గద్వాల్ జిల్లాలో అక్షరాస్యత, రోడ్లు, సాగునీటి వైఫల్యాలపై కవిత తీవ్ర విమర్శలు
గద్వాల జిల్లాలో జాగృతి జనం బాట
గద్వాల్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
జోగులాంబ గద్వాల్ జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, నిర్వాసితుల సమస్యలు, రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు.
రాజకీయ మార్పే పరిష్కారం
“70 ఏళ్లుగా ఒకే కుటుంబానికి అధికారం ఇస్తే ఏం మారింది?కొత్త నాయకత్వం వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యం.
నడిగడ్డ ఎవరి అడ్డా కాదని ప్రజలు నిరూపించాలి” అని కవిత పిలుపునిచ్చారు.
గుడ్డెందొడ్డిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఫస్ట్ స్టేజ్ పంప్ హౌస్, గుడ్డెందొడ్డి ఇరిగేషన్ క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్న ఎస్సీ బాలికల గురుకులం, మల్లాపూర్ తండాలో నిర్మాణంలో ఉన్న గట్టు ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ ను ఆమె సందర్శించారు. నిర్వాసిత రైతులతో మాట్లాడిన కవిత, పూర్తి స్థాయి పరిహారం ఇప్పించే బాధ్యత జాగృతి తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
గద్వాల్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.2029 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని, ఇకపై బీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
“ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలోనే ఉంటాం. ఎంపీగా ఉన్నప్పుడు కూడా ‘మన ఊరు–మన ఎంపీ’ కార్యక్రమంతో ప్రజల్లోనే ఉన్నా” అని గుర్తు చేశారు.
అక్షరాస్యతపై ఆందోళనఓ
గద్వాల్ జిల్లాలో అక్షరాస్యత పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో పురుషుల అక్షరాస్యత 49.8 శాతం, మహిళల అక్షరాస్యత 39.4 శాతం మాత్రమే ఉందని తెలిపారు.
కేతిదొడ్డి మండలంలో మహిళల అక్షరాస్యత కేవలం 23 శాతంకే పరిమితమైందని పేర్కొంటూ,
“దేశవ్యాప్తంగా మహిళల విద్య పెరుగుతుంటే తెలంగాణలో మాత్రం తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘రైజింగ్ తెలంగాణ’ అని ఎలా అంటారు?” అని ప్రశ్నించారు.
రోడ్లు, ఇసుక మాఫియాపై విమర్శలు
జిల్లాలో రోడ్ల పరిస్థితి భయంకరంగా ఉందని, స్కూల్ బస్సులు కూడా గ్రామాలకు రావడం లేదని కవిత తెలిపారు.
ఇసుక మాఫియా కారణంగానే రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆరోపించారు.
“సీఎం ఫోటోలు పెట్టుకొని టిప్పర్లతో ఇసుక దందా జరుగుతోంది. సీఎం గారికి సంబంధం లేకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.
సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం
నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కవిత విమర్శించారు.
తుమ్మిళ్ల ప్రాజెక్ట్ వద్ద మూడు మోటార్లలో ఒక్కటే నడుస్తోందని, కాలువల విస్తరణ, పైప్‌లైన్ అవసరమని వివరించారు.
“వివాదాలు లేని ఆర్డీఎస్ నీళ్లను కూడా సరిగా వాడుకోలేకపోతున్నారు” అని అన్నారు.
విత్తన పత్తి రైతుల సమస్యలు
జిల్లా కేంద్రంలో విత్తన పత్తి రైతులతో సమావేశమైన కవిత, రైతులు ఎదుర్కొంటున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండించారు.
కంపెనీలు ప్రకటించిన ధర కంటే తక్కువ చెల్లిస్తున్నారని, రైతులకు డైరెక్ట్ అగ్రిమెంట్లు, ప్రభుత్వ ఆధ్వర్యంలో టెస్టింగ్ వ్యవస్థ అవసరమని స్పష్టం చేశారు.
చేనేతలు, ఆరోగ్యం, విద్యపై డిమాండ్లు
గద్వాల్ చేనేత పరిశ్రమకు ప్రత్యేక స్థలం కేటాయించాలని, చేనేత కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
300 పడకల ఆసుపత్రి ఉన్నా సరైన వైద్యసౌకర్యాలు లేవని, ప్రజలు కర్నూల్‌కు వెళ్లాల్సి వస్తోందని విమర్శించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన
హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు.
హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు.... నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):
హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల... ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత
జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు) పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ .
శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ... జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు
జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.
హోళీ సందర్భంగా... దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక
న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు):
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు.
AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International... జగిత్యాలలో యువతి ఆత్మహత్య
జగిత్యాల, మార్చ్ 03 (ప్రజా మంటలు):
స్థానిక పోచమ్మవాడకు చెందిన ములస్థం ప్రణవి (25) ఆత్మహత్యకు పాల్పడింది. ప్రణవి బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ, విదేశాలకు వెళ్లాలని ఆసక్తి వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఇటీవల పెళ్లి సంబంధాలు వస్తున్న నేపథ్యంలో తండ్రి పెళ్లి గురించి మాట్లాడినట్లు సమాచారం. పెళ్లి... డీడీఎన్ జగిత్యాల జిల్లా సమావేశం పాల్గొన్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉపేందర్ శర్మ
జగిత్యాల మార్చి 2 (ప్రజా మంటలు)దూప, దీప నైవేద్య జగిత్యాల జిల్లా సర్వ సభ్య సమావేశం స్థానిక ఎస్ వి ఎల్ ఆర్ గార్డెన్ లో జరిగింది. ఈ సమావేశం లో పాల్గొన్న డీడీఎన్ గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ డీడిఎన్ అర్చకుల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని... ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ కు మెడి విజన్ ఐ కేర్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం
జగిత్యాల మార్చి 2 (ప్రజా మంటలు)ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ భవనంలో సోమవారం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ,జగిత్యాల అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో మెడి విజన్ ఐ కేర్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 15 మందికి... దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి: స్పీకర్ వ్యవస్థకు వన్నె తెచ్చిన విలువల శిఖరం – యూటీ ఖాదర్ ఫరీద్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో ఘన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ U. T. ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ... ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల, మార్చి 2(. ప్రజా మంటలు)
వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ ను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ అన్నారు. వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, కంప్యూటర్ శిక్షణ కేంద్రం లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి... పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు
జగిత్యాల మార్చి 2 ( ప్రజా మంటలు)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతిని జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాద రావు చిత్రపటానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మరియు పోలీస్ అదికారులు పూలమాలవేసి నివాళులర్పించారు.
నైతిక విలువలు, ప్రజల పట్ల... పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ మార్చ్ 02 (ప్రజా మంటలు):
హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో వెల్లడైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.
సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి... 