జీవో 252 సవరించాలని జగిత్యాల కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా

On
జీవో 252 సవరించాలని జగిత్యాల కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా

జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటల):

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.252లోని నిబంధనలు వేలాది మంది జర్నలిస్టుల ఉపాధికి ముప్పుగా మారాయని ఆరోపిస్తూ, శనివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే హెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుల రాంగోపాల్ మాట్లాడుతూ, కొత్త అక్రిడిటేషన్ విధానంలో చేసిన మార్పుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలను, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త జీవో తీసుకువచ్చినా, అందులోని కొన్ని నిబంధనలు జర్నలిస్టుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు.

గతంలో అమల్లో ఉన్న జీఓ నం.239 ప్రకారం పెద్ద పత్రికలకు 20 మంది కరస్పాండెంట్లు, 20 మంది డెస్క్ జర్నలిస్టులు, 4 మంది కెమెరామెన్‌లకు అక్రిడిటేషన్లు ఉండేవని, కానీ నూతన జీవో 252లో వాటిని వరుసగా 12, 12, 3కు తగ్గించడం అన్యాయమని విమర్శించారు. ఇదే విధంగా జిల్లా స్థాయిలోనూ అక్రిడిటేషన్ల సంఖ్యను తగ్గించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.

జిల్లా అధ్యక్షుడు శికారి రామకృష్ణ మాట్లాడుతూ, మీడియం పత్రికలు, శాటిలైట్ ఛానళ్లకు అక్రిడిటేషన్లలో కోత విధించడం తీవ్రంగా నష్టపరిచే అంశమన్నారు. గతంలో కేబుల్ చానళ్లకు రాష్ట్ర స్థాయిలో ఇచ్చే 12 అక్రిడిటేషన్లను పూర్తిగా రద్దు చేయడం అన్యాయమని తెలిపారు.

IMG-20251227-WA0020
జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు దొమ్మాటి అంజుగౌడ్ మాట్లాడుతూ, గతంలో ప్రతి జిల్లాకు నాలుగు అక్రిడిటేషన్లు ఉండగా, ఇప్పుడు రెండు మాత్రమే ఇవ్వడం జర్నలిస్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

నేషనల్ కౌన్సిల్ మెంబర్ సిరిసిల్ల శ్రీనివాస్, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్ మాట్లాడుతూ, గతంలో నియోజకవర్గ స్థాయిలో ఉన్న అక్రిడిటేషన్లను పూర్తిగా తొలగించడం అన్యాయమన్నారు. అలాగే ఒక లక్ష జనాభాకు ఒక అక్రిడిటేషన్, అంతకంటే ఎక్కువైతే రెండవ అక్రిడిటేషన్ ఇచ్చే విధానాన్ని తొలగించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

డెస్క్ జర్నలిస్టులను వేరు చేసి ‘మీడియా కార్డు’ పేరుతో విభజన తేవడం జర్నలిస్టు సమాజంలో తీవ్ర చర్చకు దారితీస్తోందని, ఇది ప్రభుత్వ ప్రతిష్ఠకే భంగం కలిగించే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. 15 వేల కంటే తక్కువ సర్క్యులేషన్ ఉన్న చిన్న పత్రికలకు కూడా ఈ జీవో ద్వారా అన్యాయం జరుగుతోందని తెలిపారు.

డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టుల మధ్య భేదం లేకుండా అందరినీ అక్రిడిటెడ్ జర్నలిస్టులుగా గుర్తించి, వారి హక్కులు, గౌరవం, ఉపాధిని కాపాడేలా జీఓ 252లో తక్షణ సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. గంగాధర్, కోరుకంటి విజయ్, కోశాధికారి కటుకం రాజేశ్, గోపిగౌడ్, ఎండీ సాజిద్, మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లక్కం మల్లేశం, శివకుమార్, పుల్లా శ్రీనివాస్, నవీన్, హరీష్, రత్నాకర్, కటుకం గణేష్, ప్రభాకర్, సంతోష్, ముకేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

More News...

State News 

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన

కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు. హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు....
Read More...
State News 

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్ హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు): హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల...
Read More...
Local News 

ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత

ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత    జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు)  పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్  అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు  ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ . శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ...
Read More...
Local News 

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.    హోళీ సందర్భంగా...
Read More...
National  International  

దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక

దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు): పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు. AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International...
Read More...
Local News  Crime 

జగిత్యాలలో యువతి ఆత్మహత్య

జగిత్యాలలో యువతి ఆత్మహత్య జగిత్యాల, మార్చ్ 03 (ప్రజా మంటలు): స్థానిక పోచమ్మవాడకు చెందిన ములస్థం ప్రణవి (25) ఆత్మహత్యకు పాల్పడింది. ప్రణవి బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ, విదేశాలకు వెళ్లాలని ఆసక్తి వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఇటీవల పెళ్లి సంబంధాలు వస్తున్న నేపథ్యంలో తండ్రి పెళ్లి గురించి మాట్లాడినట్లు సమాచారం. పెళ్లి...
Read More...
Local News 

డీడీఎన్ జగిత్యాల జిల్లా సమావేశం పాల్గొన్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉపేందర్ శర్మ

డీడీఎన్ జగిత్యాల జిల్లా సమావేశం పాల్గొన్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉపేందర్ శర్మ జగిత్యాల మార్చి 2 (ప్రజా మంటలు)దూప, దీప నైవేద్య జగిత్యాల జిల్లా సర్వ సభ్య సమావేశం స్థానిక ఎస్ వి ఎల్ ఆర్ గార్డెన్ లో జరిగింది. ఈ సమావేశం లో పాల్గొన్న డీడీఎన్ గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ డీడిఎన్ అర్చకుల సమస్యలు పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని...
Read More...
Local News 

ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ కు మెడి విజన్ ఐ కేర్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం

ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ కు మెడి విజన్ ఐ కేర్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం జగిత్యాల మార్చి 2 (ప్రజా మంటలు)ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ భవనంలో సోమవారం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ,జగిత్యాల అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో మెడి విజన్ ఐ కేర్ సెంటర్ హైదరాబాద్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 15 మందికి...
Read More...
Local News 

దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి: స్పీకర్ వ్యవస్థకు వన్నె తెచ్చిన విలువల శిఖరం – యూటీ ఖాదర్ ఫరీద్

దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి: స్పీకర్ వ్యవస్థకు వన్నె తెచ్చిన విలువల శిఖరం – యూటీ ఖాదర్ ఫరీద్ హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో ఘన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ U. T. ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ...
Read More...
Local News 

ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి.  జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ 

ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి.    జగిత్యాల ఆర్డీవో మధుసూదన్     జగిత్యాల, మార్చి 2(. ప్రజా మంటలు) వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ ను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ అన్నారు. వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, కంప్యూటర్ శిక్షణ కేంద్రం  లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి...
Read More...
Local News 

పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు

పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు జగిత్యాల మార్చి 2 ( ప్రజా మంటలు)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్  స్వర్గీయ శ్రీ దుద్దిల్ల  శ్రీపాద రావు  జయంతిని  జిల్లా పోలీస్ ప్రదాన  కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా శ్రీపాద రావు చిత్రపటానికి జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  మరియు పోలీస్ అదికారులు పూలమాలవేసి నివాళులర్పించారు. నైతిక విలువలు, ప్రజల పట్ల...
Read More...
State News 

పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత

పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ మార్చ్ 02 (ప్రజా మంటలు): హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో వెల్లడైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి...
Read More...