విశ్వాసానికి ప్రతీక శునకం నిఘానేత్రం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఆగస్టు 5 (ప్రజా మంటలు) :
విశ్వాసానికి ప్రత్యేకంగా శునకాన్ని మనం చెప్పుకుంటాం దాన్ని సాదుకున్న యజమాని ఇంటిని నిరంతరం నిఘా చేస్తూ విశ్వాసానికి ప్రతీకగా భావిస్తాం కానీ ఏ ఇంటి యజమాని ఆ శునకాన్ని పెంచడం లేదు.
అది కేవలం ఊర కుక్క...
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో నిరంతరం ఓ ఊరకుక్క తిరుగుతోంది.
పరిసరాల ప్రజలు పెట్టే ఎంగిలి మెతుకులు తింటున్నప్పటికీ ఆ వీధి ప్రజల ఇండ్లకు కాపలాగా రాత్రి వేళ ఓ నిఘానేత్రంలా పనిచేస్తూ ఆ ప్రాంతంలో ఉండే కారులపై నిల్చోని గస్తీ కాస్తుంది.
అంతేకాదు ఇండ్ల బయట ఉండే సజ్జలపై తిరుగుతూ ఇండ్ల పై నుండి కూడా ఆ ప్రాంత ప్రజలకు రక్షణ కల్పిస్తూ కొత్తగా వచ్చిన వ్యక్తులు కనబడినప్పుడు తన సహజ ధోరణిలో అరుపులు పెడుతూ తన విధి నిర్వహిస్తుంది.
పిడికెడు ఎంగిలి మెతుకులు తింటున్నప్పటికీ తన విశ్వాసాన్ని మాత్రం కొనసాగిస్తుంది.
ఆ ఊర కుక్క విశ్వాసానికి స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మనుషులకంటే విశ్వాసం గల ఆ శునకం చేసే సేవలను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
