తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి

అలిశెట్టి  ప్రభాకర్ జన్మదినం 12, జనవరి

On
తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి

తెలుగు కవిత్వంలో రక్తాశ్రువులతో నూతనత్వాన్ని సృష్టించిన అలిశెట్టి అలిశెట్టి  ప్రభాకర్ జన్మదినం 12, జనవరి

IMG_20240111_221643

-సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339.

తెలుగు సాహిత్యంలో అజరామరమైన నూతన సాహిత్య విలువలను, సామాన్యుని గొంతుకను బలంగా వినిపించిన మహనీయుడు, ప్రజల మనిషిగా, జీవితాన్నే సాహిత్యానికి అంకితం చేసిన చిరుకవితల కవి, మరణించి మూడు దశాబ్దాలయినా, నేటికీ వినబడుతూనే ఉంది. కవిత్వం గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా, ఆయన పేరు లేకుండా కవిత్వంపై ప్రసంగం చేయలేని విధంగా, కవిత్వంలో తన ముద్ర వేసిన అతి సామాన్యుడు. ఆయన పేరు వినిపించినంతగా, ఈ శతాబ్దంలోని ఏ కవి పేరుకాని, ఆయన కవితలు కానీ చర్చల్లో కానీ, ఉదాహరణలో కానీ పేర్కొన్న కవి మరొకరు లేరంటే, కవితలుకానీ  లేవంటే అతిశయోక్తి కాదు.

ఆడంభరాలకు, సన్మానాలకు, సభలకు, అవార్డులకు అర్రులు చాచకుండా, తన కాలం, కుంచె ఎప్పటికీ అత్తాడుగువర్గాల ప్రజలు, అణచివేతకు గురైన శ్రామికుల వెన్నంటే ఉంటుందని ఆచారణతో సహాయ ప్రకటించిన అనన్య ప్రతిభావంతుడు అలిశెట్టి. పేరులోన ప్రభాకరున్నీ ఉంచుకోవాడమే కాకుండా, ఆ ప్రభాకరునిలోని  భాస్వర స్వభావ లక్షణాలను పునికి పుచ్చుకొని, తన రక్తాన్నే సిరాగా మార్చుకొని,  సమాజంలోని అసంబద్ద సంప్రదాయాలను, కట్టుబాట్లను, రాజకీయాల్లోని కుళ్లును తన అక్షర యజ్ఞంతో  దహించి వేసే ప్రయత్నం చేసిన అనల్పజీవి అలిశెట్టి ప్రభాకర్ . 

తన కంటూ ఏమి మిగుల్చుకోవాలనే ఆశలు లేకుండా, తన చుట్టూ ఉన్న పేదల బతుకుల పట్ల ఈ సామాజిక, రాజకీయ వ్యవస్థ, తరతరాలుగా వ్యవహరిస్తున్న తీరును తన ప్రతి కవితలో  నిశితంగా విమర్శించారు. అది రాజకీయ నాయకుడైనా, సమాజంలోని ఇతర పెద్దలైనా, మనిషి సృష్టించాడాని చెప్పుకొనే దేవుడైనా ఒకే రీతిలో వ్యవహరిస్తున్నారంటూ, సమాజం తనకు తానుగా మేలుకొంటే తప్ప, ఈ సమాజంలోని బడుగుల బతుకులు బాగుపడవని హెచ్చరించారు.

స్త్రీల పట్ల సమాజ వైఖరిని కూడా నిశితంగా ఖండిస్తూ, మహిళలను ఈ సమాజం ఆటవస్తువుగా, అంగడి బొమ్మలా వాడుకొంటున్నారని ఘోషించాడు. రాజ్యాంగాలు మారినా, ప్రభుత్వాలు మారినా, నేటికీ స్త్రీల పట్ల ఈ సమాజం ఇంకా ఆటవిక యుగం నాటి దృక్పథంతోనే ఉందని, స్త్రీని పురుషుడు తన అవసరాలకు అనుగుణంగా మలుచుకొని, తన లోని రాక్షసత్వానికి ప్రతీకగా చూస్తున్నారని ప్రకటించాడు. “విషాద సాక్షాత్కారం” శీర్షికన రాసిన దీర్ఘ కవితలో స్త్రీల బాధలను వివరంగా ప్రశ్నించారు.

“కన్నీళ్లని ఏ భాషలోకి అనువాదించినా

విషాదం మూర్తీభవించిన స్త్రీయే

సాక్షాత్కరిస్తుంది” అని సిద్ధాంతీకరించారు.

ఇందులోనే “నాజీల అహం/నగ్నంగా స్త్రీలని ఊరేగించినా/ ఊచకోత జ్ఞాపకాల్లోంచీ/నాగరికత బ్లూఫిల్మై /బుసకొట్టే కామాకేళీ చిత్రాల్నుంచీ/ కన్నీళ్ళు ధారాపాతంగా ప్రవహించి / ఘనీభవించే వుంటాయ్” అంటూ మానవ జాతి చరిత్రలో ఎన్నియుగాలు మారినా, ఎంతమంది శాసనులు మారినా స్త్రీలు ఎదుర్కొన్న సమస్యలు మాత్రం రూపం మాయచుకొన్నాయే తప్ప వారికి స్వాతంత్ర్యం లభించలేదని పేర్కొంటూ, “ అశ్రు బిందువునించి/స్త్రీకినకా విముక్తి కాలగలేదంటే/నిజంగా కన్నీరు సముద్రమై/  నిజంగా కన్నీరు సముద్రమంత ఆవేశమై/ఉద్యమాల హోరెత్తితే గాని/ ఈ దోపిడీ దౌర్జన్యాల భూభాగాన్ని/ముంచెత్తాలేదని “స్పష్టంగా నేటి దుస్థితిని ప్రకటించారు. అందాల పోటీల గురించి రాస్తూ,    “అక్షరాన్నివివస్త్రని గావించి/ అమ్ముకొనే/ఆశలీషా సాహిత్యం నుంచీ .. కన్నీళ్ళు ప్రవహిస్తూనే వుంటాయ్” అంటూ ఆవేదన చెందారు. 

సాహిత్యకారులుగా, తెలుగు భాషకు తామే ప్రతినిధులుగా చెప్పుకొంటున్న కుహనా మేధావుల గురించి కూడా కుండబద్దలుకొట్టినట్లు తన  అంతరంగాన్ని వెల్లడించారు. సమసమాజం కొరకంటూ ప్రచారం చేసుకొంటూ, ప్రభుత్వ అవార్డులకొరకు తమవంతు కృషి చేసుకొంటూ, తమ రచనలలో తీవ్రంగా వ్యతిరేకించిన పెట్టుబడిదారు వర్గాన్ని, రాజ్యాన్ని, రాజ్యాధినేతలను ప్రసన్నం చేసుకోవడానికి, అవార్డులు పొందడానికి చేసిన శ్రమను నిరసిస్తూ, అవహేళన చేశారు. అలాంటి వారి గురించి “ అర్భకుడైన కవి ఒకడు/ అవార్డులూ / సన్మానల కోసం / దేబారించడం తప్ప/ నగరంలో నేడు/ అవాంఛనీయ/ సంఘటనలేవీ జరగలేదు” అని స్పష్టంగా వరి మనస్తత్వాన్ని, వరైకి ప్రజల పట్ల సమాజంపట్ల ఉన్నదంతా పైపై ప్రేమేనని చెప్పినట్లుగా, కవితలో చెప్పారు.

సమాజంలో సమానావకాశాలు లేక, చిటికి పోయిన బతుకులను చూసిచూసి విసిగిపోయిన ఆరోషంలో నుండి చూస్తూ, నా కవిత అనే శీర్షికతో రాసిన దాంట్లో “ నా గుప్పిట్లో / మండుతున్న/ ఎన్నో గుండెలు/ ఒక్కో దాన్లో/ దూరి/ వాటిని చీరి / రక్తాశ్రువులు ఏరి/ పరిశీలిస్తాను/ నేను” అంటూ తన సిద్ధాంతాన్ని, విధానాన్ని స్పష్టంగా తెలియజెప్పిన సామాన్య అక్షర యోధుడు అలిశెట్టికి అక్షరాంజలి.

Tags

More News...

National  International   State News 

ముగ్గురు అమ్మాయిలను చంపిన బ్రిటిష్ నేరస్థుడికి 52 ఏళ్ల జైలు!

ముగ్గురు అమ్మాయిలను చంపిన బ్రిటిష్ నేరస్థుడికి 52 ఏళ్ల జైలు! ముగ్గురు అమ్మాయిలను చంపిన బ్రిటిష్ నేరస్థుడికి 52 ఏళ్ల జైలు! లండన్ జనవరి 24: బ్రిటన్లో ముగ్గురు బాలికలను హత్య చేసిన కేసులో నిందితుడికి కోర్టు 52 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రుడాకుబానా (18) జూలై 2024లో సౌత్‌పోర్ట్‌లో ఆలిస్ డా సిల్వా అగ్యుయర్ (9), బెబే కింగ్ (6), ఎల్సీ డాట్ స్టాన్‌కోంబ్...
Read More...
Local News 

ఫుట్​ పాత్​ అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా సిబ్బంది

ఫుట్​ పాత్​ అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా సిబ్బంది ఫుట్​ పాత్​ అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా సిబ్బంది సికింద్రాబాద్​, జనవరి 24 ( ప్రజామంటలు): పద్మారావునగర్​ పార్కు ప్రాంతంలో ఫుట్ పాత్​ ల వెంట ఏర్పాటు చేసిన అక్రమ దుకాణాలను శుక్రవారం సికింద్రాబాద్​ జీహెచ్​ఎమ్ సీ సిబ్బంది కూల్చివేశారు. పార్కు ప్రాంతంలోని ఫుట్​ పాత్​ లను ఆక్రమించుకొని ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా...
Read More...
Local News  State News 

ప్రజావాణికి జన ప్రభంజనం - ప్రజావాణిలో  12, 459 దరఖాస్తులు

ప్రజావాణికి జన ప్రభంజనం - ప్రజావాణిలో  12, 459 దరఖాస్తులు ప్రజావాణికి జన ప్రభంజనం - ప్రజావాణిలో  12, 459 దరఖాస్తులు రికార్డు స్థాయిలో ప్రజావాణిలో దరఖాస్తుల నమోదు సింహ భాగం ఇందిరమ్మ ఇండ్ల కోసమే  దరఖాస్తులను స్వీకరించిన ప్రజావాణి ఇంచార్జీ చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య   హైదరాబాద్ జనవరి 24: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 12,...
Read More...
National  State News 

స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే - మద్రాస్ హైకోర్టు 

స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే - మద్రాస్ హైకోర్టు  స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే - మద్రాస్ హైకోర్టు  చెన్నై జనవరి 24:“పోష్ చట్టంలో కనిపించే “లైంగిక వేధింపులు” అనే నిర్వచనం దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం కంటే ఆ చర్యకు ప్రాముఖ్యత అని మద్రాస్ హైకోర్టు అభిప్రాయ పడింది.స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే అని...
Read More...
Local News  State News 

స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలుడి అంత్యక్రియలు

స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలుడి అంత్యక్రియలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలుడి అంత్యక్రియలు సికింద్రాబాద్​ జనవరి 24 (ప్రజామంటలు) : కుమారుడి మరణంతో దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచాయి. వివరాలు ఇవి.... వెస్ట్ బెంగాల్ రాష్ట్రం  కూచ్ బీహార్ జిల్లాకు చెందిన హితేన్ బర్మన్, పూర్ణిమా బర్మన్ దంపతుల కుమారుడు ఆదిత్య బర్మన్  (4 నెలల వయస్సు) శుక్రవారం...
Read More...
Local News  State News 

కరీంనగర్ BRS మేయర్ బీజేపీ లోకి జంప్ 

కరీంనగర్ BRS మేయర్ బీజేపీ లోకి జంప్  కరీంనగర్ BRS మేయర్ బీజేపీ లోకి జంప్  కరీంనగర్ జనవరి 24:  కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు, పది మంది కార్పొరేటర్లతో కలిసి రేపు, కేంద్ర మంత్రి, స్థానిక ఎంపి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు.  స్థానిక BRS నాయకుల మధ్య ఉన్న వివాదాలే ఆయన పార్టీ ఫిరయింపుకు కారణం అని...
Read More...
Local News 

అంగన్వాడీ పాఠశాలకు స్మార్ట్ టీవీ బహూకరణ

అంగన్వాడీ పాఠశాలకు స్మార్ట్ టీవీ బహూకరణ అంగన్వాడీ పాఠశాలకు స్మార్ట్ టీవీ బహూకరణ   ధర్మపురి జనవరి 34: ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని న్యూ హరిజన వాడలో గల అంగన్వాడీ కేంద్రానికి కేంద్ర అంగన్వాడి కార్యకర్త, టీచర్ జె .మాధవీలత విజ్ఞప్తి  మేరకు, అంగన్వాడీ కేంద్రానికి, ధర్మపురికి చెందిన రాష్ట్ర బిజెపి నాయకుడు, దాత దామెర రామ్ సుధాకర్ గారి ₹ 25 వేల...
Read More...
Local News 

మురుగు నీటిలో కూర్చుండి కాంగ్రెస్​ నేత నిరసన

మురుగు నీటిలో కూర్చుండి కాంగ్రెస్​ నేత నిరసన మురుగు నీటిలో కూర్చుండి కాంగ్రెస్​ నేత నిరసన సికింద్రాబాద్​, జనవరి 24 ( ప్రజామంటలు) : బన్సీలాల్​ పేట డివిజన్​ మేకలమండి లో డ్రైనేజీ పనుల కోసం నిధులు మంజూరీ అయి, పనులు చేయడానికి కాంట్రాక్టర్​ సిద్దంగా ఉన్నప్పటికీ అధికారులు పనులు ప్రారంభించడానికి  జాప్యం చేయడంపై కాంగ్రెస్​ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం డివిజన్​...
Read More...
Local News 

కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోండి   * రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి విజ్ఞప్తి 

కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోండి   * రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి విజ్ఞప్తి  కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోండి    * రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి విజ్ఞప్తి  సికింద్రాబాద్​, జనవరి 24 ( ప్రజామంటలు ) : కొండపోచమ్మ సాగర్​ నీటిలో మునిగి మృతిచెందిన  సిటీకి చెందిన ఐదుగురు యువకుల కుటుంబాలను రాష్ర్ట ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కేంద్రమంత్రి స్థానిక బీజేపీ నాయకులతో...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ ఆధ్వరంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు 

స్కై ఫౌండేషన్ ఆధ్వరంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు  స్కై ఫౌండేషన్ ఆధ్వరంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు  సికింద్రాబాద్​, జనవరి 24 ( ప్రజామంటలు): జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్లకుంట  ప్రభుత్వ పాఠశాలలో స్కై ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.  బాలికలకు క్యారం బోర్డ్స్, చెస్ బోర్డ్స్, షటిల్ బ్యాట్స్, స్కిప్పింగ్ ఇతర ఆటవస్తువులు  బిస్కెట్స్ ప్యాకెట్స్ అందించారు....
Read More...
National  State News 

పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో ఏం జరిగింది? - మాజీ మంత్రి, DMK ఎంపి రాజా 

పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో ఏం జరిగింది? - మాజీ మంత్రి, DMK ఎంపి రాజా  పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో ఏం జరిగింది? - మాజీ మంత్రి, DMK ఎంపి రాజా  న్యూ ఢిల్లీ జనవరి 24: వక్స్ సవరణ బిల్లుపై పార్లమెంటరీ జాయింట్ కమిటీ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులను ఎందుకు సస్పెండ్ చేశారని డీఎంకే ఎంపీ. ఎ. రాజా వివరించారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది లోక్సభలో వక్స్ సవరణ బిల్లును...
Read More...
Local News 

మాతృగయ సిద్దుపూర్ లో ఘనంగా మాతృదేవతలకు శ్రాద్ధాదులు

మాతృగయ సిద్దుపూర్ లో ఘనంగా మాతృదేవతలకు శ్రాద్ధాదులు మాతృ గయ జనవరి 24 (ప్రజా మంటలు) మాతృదేవతకు శ్రాద్ధం చేయడం కేవలం మాతృగయ సిద్దుపూర్ ప్రాముఖ్యత. మాతృశ్రీకి, పిత్రుడికి కొడుకులు మాత్రమే శ్రాద్దం నిర్వహిస్తారు కానీ మాతృగయాలో కుమారుడు ,కుమార్తె సైతం కర్మ నిర్వహించడం ఇక్కడి స్థల విశేషం. పూర్వము ఈ గ్రామం పేరు శ్రీ స్థల్ ఇక్కడ రాజు సిద్ధ రాజ్ జై...
Read More...