సంక్రాంతి సెలవుల్లో కర్ణాటక రాష్ట్ర పర్యటన చేసిన విద్యార్థులు
చారిత్రక–సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెంచుకున్న వెల్లుల్ల జెడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థులు
మెట్టుపల్లి, జనవరి 15 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్)
సంక్రాంతి సెలవుల సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్ల విద్యార్థులు విద్యా, వైజ్ఞానిక, విహార యాత్రలో భాగంగా ఈ నెల 10 నుంచి ఆరు రోజుల పాటు కర్ణాటక రాష్ట్ర పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ప్రాంతాలను సందర్శించారు.
విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి, తుంగభద్ర డ్యామ్, గోకర్ణ, మురుదేశ్వర్, సముద్ర తీర ప్రాంతాలు, ఉడిపి, ధర్మస్థల, పశ్చిమ కనుమలు, బేలూరు, హాలిబేడు లలోని అద్భుత శిల్ప కళా నైపుణ్యాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తిలకించారు. అలాగే శ్రీరంగపట్నం, కావేరి నది ప్రవాహ ప్రాంతం, మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్, చాముండేశ్వరి దేవాలయం, ఘనుగాపురం శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయాలను కూడా సందర్శించినట్లు ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఈ పర్యటన ద్వారా విద్యార్థులు విజయనగర సామ్రాజ్యం, మైసూర్ మరియు హోయసల రాజుల పరిపాలనా విశేషాలు, వారి అద్భుత కట్టడాలు, శిల్ప సంపద గురించి ప్రత్యక్ష అవగాహన పొందారని ఆయన తెలిపారు. భారతీయ చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై విద్యార్థుల్లో ఆసక్తి పెరగడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో ఉపాధ్యాయులు విజయ్ కుమార్, రవీందర్, రాజారామ్, చంద్రయ్య, సత్యనారాయణ, కవిత, సరస్వతి పాల్గొనగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కృష్ణానగర్ 41 వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న డా బోగ శ్రావణి
జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు) జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి ప్రవీణ్ తమ ఓటు హక్కును 41వ వార్డులోని ఆల్ ఫోర్స్ స్కూల్లో వినియోగించుకున్నారు. అనంతరం పలు వార్డులలో ఎన్నికల సరళిని పరిశీలించారు. పలు ఎన్నికల కేంద్రాల ఎన్నికల సరళని పరిశీలించిన దావ వసంత
జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల, రాయికల్ పట్టణం లోని బి ఆర్ ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిసి ఎన్నికల సరళి తెలుసుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ . బి ఆర్ ఎస్ తో నే జగిత్యాల, రాయికల్ పట్టణ... విద్యార్థి అపహరణ తర్వాత బలవంతపు పెళ్లి
సమస్తిపూర్ (బిహార్), ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
బిహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని అపహరించి మత్తు మందు ఇచ్చి బలవంతంగా వివాహం జరిపించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల సమాచారం ప్రకారం, బాధిత విద్యార్థి లైబ్రరీకి వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు... Epstein Files వివాదం: పార్లమెంట్‌లో రాహుల్ ఆరోపణలు – మంత్రి హర్దీప్ సింగ్ స్పందన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
పార్లమెంట్‌లో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ “Epstein files” అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ మరియు ప్రధాని నరేంద్ర మోదీ పేర్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి... మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ప్రధాన పుణ్యక్షేత్రాలకు భారీగా బస్సులు కేటాయించారు.... ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు వలసవాదులకు మధ్య ప్రస్తుత ఎన్నికలు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి
జగిత్యాల పట్టణంలో 23 వార్డులో ఎస్ కె ఎన్ ఆర్ గౌట్ జూనియర్ బాయ్స్ కాలేజీలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు.
అనంతరం... రేపే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ – బాగ్ లింగంపల్లిలో నిర్వహణ
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఫిబ్రవరి 12న (గురువారం) ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించనున్నారు. వివిధ ఉద్యమ సంఘాల నాయకులు, తెలంగాణ... జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగింపు
జగిత్యాల, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
జగిత్యాల మున్సిపాలిటీ వివరాలు
మొత్తం వార్డులు: 50
ఓటర్లు: 94,800
అభ్యర్థులు: 254
పోలింగ్ కేంద్రాలు: 149
పోలింగ్ సిబ్బంది: 745... ఘనంగా శ్రీ వాణి జూనియర్ కళాశాల ఫేర్వెల్ వేడుకలు
జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణము లోని శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గత విద్యా సంవత్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.... మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు)ఎన్నికలు నిర్వహణకు 900 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీస్ అధికారులు,సిబ్బందితో... దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10:
ఈ సాయంత్రం దేశవ్యాప్తంగా UPI ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. సుమారు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో డబ్బు పంపడం, QR కోడ్ స్కాన్ చేయడం వంటి UPI లావాదేవీలు పనిచేయలేదు.
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రధాన చెల్లింపు యాప్‌లలో సమస్య తలెత్తడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు... జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం
జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 50 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌తో పాటు ముగ్గురు ఇతర పోలింగ్ అధికారులను... 