జగిత్యాల ఆడబిడ్డలందరికీ  బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన దావ.వసంత సురేష్. - జగిత్యాల జిల్లా తొలి జిల్లాప్రజా పరిషత్ చైర్మన్

On
జగిత్యాల ఆడబిడ్డలందరికీ  బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన దావ.వసంత సురేష్. - జగిత్యాల జిల్లా తొలి జిల్లాప్రజా  పరిషత్ చైర్మన్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల 01 అక్టోబర్ (ప్రజా మంటలు) : 

పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మ‌హిళ‌లు అత్యంత వైభ‌వంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బ‌తుక‌మ్మ అని దావ  వసంత సురేష్ అన్నారు.

ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.

తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం అన్నారు.

ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ అందరూ కలిసి పండుగను జరుపుకోవాలన్నారు. 

జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని‌ గౌరమ్మను దావ వసంత సురేష్ ప్రార్థించారు.

Tags