మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే
హైదరాబాద్, జనవరి 13 (ప్రజా మంటలు):
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియం మంజూరైనప్పటికీ వాటి కోసం ఇప్పటివరకు స్థలం గుర్తించలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంతో ఫోన్‌లో మాట్లాడి, చల్గల్ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, స్టేడియం ఏర్పాటుకు త్వరితగతిన స్థలం గుర్తించాలని సూచించారు.
అలాగే జగిత్యాల జిల్లా కేంద్రంలో 204 కోట్ల వ్యయంతో 230 పడకల ఆసుపత్రి మంజూరై టెండర్ ప్రక్రియ, అగ్రిమెంట్ పూర్తయ్యాయని, క్రిటికల్ కేర్ ఆసుపత్రి పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఆసుపత్రుల భూమిపూజ, ప్రారంభోత్సవానికి హాజరుకావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో మాట్లాడి, అభివృద్ధి పనుల పరిశీలన కోసం జగిత్యాలకు రావాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ విషయంలో వేగంగా స్పందించి చొరవ చూపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు.
*
జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
అన్ని పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బాక్స్‌లను పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు తరలించినట్లు తెలిపారు.స్ట్రాంగ్... కృష్ణానగర్ 41 వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న డా బోగ శ్రావణి
జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు) జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి ప్రవీణ్ తమ ఓటు హక్కును 41వ వార్డులోని ఆల్ ఫోర్స్ స్కూల్లో వినియోగించుకున్నారు. అనంతరం పలు వార్డులలో ఎన్నికల సరళిని పరిశీలించారు. పలు ఎన్నికల కేంద్రాల ఎన్నికల సరళని పరిశీలించిన దావ వసంత
జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల, రాయికల్ పట్టణం లోని బి ఆర్ ఎస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిసి ఎన్నికల సరళి తెలుసుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ . బి ఆర్ ఎస్ తో నే జగిత్యాల, రాయికల్ పట్టణ... విద్యార్థి అపహరణ తర్వాత బలవంతపు పెళ్లి
సమస్తిపూర్ (బిహార్), ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
బిహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని అపహరించి మత్తు మందు ఇచ్చి బలవంతంగా వివాహం జరిపించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల సమాచారం ప్రకారం, బాధిత విద్యార్థి లైబ్రరీకి వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు... Epstein Files వివాదం: పార్లమెంట్‌లో రాహుల్ ఆరోపణలు – మంత్రి హర్దీప్ సింగ్ స్పందన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
పార్లమెంట్‌లో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ “Epstein files” అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ మరియు ప్రధాని నరేంద్ర మోదీ పేర్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి... మహాశివరాత్రి కోసం శ్రీశైలం, వేములవాడకు ఆర్టీసీ 2,243 ప్రత్యేక బస్సులు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ప్రధాన పుణ్యక్షేత్రాలకు భారీగా బస్సులు కేటాయించారు.... ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు వలసవాదులకు మధ్య ప్రస్తుత ఎన్నికలు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల ఫిబ్రవరి 11 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి
జగిత్యాల పట్టణంలో 23 వార్డులో ఎస్ కె ఎన్ ఆర్ గౌట్ జూనియర్ బాయ్స్ కాలేజీలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటింగ్ లో పాల్గొన్నారు.
అనంతరం... రేపే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ – బాగ్ లింగంపల్లిలో నిర్వహణ
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఫిబ్రవరి 12న (గురువారం) ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించనున్నారు. వివిధ ఉద్యమ సంఘాల నాయకులు, తెలంగాణ... జగిత్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగింపు
జగిత్యాల, ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
జగిత్యాల మున్సిపాలిటీ వివరాలు
మొత్తం వార్డులు: 50
ఓటర్లు: 94,800
అభ్యర్థులు: 254
పోలింగ్ కేంద్రాలు: 149
పోలింగ్ సిబ్బంది: 745... ఘనంగా శ్రీ వాణి జూనియర్ కళాశాల ఫేర్వెల్ వేడుకలు
జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణము లోని శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గత విద్యా సంవత్సరం ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.... మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు)ఎన్నికలు నిర్వహణకు 900 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీస్ అధికారులు,సిబ్బందితో... దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10:
ఈ సాయంత్రం దేశవ్యాప్తంగా UPI ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. సుమారు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో డబ్బు పంపడం, QR కోడ్ స్కాన్ చేయడం వంటి UPI లావాదేవీలు పనిచేయలేదు.
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రధాన చెల్లింపు యాప్‌లలో సమస్య తలెత్తడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు... 