హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం
హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు):
ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని ,హుస్నాబాద్ పట్టణంలో ఈ ఒక్క సంవత్సరమే 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాము అవకాశం ఇస్తే
హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
హుస్నాబాద్ లో మున్సిపల్ ఎన్నికలకు 1,2,3,12,13,14 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్థానిక ముఖ్య నేతలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. ప్రచారం లో గడపగడప కి వెళ్తూ మహిళలు, చిన్నారులను, వృద్ధులను ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఫిబ్రవరి 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటు అభ్యర్థించారు.
ఒకటవ వార్డులో అనూష సాగర్ ,రెండవ వార్డులో లత కృష్ణ స్వామి ,మూడవ వార్డులో కొండ రజిత , 12 వార్డులో కేశినేని రమేష్ ,13 వార్డులో పచ్చిమట్ల శ్రీకాంత్ ,14 వ వార్డులో దండి లక్ష్మీ లకు మద్దతుగా ప్రచారం నిర్వహించి వారిని ఓటర్లకు పరిచయం చేస్తూ స్థానికంగా ఉండే నేతలు నిరంతరం మీ సమస్యలలో మీకు అండగా ఉంటారని, మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. పేదలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్,మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ,సన్న బియ్యం పంపిణీ , నూతన రేషన్ కార్డులు , మహిళలకు వడ్డీలేని రుణాలు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. హుస్నాబాద్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 20 స్థానాలు ఇచ్చి తనకి మరింత ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు.
హుస్నాబాద్ పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందనీ,హుస్నాబాద్ కి ఇంజనీరింగ్ కళాశాల,ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఉపాధి అవకాశాలు పెంచడానికి ఇండస్ట్రియల్ కారీడార్ తీసుకొస్తున్నామన్నారు. మహిళలకు స్వీయ ఉపాధి పెంచుకోవడానికి సెట్విన్ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎల్లమ్మ చెరువు దగ్గర ఫిషరీస్ మార్కెట్,కోల్డ్ స్టోరేజ్ నిర్ణయిస్తామని ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. ప్రభుత్వం మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా బలన్నివ్వాలని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
[02/02, 19:34] Rajanna Elkathurty Reporter: చట్టం ముందు కేసీఆర్ దేవుడా..?
భయం ఉంటేనే రాస్తారోకోలు ర్యాలీలు
జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వీరమల్లు రంజిత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఎల్కతుర్తి ఫిబ్రవరి 02 ప్రజా మంటలు
సీట్ విచారణలో భాగంగా ఆదివారం రోజున అధికారులు విచారణకు పిలువగా తప్పు చేయనప్పుడు భయమెందుకు అని వారి అనుచరులు రాస్తారోకోలు బైకు ర్యాలీలు చేయడమేంటని అన్నారు. హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమల్లు రంజిత్ రెడ్డి సోమవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కెసిఆర్ ఏమైనా దైవంశ సంభూతుడ మానవాతీతుడా మహాత్ముడా అని అన్నారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను చట్టాలకు అతీతుడా గా చూపించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమాల్లు రంజిత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సిబుసోరెన్ జయలలిత లాలు ప్రసాద్ యాదవ్ యడ్యూ రప్ప వంటి దేశంలోని ప్రముఖ నాయకులే తప్పులకు జైళ్లకు వెళ్లినప్పుడు దుర్మార్గపు పనులు చేసిన ముఠాకు నాయకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ను విచారణకు పిలిస్తే ఎందుకు భయపడుతున్నారని ఆయన నిలదీశారు. కెసిఆర్ తప్పు చేయలేదని అనుకుంటే రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు బైక్ ర్యాలీలు పెట్టి ప్రజలను రోడ్డెక్కించడం ఎందుకని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విభజన అనంతరం కెసిఆర్ ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని వేలకోట్ల అప్పులు చేసి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారని రంజిత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు ఆ అప్పుల భారం మోస్తూ ప్రజలకు పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ప్రజలకు సంక్షేమ పథకాలు విద్య వైద్య రంగాలకు నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతుంటే అభివృద్ధిని జీర్ణించుకోలేని కెసిఆర్ ఆయన అనుచరులు ప్రజా ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. విచారణ ఎదుర్కొనే ధైర్యం లేకనే ప్రజలను రెచ్చగొట్టే రాజకీయ గ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ పై ఉన్న ఆర్థిక అక్రమాలు అవినీతి ఆరోపణలపై సిబిఐ ఈడి సహా కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరగాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. నిజాలు బయటపడితే కెసిఆర్ పాలనలో జరిగిన దోపిడీ ప్రజల ముందు బయటపడుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం అన్నింటిని గమనిస్తోందని రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు మరోసారి రాజకీయ బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. చట్టాన్ని తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా చివరికి న్యాయం గెలుస్తుందని కేసీఆర్ అయినా సరే చట్టం ముందు తలవంచక తప్పదని వీరమల్లు రంజీత్ రెడ్డి స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రావి నారాయణ రెడ్డికి తెలంగాణలో సముచిత స్థానం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
భూమి–భుక్తి–వెట్టిచాకిరి విముక్తి పోరాట వీరుడికి ప్రభుత్వ గౌరవం
హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచితమైన స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రావి నారాయణ రెడ్డి చరిత్రను పాఠ్యాంశాల్లో... హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం
హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు):
ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్... లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం
గొల్లపల్లి, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో సోమవారం లయన్స్ క్లబ్ గొల్లపల్లి, లీడ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోటివేటివ్ స్పీకర్ కెప్టెన్ డా. లయన్ బుర్ర మధుసూదన్ రెడ్డి విద్యార్థుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని నింపారు.... అంగరంగ వైభవంగా బుగ్గారం పోచమ్మల జాతర – రథోత్సవం
బుగ్గారం / గొల్లపల్లి ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం శ్రీ ముత్యాల పోచమ్మ – నల్ల పోచమ్మల జాతర, రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ జిల్లాలతో పాటు అంతర్రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తజనం తండోప తండాలుగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఆలయ కమిటీ చైర్మన్... మొదటిరోజు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం
జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు)జిల్లాలో సోమవారం 17 (జనరల్ మరియు ఒకేషనల్) పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో భాగంగా ఈరోజు జరిగిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు జరిగిన ప్రాక్టికల్ పరీక్షలలో ఉదయం 1409 మంది విద్యార్థులకు గాను 1312 మంది విద్యార్థులు హాజరైనారు.
జనరల్ విభాగంలో... గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 7గురు అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్... పెట్టుబడుల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది
పెట్టుబడులపై Fact Check
(వివరాలు కింది టేబుల్ లో)
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం
ఫోన్ ట్యాపింగ్ కేసు – పారదర్శక విచారణ జరగాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న వేల కోట్ల పెట్టుబడులు కట్టుకథలేనని తెలంగాణ జాగృతి... అభ్యర్థి మంచోడా చెడ్డోడా కాదు – ప్రజలకు ఉపయోగపడేవాడే ముఖ్యం : కవిత
మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది
హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి మంచోడైనా చెడ్డోడైనా కేసీఆర్ ను చూసి ఓటు వేయాలని కేటీఆర్ కోరుతున్నారని కవిత విమర్శించారు.ఇది బీఆర్ఎస్లోని రాజరిక, నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు.
ఈరోజు జాగృతి ఆఫీస్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ, కులం, మతం,... అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-XII విజయవంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లా లో 37 మoది బాల కార్మికులకు విముక్తి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 1 ప్రజా (మంటలు)బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం... 44 వ వార్డులో బిజెపి అభ్యర్థికి మద్దతుగా డా. భోగ శ్రావణీ ప్రచారం
జగిత్యాల ఫిబ్రవరి 1 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికలలో భాగంగ జగిత్యాల పట్టణంలోని 44వ వార్డ్ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆర్మూర్ పద్మ-శ్రీకాంత్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా .బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, బీజేవైఎం... కంటోన్మెంట్ బోర్డు విలీన పోరాటానికి JAC సన్నాహక సమావేశం
సికింద్రాబాద్, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):
కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్‌తో ఆదివారం బాలంరాయిలోని లీ ప్యాలెస్‌లో జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నియోజకవర్గంలోని కాలనీ అసోసియేషన్ సభ్యులు, బస్తీల... స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ లో పాల కావడి ఉత్సవాలు l ll
సికింద్రాబాద్, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని శ్రీ స్కందగిరి సుబ్రమణ్య స్వామి దేవాలయంలో ఆదివారం ఉదయం నుంచి పాల కావడి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేకువ జాము నుంచే వేలాదిమంది భక్తులు పాలకావడిని భుజాన ధరించి ఆలయం చుట్టూ గిరి ప్రదర్శన చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం... 