సంక్రాంతి – ముగ్గులు ::సంప్రదాయం, శాస్త్రం, స్త్రీశక్తి
పండగ ప్రత్యేకతపై కోట ఉమా శర్మ ప్రత్యేక వ్యాసం మీకోసం..
ముగ్గులు ఏ ప్రదేశాన్నైనా సౌందర్యవంతంగా మార్చడమే కాక, ఆ ఇంటిని లక్ష్మీ నివాసంగా మలిచే పవిత్ర చిహ్నాలు. రంగురంగుల డిజైన్లు మాత్రమే కాదు, ప్రతి ముగ్గు వెనుక దాగి ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మిక భావన, సామాజిక ఉద్దేశం చాలా లోతైనవి. రోజూ మనం చూసే ఒక సాధారణ ముగ్గుకే ప్రత్యేక అర్థం ఉంది. ఆ అర్థం, కారణం, ప్రభావం ఏమిటో సంక్రాంతి సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ధనుర్మాసం (డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకు) ముగింపు దశలో వచ్చే భోగి, సంక్రాంతి, కనుమ—ఈ మూడు రోజులు తెలుగు సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా నిలుస్తాయి. ఈ సమయంలో ఇళ్ల ముందు వేసే పెద్ద పెద్ద ముగ్గులు, వాటిలో గొబ్బెమ్మలు, పసుపు–కుంకుమలు, పూల అలంకరణలు, మామిడి తోరణాలు—అన్నీ కలసి ఒక దైవిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. గాలిపటాలతో నిండిన ఆకాశం, ఉదయించే సూర్యునికి పోటీగా మెరిసే రంగులు ఈ పండుగ ప్రత్యేకత.
భోగినాడు భోగి మంటలు, పిల్లలకు భోగి పళ్లు, మహిళలకు పసుపు–కుంకుమలు, పూలు, గాజులు, చలిమిడి, కొత్త బట్టలు, తీపి పదార్థాలు—ఇవన్నీ ఆరోగ్యానికి, ఐక్యతకు, ఆనందానికి ప్రతీకలు. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడి, పౌష్టికాహారం అన్నీ ఈ ఆచారాల్లో దాగి ఉన్నాయి.
కనుమ నాడు వేసే స్వర్గద్వార ముగ్గులు ప్రత్యేకమైనవి. ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు, పదిహేను చుక్కలతో గీతల రూపంలో వేసే ఈ ముగ్గులు కేవలం కళ కాదు—అవి ధర్మ, అర్థ, కామ, మోక్ష మార్గాల సూచికలు. పద్మాలు, శంఖాలు, చక్రాలు, చతురస్రాలు వంటి ఆకృతులు దేవతల చిహ్నాలు. వీటిని బియ్యం పిండితో సహజసిద్ధంగా, పర్యావరణానికి హాని లేకుండా రూపొందించడం మన మహిళల అపార ప్రతిభకు నిదర్శనం.
ఈ సంప్రదాయంలో స్త్రీ శక్తి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక తల్లిగా, సోదరిగా, భార్యగా, కూతురుగా మాత్రమే కాకుండా—సలహాదారిగా, ఉపాధ్యాయినిగా, కుటుంబ ఆర్థిక స్థంభంగా నిలుస్తూ కూడా, ఇంటిముందు ముగ్గుల రూపంలో సంస్కృతిని ఆవిష్కరించగలగడం ఆమె విశిష్టత. గణితం, శిల్పకళ, ఆధ్యాత్మికత—మూడు కలిసిన రూపమే ముగ్గు.
సంక్రాంతి రోజుల్లో హరిదాసుల రాక మరో ప్రత్యేక ఆకర్షణ.
‘హరి’ అంటే శ్రీమహావిష్ణువు, ‘దాసు’ అంటే ఆయన శిష్యుడు. రంగురంగుల దుస్తులు, గజ్జల సవ్వడి, చిరుతల నాదంతో హరిదాసు ముగ్గుల మధ్య నిలబడి కీర్తనలు చేయడం ఆ ఇంటికి మహా పుణ్యం. చిన్నారులు బియ్యం దోసిళ్లతో కలశంలో పోస్తూ ఆశీర్వాదం పొందే దృశ్యం—లక్ష్మీ స్వరూప దర్శనంలా ఉంటుంది.
ఇదే సమయంలో గంగిరెద్దుల సందడి కూడా కనిపిస్తుంది. నందీశ్వరుని ప్రతీకగా భావించే గంగిరెద్దును శంఖ–చక్రాల అలంకరణలతో ముంగిటికి తీసుకువచ్చి దర్శించుకోవడం శుభప్రదం. శివ–కేశవుల అభేద భావనకు ఇది ప్రతీక.
ఈ పండుగలో రైతు పాత్ర మరువలేనిది. కొత్త ధాన్యంతో పరమాన్నం చేసి భూమాతకు, అష్టదిక్పాలకులకు నైవేద్యం సమర్పించడం భారతీయ వ్యవసాయ సంస్కృతికి ప్రతీక. పల్లెల్లో ‘పాతర’ వేసే సంప్రదాయం భవిష్యత్తుపై ముందుచూపును చాటుతుంది.
స్వర్గద్వార ముగ్గుల ద్వారా దేవతలే కాక పితృదేవతల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయని విశ్వాసం. ఈ విధంగా ముగ్గుల ద్వారా ఇంటిని స్వర్గధామంగా మలిచే శక్తి భారతీయ స్త్రీలోనే ఉంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతిల స్థిర నివాసానికి ఇదే మూలం.
సంప్రదాయం, శాస్త్రం, ఆధ్యాత్మికత—మూడు సమన్వయమే సంక్రాంతి ముగ్గులు. ఈ విలువలను నేటి తరం అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లడం కాల అవసరం.
రచయిత్రి
-కోట ఉమా శర్మ
9958144884
More News...
<%- node_title %>
<%- node_title %>
సంక్రాంతి – ముగ్గులు ::సంప్రదాయం, శాస్త్రం, స్త్రీశక్తి
ముగ్గులు ఏ ప్రదేశాన్నైనా సౌందర్యవంతంగా మార్చడమే కాక, ఆ ఇంటిని లక్ష్మీ నివాసంగా మలిచే పవిత్ర చిహ్నాలు. రంగురంగుల డిజైన్లు మాత్రమే కాదు, ప్రతి ముగ్గు వెనుక దాగి ఉన్న శాస్త్రీయత, ఆధ్యాత్మిక భావన, సామాజిక ఉద్దేశం చాలా లోతైనవి. రోజూ మనం చూసే ఒక సాధారణ ముగ్గుకే ప్రత్యేక అర్థం ఉంది. ఆ అర్థం,... సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన దావ వసంత
జగిత్యాల, జనవరి 13 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం సన్నిధిలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొని విజేతలకు జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తెలుగువారి ప్రత్యేక పండుగలలో ఒకటని తెలిపారు. సంక్రాంతి... వైద్య విద్యార్థిని శ్రీనితకు సత్కారం
జగిత్యాల, జనవరి 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ పాత్రికేయుడు అంజయ్య కుమార్తె బొడ్డుపల్లి శ్రీనిత సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రామగుండం వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి ఫ్రీ సీట్ సాధించిన సందర్భంగా ఆమెకు అభినందన సత్కారం నిర్వహించారు.
కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం, జగిత్యాల అధినేత గుండేటి... కట్కాపూర్‌లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు
రాయికల్, జనవరి 13 (ప్రజా మంటలు):
కట్కాపూర్ గ్రామంలో సంక్రాంతి శుభ సందర్భంగా గ్రామ సర్పంచ్ పడాల పూర్ణిమ తిరుపతి గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగింది.
గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా మొత్తం 50 మంది ముగ్గులు వేశారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన ... ఇస్రో ప్రయోగం విఫలం – 16 ఉపగ్రహాలు సముద్రంలో పతనం
శ్రీహరికోట జనవరి 13, (ప్రజా మంటలు):
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన తాజా ఉపగ్రహ ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా విఫలమైంది. ఈ ప్రయోగంలో అంతరిక్షంలోకి పంపాల్సిన 16 చిన్న ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించలేక సముద్రంలో పడిపోయినట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన... ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కిట్ నాణ్యతపై రాజీ వద్దు : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 13 (ప్రజా మంటలు):
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్ విషయంలో నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు స్పష్టం చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి... రోడ్డు భద్రతకు ప్రాధాన్యత – సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు):
రోడ్డు భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని సూచించారు.
యూసుఫ్‌గూడలో జరిగిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, మైనర్లు వాహనాలు నడపడం, డ్రంకెన్ డ్రైవింగ్‌పై... మండలాలు–జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతస్థాయి కమిషన్ :ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
👇
హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు):
మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో సమగ్ర అధ్యయనం కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిషన్‌ను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ కమిషన్ ప్రజల అభిప్రాయాలను సేకరించి నివేదికను అసెంబ్లీ ముందు... గొప్ప కళాఖండాల కేంద్రంగా ఆర్ట్స్ ఎగ్జిబిషన్
హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు):
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ఆర్ట్స్ ఎగ్జిబిషన్ గొప్ప కళాఖండాల కేంద్రంగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. కళాకారుల ప్రతిభ స్లాఘనీయమని ఆయన కొనియాడారు.
సోమవారం ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని డా. చిన్నారెడ్డి ప్రారంభించారు.... డీఏ ప్రకటన కంటితుడుపు చర్యే
హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు):
ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన డీఏ కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ (టీజేటీఎఫ్) అధ్యక్షుడు వీరభద్రరావు తీవ్రంగా విమర్శించారు.
సోమవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీజేటీఎఫ్ కోశాధికారి ఘనపురం దేవేందర్, రాష్ట్ర నాయకులు ఎస్.కే. మస్తాన్‌తో కలిసి మాట్లాడారు.
2023... మాజీ మంత్రి తలసాని 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి : కోట నీలిమ
సికింద్రాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు ):
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ తీవ్రంగా ఖండించారు. తలసాని అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు.
తలసాని వ్యాఖ్యలకు నిరసనగా బేగంపేట్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు.... 