కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం_ స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటేయాలి మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల జనవరి 4( ప్రజా మంటలు)
స్థానిక సంస్థల్లో ఆదిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటాయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జగిత్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, డీ సీ సీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ప్రత్యేక ఆహ్వానితులు వెంకట స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు.
1987 నుండి 2019 మినహా జగిత్యాల మున్సిపల్ పై కాంగ్రెస్ జెండావేగురవేసినం అన్నారు.
బీ ఆర్ ఎస్ పాలనలో ఐదేళ్ల మున్సిపల్ పాలనలో 16 మంది కమిషనర్లు మార్చిన బీ ఆర్ ఎస్ ఘనత. ఏసీబీ దాడులు, విజిలెన్స్ తనిఖీలు
ఎనిమిది మంది అధికారులు జైలు పాలయ్యారు. బీ ఆర్ ఎస్ పాలనకు అద్దం పట్టింది.
కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆదర్శంగా నిలిచింది.
నిత్యం త్రాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు.
వై ఎస్ పాలనలో జగిత్యాలలో కేవలం 200 కే ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చినాము అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అంగడి చిట్టి లేని ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అని తెలిపారు.
వేలాదిమంది నిరుపేదలు ఆర్థిక భారం లేకుండా అంగడి చిట్టి రద్దు చేసినం అన్నారు.
పాత బస్టాండ్, అంగడి బజార్,టౌన్ హాల్ గదులు నిర్మించి, ఏటా రెండు కోట్ల ఆదాయం సమకూర్చినం అన్నారు.
దళితులకు సామూహిక భవనాల కోసం
ఆత్మ గౌరవం నిలబెట్టేలా స్థలాలు కేటాయించినం.
దగ్గులమ్మ గుడి ప్రత్యేక స్థలం కేటాయించి, అభివృద్ధికి తోడ్పడినం.
గంగపుత్రుల కోసం కొత్త బస్టాండ్ వద్ద చేపల విక్రయ కేంద్రం ఏర్పాటు చేసినం.
అన్నపూర్ణ చౌరస్తాలో కూడా చేపల విక్రయ కేంద్రం ఏర్పాటు చేసినం..
బస్తీ దవాఖానాలు 20 ఏళ్ల క్రితం గాంధీ నగర్, ఖిల్లా గడ్డ, మిషన్ కాంపౌండ్ వద్ద అర్బన్ దవాఖాన ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు
కటిక సోదరులకు చింతకుంట వద్ద స్లాటర్ హౌస్ ఏర్పాటు చేసినం అన్నారు.
బీఆర్ ఎస్ పాలనలో
పదేళ్లు నిద్ర పోయి.. జేబు నింపుకున్నారు.
అభివృద్ధి అంటే నాయకుల జేబులు నింపేందుకు కాదనీ
జగిత్యాల మున్సిపాలిటీపై గౌరీ శంకర్ కు మున్సిపల్ పవర్ ఆఫ్ ఆటార్ని రాసి ఇచ్చారా అని ప్రశ్నించారు.
మున్సిపల్ పనులు ఎవరు చేస్తున్నారు..
గౌరీ శంకర్ కన్స్ట్రక్షన్ మినహా ఎవరు చేయవద్దు..అన్న రీతిలో వ్యవహరిస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గౌరీ శంకర్ చెప్పినట్టు చేయకపోతే బదిలీలు.. ఇది జగిత్యాల మున్సిపల్ లో ధైన్య పరిస్థితి.
ఎన్నడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టని వారు
అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదు..
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలకు
స్వయం ప్రతిపత్తి కల్పించారు.
మున్సిపల్ పై పాలక మండలి కి ఉండాలి..
ఎమ్మెల్యేలకు కాదు... సలహాదారులుగా మాత్రమే ఉండాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు నిధులు కేటాయించడం ఇప్పుడు కొత్త కాదు.
పనులు చేపట్టడం పై పాలక మండలి ఆధిపత్యం ఉండాలి..
కాంగ్రెస్ పార్టీ పాలనలో పాలక మండలికి స్వేచ్ఛ నీచ్చినం.
ఆరు సార్లు ఎమ్మెల్యేగా నేను ఏనాడు పాలక మండలి లో జోక్యం చేసుకోలేదనీ గుర్తు చేశారు.
మున్సిపల్ ఛైర్పర్సన్ స్వతంత్ర్యం గా వ్యవహరించాలి.
యావర్ రోడ్డు విస్తరణ.. 1994 లో ఎన్నికలకు ముందు.. నా బాధ్యత నిర్వహించాలని అందరిని ఒప్పించి, మెప్పించి 60 ఫీట్లు విస్తరించిన అన్నారు
యావర్ రోడ్డు అక్రమ నిర్మాణాలు..అనుమతులకు భిన్నంగా నిర్మించుకున్న భవనాలు తొలగించమంటే.. పట్టించుకోవడంలేదు అని తెలిపారు.
కొత్త బస్టాండ్ వద్ద కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా నిర్మించినవి తొలగించడంలో నోరుమేదపడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యా నగర్ ఆలయ భూమిని ఆక్రమణలకు గురి అవుతుంటే అడ్డుకుని, కాపాడిన.
ధరూర్ లో
జై శ్రీరామ్..జై హనుమాన్ అంటూ నినాదించి,
కోదండ రామాలయం భూములు కాపాడినామన్నారు.
నాటి నుండి నేటి వరకు ధర్మానికి కట్టుబడి ఉన్నా..
ఎవరైనా రాజ్యంగ నిబంధనలు గౌరవించాలి
కాంగ్రెస్ పార్టీ అంగట్లో సరుకు కాదు.అని హెచ్చరించారు.
జేబు నింపుకోవాలి తాపత్రాయపడే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త..
పదేళ్లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొట్లాడినాము.
రాజకీయం..పదవి అంటే సేవ చేయాలని కోరుకుంటున్నాం.. మీ లాగ జేబులు నింపుకుంటలేము పరోక్షంగా ఎమ్మెల్యేకు చురక అంటించారు
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియదు..
మున్సిపల్ ఎన్నికల్లో
టిక్కెట్లు పంచుకోవటానికి నీ సొత్తు కాదు.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కు.
టార్గెట్ 50..మున్సిపల్ లో 50 స్థానాల్లో గెలిచి, మున్సిపల్ పై జెండా ఎగుర వేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు
నేను ప్రజా జీవితంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం పోరాటం చేస్తానన్నారు.
శ్రీరాముడు ధర్మానికి కట్టుబడి..రావణాసురుడిని సంహరించాడు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం చదువుకో.. 10 షెడ్యూలు లో ఏం ఉందో..చదువుకోవాలి..
అన్ని మతాలు గౌరవించడం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత.
ఇందిరా గాంధీ చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతా అన్నారు..
నేను చివరి శ్వాస వరకు కార్యకర్తల హక్కుల కోసం పోరాడుతా..
ధర్మానికి కట్టుబడి ఉండే వారికి మంచి రోజులు వస్తాయన్నారు.
నాకు మీరు అండ.. నేను మీకు అండ.. మనకు కాంగ్రెస్ జెండా అండ...అని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
జగిత్యాల మున్సిపల్ అభివృద్ధి పై ఏ చర్చ. కైనా సిద్ధం..
మీ లాగా జేబులు నింపుకోవడం కోవడం..
ప్రజా సేవ ముఖ్యం..ప్రజల హక్కులు కాపాడుతాం..ప్రజా సంక్షేమానికి కృషి చేస్తాం
నూకపల్లి అర్బన హౌసింగ్ ఏ టీమ్ అయింది.
జగిత్యాల పట్టణ నిరుపేదల కోసం 4000 ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తే, డబుల్ బెడ్రూం తెర పైకి తీసుకు వచ్చినారు.
నూకపల్లి డబుల్ బెడ్రూం లో మౌలిక వసతుల సదుపాయాల కొరతన..ఎందుకు చేరడం లేదు..
వార్డు పునర్విభజన పై సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు వెంకట్ స్వామి మాట్లాడుతూ.
నిజమైన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు
వలస వచ్చిన వారు.. ఎంజాయ్ చేస్తున్నారు.
తప్పుడు సమాచారం తో వలసలు..
రాజ్యంగ విరుద్ధమైనవి మేము సమర్థించడం లేదు..
కాంగ్రెస్ పార్టీ కోసం జీవన్ రెడ్డి పోరాటం చేస్తున్నారన్నారు
రాహుల్ గాంధీ కోసం
పని చేస్తున్నారన్నారు
పార్టీ ఏదైనా ఆయారం.. గయరాంతో నడవదు..
జీవన్ రెడ్డి వంటి వాళ్ళతో పార్టీ బతుకుతది అన్నారు.
నిజంగా జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేయాలి.. కష్ట కాలం లో పార్టీని కాపాడారు..
పదేళ్ల బీ ఆర్ ఎస్ పాలనలో చేయని ఒత్తిడి
లేదు..
సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు.
ఒత్తిడికి తలవంచితే జీవన్ మినిస్టర్ గా ఉండేవాడు..
జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడి ఉంటారు..
నిజమైన కార్యకర్తలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక నాయకులు, కార్యకర్తల వల్లే స్థానిక సంస్థల్లో గెలుపొందారు.
మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల మాదిరిగా విజయం సాధించడం అంత సులువు కాదు..
గాంధీ భవన్ ఎదుట కూర్చొని, నిజమైన కార్యకర్తల కోసం కోట్లాడుతా..
తెలంగాణ కోసం తెగించి కోట్లడిన్నం..అదే విధముగా మున్సిపల్ ఎన్నికల్లో తెగించి కొట్లాడి జగిత్యాల లో కాంగ్రెసు పార్టీ జెండా ఎగుర వేయాలి..
ప్రతి వార్డులో గెలిచి, జగిత్యాలలో జెండా ఎగుర వేయాలి..
పిసిసి దగ్గర జగిత్యాల జిల్లా పరిస్థితులు వివరిస్తాను.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించినవారు జీవన్ రెడ్డి ఒక్కరే.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి, రెండు ఇల్లు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నామా..అధికారంలో ఉన్నామా.. ఎక్కడా ఉన్నామో తెలియనీ పరిస్థితి ఉంది.
నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసంతృప్తి తో ఉన్నా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కస్టపడి పనిచేసి, గెలిపించారు.
న్యాయం పక్షనా..నిజమైన కార్యకర్తల పక్షాన నిలబడి..కలబడుతా..అని వేంకట స్వామి ఉద్ఘాటించారు.
జీవన్ రెడ్డి మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాం.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య మాట్లాడుతూ..
కలిసికట్టుగా కృషి చేసి, జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో జెండా ఎగుర వేయాలి..
జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేసేలా కృషి చేస్తానని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల సమస్యలపై చర్చలు
హైదరాబాద్ జనవరి 05 (ప్రజా మంటలు):
మాజీ శాసనసభ్యులు మరియు మాజీ శాసనమండలి సభ్యుల సంఘం సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించబడింది. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులకు సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలు, అలాగే సంఘానికి సంబంధించిన విషయాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, మాజీ ప్రజాప్రతినిధుల సంక్షేమం, ప్రజాహితానికి... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం_ స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటేయాలి మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల జనవరి 4( ప్రజా మంటలు)
స్థానిక సంస్థల్లో ఆదిపత్యం చెలాయించాలని చూస్తే మెడలు పట్టి గెంటాయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జగిత్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి, డీ సీ సీ అధ్యక్షుడు గాజంగి... ఫుట్ పాత్ అనాధలకు ఔషధాలు, దుస్తుల పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 04 (ప్రజా మంటలు):
హైదరాబాద్ నగరంలోని రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, అనాథలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం దుస్తులు, ఔషధాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వివిధ రుగ్మతులతో బాధపడుతున్న వారికి మందులు అందించడంతో పాటు ప్రమాదాలకు గురైన వారికి ప్రాథమిక చికిత్స చేశారు.ఈ కార్యక్రమంలో స్కై ఫౌండేషన్... బన్సీలాల్ పేటలో క్రీడోత్సవం రిజిస్ట్రేషన్లు ప్రారంభం
సికింద్రాబాద్, జనవరి 04 (ప్రజా మంటలు):
ప్రధానమంత్రి సంసద్ మహోత్సవం 2025–26లో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రేరణతో, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ మహా క్రీడోత్సవం కింద బన్సీలాల్‌పేట్ డివిజన్‌లో క్రీడా రిజిస్ట్రేషన్ ప్రారంభోత్సవం నిర్వహించారు.
డివిజన్ బీజేపీ అధ్యక్షులు రామంచ మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ... మేడిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు–తవేరా ఢీ పలువురికి గాయాలు
మెట్టుపల్లి, జనవరి 4 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు మరియు తవేరా వాహనం ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు.
మెట్టుపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు (TS 16 UC 3599) ఆదివారం తెల్లవారుజామున సుమారు 4:45 గంటలకు మేడిపల్లి... నిరుపేద కుటుంబానికి వైద్య సాయం... 4 లక్షల ఎల్ ఓ సి అందజేత...
చిగురుమామిడి జనవరి 4 (ప్రజా మంటలు):
చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చెరుకు వంశీ (18) అనే యువకుడు గత కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతున్నాడు. రెండు కిడ్నీలు పూర్తిగా పని చేయక పోవడం వల్ల కిడ్నీ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. తన తల్లి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న
స్థానిక... వెనిజులా పై అమెరికా దాడి: చట్టమా? లేక సామ్రాజ్యవాద దౌర్జన్యమా?
— సిహెచ్. వి. ప్రభాకర్ రావు
వెనిజులా పై అమెరికా చేసిన సైనిక–భద్రతా చర్యలు, ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను బలవంతంగా అమెరికాకు తీసుకెళ్లి క్రిమినల్ కేసులు నమోదు చేయడం ప్రపంచ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రమాదకర మలుపుగా మారింది. ఇది ఒక సాధారణ “చట్ట అమలు చర్య” కాదు; ఒక సార్వభౌమ దేశంపై... బీసీల బందు కేసీఆర్ అయితే బీసీలకు రాబందు రేవంత్ రెడ్డి- దావ వసంత సురేష్
జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)పట్టణంలోని సావిత్రిబాయి పూలే పార్కులో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బిఆర్ఎస్ నాయకులతో కలిసి సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా తొలి జడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...* బిఆర్ఎస్ హయంలో బడుగు బలహీన వర్గాలకు... రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో నాయకులు
జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు)టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సి ఎస్టి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.
మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ టీఎన్జీవో ఉద్యోగులందరికీ నూతన సంవత్సర... డాక్టర్ అరిగేలా అభినవ్ కు అత్యుత్తమ పరిశోధన పత్రం అవార్డు
జగిత్యాల జనవరి 3 ( ప్రజా మంటలు)జగిత్యాల ముద్దుబిడ్డ డాక్టర్ అరిగేలా అభినవ్ కు అత్యుత్తమ పరిశోధన పత్రం అవార్డు లభించింది.
హైదరాబాదులో నిర్వహించిన 22వ అప్రస్కాన్ 20 25 అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్ఫరెన్స్లో జగిత్యాలకు చెందిన డాక్టర్ అభినవ్... కోరుట్ల పట్టణంలో రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లు లో తనిఖీలు.. జరిమానాలు విధించిన మున్సిపల్ అధికారులు
కోరుట్ల జనవరి 3 (ప్రజా మంటలు)
పట్టణంలో రెస్టారెంట్లు మరియు టిఫిన్ సెంటర్లు లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలో తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు పట్టణంలో గల రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి పరిశుభ్రత పాటించని, మరియు సింగిల్... అభయాంజనేయ స్వామి ఆలయంలో ధార్మిక సంస్థల సమావేశం
జగిత్యాల జనవరి 3(ప్రజా మంటలు) వివిధ ధార్మిక సంస్థల సమావేశము అభయాంజనేయ స్వామి టెంపుల్ అరవింద నగర్ లో జరిగింది దీనిలో భూమి, నీరు,వాయువు అగ్ని ఆకాశము పంచభూతాలను కాపాడుతూ పర్యావరణo అసమతౌల్యం వల్ల జరిగే నష్టాలను అధిగమించుటకు పర్యావరణ సమస్యలను అధిగమించుటకు అందరూ అన్ని దేవాలయాలలో సింగల్ యూస్ ప్లాస్టిక్ వాడకూడదని నిర్ణయం 