్యు జే ఐజేయు) లో జాతీయ జెండాను ఆవిష్కరించి... రామకృష్ణ విద్యా సంస్థల వారి ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాక ర్యాలీ
జగిత్యాల జనవరి 26 (ప్రజా మంటలు)77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణానికి చెందిన రామకృష్ణ విద్యాసంస్థలైన రామకృష్ణ డిగ్రీ కళాశాల ,NSV డిగ్రీ కళాశాల మరియు NSV జూనియర్ కళాశాల విద్యార్థులచే 550 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకాన్ని సుమారు 1000 మంది విద్యార్థులతో జగిత్యాల పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు... 