సరస్వతి పుత్రునికి అభినందనల వెల్లువ.
ఏకంగా 6 ఉద్యోగాలకు ఎంపికైన సంజయ్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఏప్రిల్ 28 ( ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లాకు చెందిన సరస్వతి పుత్రుడు 6 ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
జగిత్యాల జిల్లా బిరుపూర్ మండలం తుంగూర్ కు చెందిన బెత్తెపు సంజయ్ చిన్నప్పటినుండి విద్యపై మక్కువ పెంచుకుని ఉన్నత చదువులపై దృష్టి పెడుతూనే అందివచ్చిన అవకాశాలను వధులుకోకుండా రాత్రి0భవళ్ళు చదివాడు.
పేద కుటంబంలో లక్ష్మీ, మల్లయ్య పుత్రునిగా సంజయ్ జన్మించి ఇటీవల కష్టపడి చదివి 6 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు.
రైల్వే, ఆబ్కారీ శాఖ, టి ఎస్ పి ఎస్ సి, టౌన్ ప్లానింగ్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ తదితర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
సంజయ్ ను ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, జగిత్యాల సర్పంచుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు ఏన్నం కిషన్ రెడ్డి,నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు పెండెం మహేందర్, పొన్నం లావణ్య, తదితరులు అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సోదర సోదరి అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్
జగిత్యాల ఆగస్టు 27 (ప్రజా మంటలు) రక్షాబంధన్ పండుగ శ్రావణమాసం పౌర్ణమిలో జరుపుకుంటాము. వైదికంగా జంధ్యాల పౌర్ణమిగా దీనినే రాఖీ పౌర్ణమి గా భావిస్తారు. రాఖీ పౌర్ణమి కి ప్రత్యేక విశిష్టత ఉంది. సోదరీలు తమ సోదరులకు రక్షాబంధనం చేసి తమ ఆత్మీయతను ఆవిష్కరిస్తారు.
పౌర్ణమి శుక్రవారం ఉన్నప్పటికీ తక్కువ సమయం ఉండడం అదేవిధంగా... ఉచిత పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.. జగిత్యాల రూరల్ సిఐ దామెర సుధాకర్.
జగిత్యాల, ఆగస్టు 27( ప్రజా మంటలు) ఉచిత పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
కృషి పట్టుదల ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామని జగిత్యాల రూరల్ సిఐ దామెర సుధాకర్ అన్నారు.వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత పోలీసు శిక్షణ శిబిరాన్ని రూరల్ సీఐ సుధాకర్ సందర్శించి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ... మౌంట్ కార్మెల్ హైస్కూల్ లో ఘనంగా రక్ష బంధన్ వేడుకలు
జగిత్యాల ఆగస్ట్ 27(ప్రజా మంటలు)
ధరూర్ లోని *మౌంట్ కార్మెల్ హైస్కూల్* లో రక్ష బంధన్ వేడుకలు అత్యంత ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో పాఠశాల యాజమాన్యం నిర్వహించారుఈ సందర్భంగా పాఠశాల బాలికలు పాఠశాలలోని బాలురకి రాఖీలు కట్టి *నువ్వు నాకూ రక్ష నేను నీకు రక్ష మనం దేశానికి రక్ష* అని నినదించారు.
పాఠశాల... ఘనంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసునీ కళ్యాణం జగిత్యాల ఆగస్టు 26 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాసుని కళ్యాణం వైభవో పెతంగా ఘనంగా జరిగింది .ఉదయం నుండి భక్తులు తండోపతండాలుగా ఆలయానికి చేరుకొని స్వాములను దర్శించుకున్నారు. కళ్యాణానికి వందలాది మంది భక్తులు హాజరైనారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ, నిర్వాహకులు అన్న ప్రసాదం అందించారు.... మా స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఎంఎస్ ఆర్ డి ఎఫ్) ఆధ్వర్యంలో 200 మొక్కలు నాటే కార్యక్రమం
సారంగాపూర్ 26(ప్రజా మంటలు)పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సారంగాపూర్ రంగపేట గ్రామంలో మా స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఎం ఆర్ ఎస్ డి ఎఫ్) ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన 200 మొక్కలు నాటే కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో, విజయవంతంగా ముగిసింది. ఈ హరిత యజ్ఞంలో ఫారెస్ట్ అధికారులు, గ్రామ ప్రజలు, యువకులు... జగిత్యాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డిని కోరిన ఎమ్మెల్యే సంజయ్
హైదరాబాద్, ఆగస్టు 26 (ప్రజా మంటలు):
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అర్బన్ హౌసింగ్ కాలనీలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన... కవి సాయంత్రం ఆధ్వర్యంలో పుస్తకాల ఆవిష్కరణ
సికింద్రాబాద్, ఆగస్ట్ 25 ( ప్రజా మంటలు):
మారుతున్న యాంత్రిక జీవన విధానం వల్ల తెలుగు భాష నిరాదరణకు గురి అవుతున్న సందర్భంలో కవి సాయంత్రం వంటి సాహిత్య సంస్థల కార్యక్రమాలు చూస్తుంటే తెలుగు భాషకు, సాహిత్యానికి పూర్వవైభవం రానున్నదని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
జనజాగృతి సంస్థలో... సిజేరియన్ ప్రసవాలను తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచాలి
జగిత్యాల టౌన్, ఆగస్టు 24 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలో సిజేరియన్ ప్రసవాల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో వాటిని తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి సూచించారు.
జగిత్యాలలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లాలోని గైనకాలజిస్టులతో ప్రసూతి సేవలు, సిజేరియన్ సెక్షన్ ఆడిట్‌పై సమీక్షా సమావేశం... వృద్ధ మహిళకు ప్రాణభయం.. ఆస్తి, ఇన్సూరెన్స్ కోసం వేధింపులు -ప్రజావాణిలో ఫిర్యాదు
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు): తన చిన్న కుమారుడి మరణానంతరం ఆస్తి, ఇన్సూరెన్స్ హక్కులను వదులుకోవాలని ఒత్తిడి చేస్తూ కోడలు, ఆమె తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని ధర్మపురికి చెందిన వృద్ధ మహిళ దహగం దత్తప్రియ ప్రజావాణిలో ఫిర్యాదులో ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని, ముందస్తు పోలీసు రక్షణ కల్పించాలని ఆమె అధికారులను కోరారు.తన... సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన
హైదరాబాద్, ఆగస్టు 24 (ప్రజా మంటలు): తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు వెల్లడించారు. బ్రిటన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన సీఎం సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో... గురుకులాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం- కొప్పుల
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు):
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన విద్యా అవకాశాలను ప్రస్తుత ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. సోమవారం... బైపాస్ రోడ్డుపై బయోమెడికల్ వ్యర్థాలు.. మున్సిపల్ హెచ్చరిక బోర్డు కళ్లముందే నిర్లక్ష్యం
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో హాస్పిటల్ వ్యర్థాల నిర్వహణపై నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. బైపాస్ రోడ్డులోని మోతె డౌన్ చౌరస్తా వద్ద కెనాల్‌పై ‘బయో హజార్డ్’, ‘ఇన్ఫెక్షియస్’ అని ముద్రించిన హాస్పిటల్ వ్యర్థాలను గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు.
ఈ ప్రాంతంలో చెత్త వేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని... 