ధర్మపురిలో కాంగ్రెస్‌లో చేరికలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో బీఆర్ఎస్ నేతల పార్టీలో చేరిక

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్నతో పాటు మాజీ కౌన్సిలర్లు

On
ధర్మపురిలో కాంగ్రెస్‌లో చేరికలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో బీఆర్ఎస్ నేతల పార్టీలో చేరిక

ధర్మపురి, జనవరి 15 (ప్రజా మంటలు):


ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ధర్మపురి పట్టణ మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్నతో పాటు మాజీ కౌన్సిలర్లు మయూరి వేణు, యూనుస్, సాంబు, స్తంభంకాడి రమేష్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాప్రయోజన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నామని అన్నారు. నూతనంగా పార్టీలో చేరిన వారితో పాటు పార్టీలోని సీనియర్ నాయకులందరినీ సమన్వయం చేస్తూ ప్రతి కార్యకర్త గౌరవాన్ని కాపాడుతామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో నేరుగా మార్పు తీసుకొచ్చేలా పలు చారిత్రక నిర్ణయాలు తీసుకుందని మంత్రి తెలిపారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు కొత్త రేషన్ కార్డులు, రైతులకు రైతు భరోసా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన వంటి పథకాలు ప్రజల్లో విశేష స్పందన పొందుతున్నాయని పేర్కొన్నారు.

అలాగే రాజీవ్ యువ వికాసం, చేయూత, ఆసరా పెన్షన్ల పునరుద్ధరణ, కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్, గృహ లక్ష్మి, అన్నపూర్ణ పథకాల ద్వారా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. విద్య, ఉపాధి రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకొని రెండేళ్లలో సుమారు 59 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు గ్రూప్–1, గ్రూప్–2, డీఎస్సీ నియామకాలను పారదర్శకంగా నిర్వహించిందని చెప్పారు.

ధర్మపురి నియోజకవర్గంలో లక్ష్మీ నరసింహ సంస్కృత–ఆంధ్ర కళాశాల పునఃప్రారంభం, ఎల్లంపల్లి ముంపు బాధితులకు మిగిలిన రూ.18 కోట్ల పరిహారం పంపిణీ, మంజూరైన డిగ్రీ కళాశాల, ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాలు, గోదావరి సివరేజ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వివరించారు.

ఈ నెల 20న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధర్మపురి మండలానికి రానున్నారని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ధర్మపురి నియోజకవర్గంలో స్పష్టమైన అభివృద్ధి ప్రజలకు కనబడేలా పనిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 2027లో జరిగే ధర్మపురి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక–పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ప్రత్యేక నిధులు కోరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

More News...

State News 

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు. హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు....
Read More...
State News 

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్ హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు): హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల...
Read More...
Local News 

ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత

ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత    జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు)  పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్  అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు  ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ . శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ...
Read More...
Local News 

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.    హోళీ సందర్భంగా...
Read More...
National  International  

దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక

దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు): పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు. AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International...
Read More...
Local News  Crime 

జగిత్యాలలో యువతి ఆత్మహత్య

జగిత్యాలలో యువతి ఆత్మహత్య జగిత్యాల, మార్చ్ 03 (ప్రజా మంటలు): స్థానిక పోచమ్మవాడకు చెందిన ములస్థం ప్రణవి (25) ఆత్మహత్యకు పాల్పడింది. ప్రణవి బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ, విదేశాలకు వెళ్లాలని ఆసక్తి వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఇటీవల పెళ్లి సంబంధాలు వస్తున్న నేపథ్యంలో తండ్రి పెళ్లి గురించి మాట్లాడినట్లు సమాచారం. పెళ్లి...
Read More...
Local News 

డీడీఎన్ జగిత్యాల జిల్లా సమావేశం పాల్గొన్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉపేందర్ శర్మ

డీడీఎన్ జగిత్యాల జిల్లా సమావేశం పాల్గొన్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉపేందర్ శర్మ జగిత్యాల మార్చి 2 (ప్రజా మంటలు)దూప, దీప నైవేద్య జగిత్యాల జిల్లా సర్వ సభ్య సమావేశం స్థానిక ఎస్ వి ఎల్ ఆర్ గార్డెన్ లో జరిగింది. ఈ సమావేశం లో పాల్గొన్న డీడీఎన్ గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ డీడిఎన్ అర్చకుల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని...
Read More...
Local News 

ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ కు మెడి విజన్ ఐ కేర్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం

ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ కు మెడి విజన్ ఐ కేర్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం జగిత్యాల మార్చి 2 (ప్రజా మంటలు)ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ భవనంలో సోమవారం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ,జగిత్యాల అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో మెడి విజన్ ఐ కేర్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 15 మందికి...
Read More...
Local News 

దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి: స్పీకర్ వ్యవస్థకు వన్నె తెచ్చిన విలువల శిఖరం – యూటీ ఖాదర్ ఫరీద్

దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి: స్పీకర్ వ్యవస్థకు వన్నె తెచ్చిన విలువల శిఖరం – యూటీ ఖాదర్ ఫరీద్ హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో ఘన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ U. T. ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ...
Read More...
Local News 

ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి.  జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ 

ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి.    జగిత్యాల ఆర్డీవో మధుసూదన్     జగిత్యాల, మార్చి 2(. ప్రజా మంటలు) వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ ను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ అన్నారు. వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, కంప్యూటర్ శిక్షణ కేంద్రం  లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి...
Read More...
Local News 

పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు

పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు జగిత్యాల మార్చి 2 ( ప్రజా మంటలు)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్  స్వర్గీయ శ్రీ దుద్దిల్ల  శ్రీపాద రావు  జయంతిని  జిల్లా పోలీస్ ప్రదాన  కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా శ్రీపాద రావు చిత్రపటానికి జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  మరియు పోలీస్ అదికారులు పూలమాలవేసి నివాళులర్పించారు. నైతిక విలువలు, ప్రజల పట్ల...
Read More...
State News 

పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత

పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ మార్చ్ 02 (ప్రజా మంటలు): హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో వెల్లడైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి...
Read More...