హైదరాబాద్‌లో జర్నలిస్టుల అరెస్టులు
అర్ధరాత్రి అరెస్టులపై హరీశ్ రావు, జర్నలిస్టు సంఘాల తీవ్ర అభ్యంతరం
హైదరాబాద్ జనవరి 14 (ప్రజా మంటలు):
హైదరాబాద్‌లో జర్నలిస్టుల వరుస అరెస్టుల వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్ రావు డీజీపీతో ఫోన్‌లో మాట్లాడారు. పండుగ పూట అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు.
నోటీసులు ఇవ్వకుండా, చట్టపరమైన ప్రొసీజర్ అనుసరించకుండా జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదని హరీశ్ రావు తెలిపారు. జర్నలిస్టులు క్రిమినల్స్ గానీ, ఉగ్రవాదులు గానీ కాదని, వారిపట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం అన్యాయమని వ్యాఖ్యానించారు. పండుగ వేళ ఈ అరెస్టులు జర్నలిస్టుల కుటుంబాలను మానసిక వేదనకు గురిచేస్తాయని అన్నారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డీజీపీని కోరారు.
NTV జర్నలిస్టుల అరెస్టు
NTV ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్‌తో పాటు రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశం ఉందని సమాచారం.
మహిళా IAS అధికారి, మంత్రి సంబంధిత వార్త వ్యవహారంలో NTV న్యూస్ ఛానల్‌పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఐదు రోజుల క్రితం ప్రసారమైన కథనంపై నిన్న సీపీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం NTV యాజమాన్యం క్షమాపణ తెలిపింది.
అయితే సమస్య అక్కడితో ముగిసిందని భావించిన సమయంలో, కుటుంబంతో విదేశాలకు వెళ్తున్న దొంతు రమేష్‌ను హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు రిపోర్టర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.
జర్నలిస్టు సంఘాల ఖండన
అర్ధరాత్రి పూట జర్నలిస్టుల అరెస్టులను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం తీవ్రంగా ఖండించింది.
నిరాధారమైన లేదా అసత్య కథనాలపై ముందుగా ఖండన కోరవచ్చని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని, కానీ నోటీసులు లేకుండా అరెస్టులు చేయడం సరికాదని సంఘం పేర్కొంది.
దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్‌లు సీనియర్ జర్నలిస్టులని, వారిని తీవ్రవాదుల్లా అర్ధరాత్రి అరెస్టు చేయడం అన్యాయమని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్థి అపహరణ తర్వాత బలవంతపు పెళ్లి
సమస్తిపూర్ (బిహార్), ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
బిహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని అపహరించి మత్తు మందు ఇచ్చి బలవంతంగా వివాహం జరిపించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల సమాచారం ప్రకారం, బాధిత విద్యార్థి లైబ్రరీకి వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు... Epstein Files వివాదం: పార్లమెంట్‌లో రాహుల్ ఆరోపణలు – మంత్రి హర్దీప్ సింగ్ స్పందన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
పార్లమెంట్‌లో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ “Epstein files” అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ మరియు ప్రధాని నరేంద్ర మోదీ పేర్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి... మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ప్రధాన పుణ్యక్షేత్రాలకు భారీగా బస్సులు కేటాయించారు.... ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు వలసవాదులకు మధ్య ప్రస్తుత ఎన్నికలు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి
జగిత్యాల పట్టణంలో 23 వార్డులో ఎస్ కె ఎన్ ఆర్ గౌట్ జూనియర్ బాయ్స్ కాలేజీలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు.
అనంతరం... రేపే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ – బాగ్ లింగంపల్లిలో నిర్వహణ
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఫిబ్రవరి 12న (గురువారం) ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించనున్నారు. వివిధ ఉద్యమ సంఘాల నాయకులు, తెలంగాణ... జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగింపు
జగిత్యాల, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
జగిత్యాల మున్సిపాలిటీ వివరాలు
మొత్తం వార్డులు: 50
ఓటర్లు: 94,800
అభ్యర్థులు: 254
పోలింగ్ కేంద్రాలు: 149
పోలింగ్ సిబ్బంది: 745... ఘనంగా శ్రీ వాణి జూనియర్ కళాశాల ఫేర్వెల్ వేడుకలు
జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణము లోని శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గత విద్యా సంవత్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.... మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు)ఎన్నికలు నిర్వహణకు 900 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీస్ అధికారులు,సిబ్బందితో... దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10:
ఈ సాయంత్రం దేశవ్యాప్తంగా UPI ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. సుమారు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో డబ్బు పంపడం, QR కోడ్ స్కాన్ చేయడం వంటి UPI లావాదేవీలు పనిచేయలేదు.
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రధాన చెల్లింపు యాప్‌లలో సమస్య తలెత్తడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు... జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం
జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 50 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌తో పాటు ముగ్గురు ఇతర పోలింగ్ అధికారులను... ధర్మపురిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి – మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు కొప్పుల ఈశ్వర్ సవాల్
జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):
మంత్రి లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ధర్మపురిలో జరిగిన అభివృద్ధి కళ్లకు కనిపించకపోతే తాను ఏం చేయలేనన్నారు.
ధర్మపురి నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో ఒకటని,... జిమ్మీ లైకు 20 ఏళ్ల జైలు – హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ క్షీణత
హాంకాంగ్ ఫిబ్రవరి 10:చైనా ప్రభుత్వానికి తీవ్ర విమర్శకుడిగా పేరుగాంచిన, హాంకాంగ్‌కు చెందిన ప్రజాస్వామ్య అనుకూల మీడియా వ్యాపారవేత్త జిమ్మీ లైకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛ తీవ్రంగా క్షీణిస్తున్నదన్న ఆందోళనలకు మరింత బలం చేకూర్చింది.
యాపిల్ డైలీ పత్రిక వ్యవస్థాపకుడైన జిమ్మీ లై, బీజింగ్... 