మంత్రి పదవులు దాదాపు ఖరారు లేదా మరో నెల వాయిదా 

On
మంత్రి పదవులు దాదాపు ఖరారు లేదా మరో నెల వాయిదా 

మంత్రి పదవులు దాదాపు ఖరారు లేదా మరో నెల వాయిదా 

హైదరాబాద్ జులై 3: మంత్రి పదవుల జాబితాతో, పీసీసీ అధ్యక్ష పదవి అభ్యర్థి ఎంపిక కొరకు సిఎం రేవంత్ రెడ్డి డిల్లీకి వెళ్లారు. బహుశా రేపే ప్రమాణస్వీకారం ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది. లేదా శ్రావణ మాసం వరకు ఆగకతప్పదు.  రాష్ట్రంలోని రాజకీయాలను తన చేతిలోకి తెచ్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న సిఎం కు మంత్రివర్గ విస్తరణ తప్పనిసరి అయింది.

ఈరోజు కానీ రేపు ఉదయం కొత్తగా క్యాబినెట్ లోకి తీసుకునే మంత్రుల పేర్లతోపాటు పీసీసీ ప్రెసిడెంట్ పేరుని ప్రకటించే అవకాశం

ఈ మధ్యనే బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి బెర్త్ ఖాయం

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు కి కూడా మంత్రి పదవి వరించే అవకాశం

పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు  ఖరారు చేసే యోచనలో ఢిల్లీ హై కమాండ్

 

Tags