పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం.
పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం.
పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష -జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల సెప్టెంబర్ 30 (ప్రజా మంటలు) :
విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందుతున్న ఏ.ఎస్.ఐ వాలి బెగ్, హెడ్ కానిస్టేబుల్ రాజయ్య ను శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను ఎస్పీ అందజేసారు
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు.
విజయవంతంగా సర్వీస్ పూర్తి చేసిన అధికారుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు.
పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు.
అనంతరం పదవి విరమణ పొందిన అధికారులను పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ బ్యాండ్ తో ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) భీమ్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్, వేణు, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
