గోర్ బంజారా రెండు వందల ఏళ్ల చరిత్రను నవలరూపంలో ఆవిష్కరించిన ‘పోర్యతార’ – జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
గోర్ బంజారా సమాజానికి చెందిన రెండు వందల ఏళ్ల జనజీవన సంఘర్షణ, చరిత్రను తొలిసారిగా నవలరూపంలో తీసుకురావడం శుభపరిణామమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రచయిత ఆమ్ గోత్ వెంకట్ పవార్ రచించిన తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక నవల **‘పోర్యతార’**ను శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆవరణలో మంత్రి ఆవిష్కరించారు. ఈ నవలని తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించడం ప్రత్యేకతగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విశ్వవ్యాప్తంగా విస్తరించిన గోర్ బంజారాల చరిత్ర గొప్పదని, అనేక యుద్ధాల్లో, దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణంలో వారి పాత్ర అనిర్వచనీయమని తెలిపారు. తీవ్ర కరువుల కాలంలో తెలంగాణ ప్రజలకు ధాన్యాన్ని సరఫరా చేసి ఆకలిని తీర్చిన చరిత్ర ఉన్నప్పటికీ, గోర్ బంజారాల ఘనచరిత్ర లిఖిత రూపంలో లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. తరతరాలుగా మౌఖిక కథనాలుగా మాత్రమే మిగిలిపోయిన ఆ చరిత్రను నవల రూపంలో వెలికితీసిన వెంకట్ పవార్ కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
గోర్ బంజారాల జీవన విధానం నిరంతర సంఘర్షణతో కూడినదని, వలస బ్రిటిష్ పాలనలోని చట్టాలు, స్థానిక పాలకుల విధానాల వల్ల వృత్తులు కోల్పోయి, కొత్త జీవన మార్గాలను అన్వేషిస్తూ వందల ఏళ్లుగా పోరాట జీవితం గడిపారని తెలిపారు. ఎన్నో కష్టనష్టాలు ఎదురైనా, నీతి, నిజాయితీలనే ఆయుధాలుగా చేసుకుని ముందుకు సాగిన గోర్ బంజారాల జీవితాలను రచయిత మూడు తరాల నేపథ్యంతో కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారని మంత్రి అన్నారు.
పాలమూరు జిల్లా కరువు, ఆకలి, వలసలు, పోరాటాలకు ప్రతీకగా నిలిచిన ప్రాంతమని పేర్కొంటూ, ఆ సామాజిక పరిస్థితుల నుంచి పుట్టిన వీరవనిత హీరిబాయి సాహస జీవితాన్ని ‘పోర్యతార’ నవలలో అత్యద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించారు. తన ధైర్యసాహసాలతో పాలకులను ఎదిరించి, జాతి ప్రజల సమస్యలను దేశస్థాయిలో ప్రస్తావించి అభివృద్ధికి బాటలు వేసిన హీరిబాయి జీవితం ఈ నవలలో ప్రధానంగా నిలుస్తుందని తెలిపారు.
ఆదివాసీ, గిరిజన సమాజాల చరిత్రను ముద్రణలోకి తీసుకువచ్చి తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య వారసత్వాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. ఆ ప్రయత్నానికి ‘పోర్యతార’ నవల తొలిమెట్టుగా నిలుస్తుందని పేర్కొంటూ, అస్తిత్వ సాహిత్యంలో కొత్త బాట వేసిన రచయిత వెంకట్ పవార్‌ను, ఈ గ్రంథాన్ని ప్రచురించిన తెలంగాణ సాహిత్య అకాడమీని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ డా. తేజావత్ బెల్లయ్య నాయక్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. బాలాచారి, రచయిత ఆమ్ గోత్ వెంకట్ పవార్, తెలంగాణ సాంస్కృతిక సలహా మండలి సభ్యులు ముచ్చర్ల దినకర్, రచయిత సహచరి ఆమ్ గోత్ అనూషాబాయి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గోర్ బంజారా రెండు వందల ఏళ్ల చరిత్రను నవలరూపంలో ఆవిష్కరించిన ‘పోర్యతార’ – జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
గోర్ బంజారా సమాజానికి చెందిన రెండు వందల ఏళ్ల జనజీవన సంఘర్షణ, చరిత్రను తొలిసారిగా నవలరూపంలో తీసుకురావడం శుభపరిణామమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రచయిత ఆమ్ గోత్ వెంకట్ పవార్ రచించిన తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక... పట్టణ సంస్థల బలోపేతం, ఎమ్మెల్యేల ఆరోగ్య పథకంపై కీలక చర్చలు : సచివాలయంలో రాజేశం గౌడ్ భేటీలు
హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ సచివాలయంలో వరుసగా కీలక భేటీలు నిర్వహించారు. పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం, శాసనసభ్యుల ఆరోగ్య పథకం అమలు అంశాలపై ఆయన ఉన్నతాధికారులు, మంత్రులతో సవివరంగా చర్చించారు.
మొదటిగా పురపాలక పరిపాలనా శాఖ... ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం సాగుపై సమీక్ష పాల్గొన్న జిల్లా కలెక్టర్
జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు) జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖ, లోహియ ఆయిల్ పామ్ కంపనీ, మైక్రో ఇరిగేషన్ సిబ్బందికి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణము పెరుగుదల కొరకు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఫిబ్రవరి మాసం వరకు వారికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశాలు జారీచేయడం
ఈ... జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారకపోతే తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కావాలి మాజీ జెడ్పీ చైర్పర్సన్ ద వసంత సురేష్
జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు) దావ వసంత సురేష్ శనివారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ బిఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు దావ వసంత సురేష్ మాట్లాడుతూ....మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాజెంగి నందయ్య... ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత
హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
బోయిన్‌పల్లి మనోవికాస్ నగర్‌లోని ఎన్ఐఈపీఐడీలో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లితండ్రులతో తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లితండ్రులకు పెన్షన్‌తో పాటు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం కల్పించాలని... పార్టీ మారలేదంటే కేసీఆర్ సమావేశానికి రావాలి: దావ వసంత సురేష్
జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పార్టీ మారలేదని చెబుతున్నట్లయితే, రేపు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే బీఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ సవాల్ విసిరారు.
మంత్రి అడ్డూరి లక్ష్మణ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్యలు... నలబైఎళ్లుగా ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవి కట్టబెడుతున్న గ్రామస్తులు
మక్తల్ డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
నలభై సంవత్సరాలుగా గ్రామస్తుల విశ్వాసాన్ని సొంతం చేసుకున్న వనజమ్మ కుటుంబానికే ఆ గ్రామ సర్పంచ్ పదవిని కట్టబెట్టడం విశేషం. గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి వరకు ఈ కుటుంబ సభ్యులే బాధ్యతలు చేపట్టుతూ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
ఐక్యతతో ముందుకు... పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి. -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు):
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం టీ.పి.సి.ఏ.ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా అసోసియేషన్ కార్యాలయంలో పెన్షన్ నిబంధనలు-ప్రయోజనాలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
అనంతరం 2024... హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్
కోరుట్ల డిసెంబర్ 19|(ప్రజా మంటలు):
కోరుట్లకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ క్యాన్సర్‌తో మృతి చెందడంపై తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి మాజీ జెడ్పీటీసీ అడ్డగట్ల లలితలతో కలిసి... అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన... 