మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత
అదిలాబాద్ జూన్ 29 :
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఆకస్మికంగా కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్‌లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని,మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో తుది శ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు
మొదట హుటాహుటీన కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్లు పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌ను పార్టీ నుంచి టీపీసీసీ సస్పెండ్ చేయడంతో,ఆయన కూడా కాంగ్రెస్‌ను వదిలేశారు.
లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన రమేశ్‌రాథోడ్, బీజేపీలో చేరిపోయారు. రమేష్ రాథోడ్ 2009లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2018లో ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీచేసి ఓడిపోయారు.
షెడ్యూల్ తెగలకు చెందిన రమేష్ రాథోడ్, అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ నాయకుడుగా ఎదుగుతూ వచ్చారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. అతను 1999లో ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2006–2009 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ అసెంబ్లీ స్థానానికి 2009–2014 ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
అనంతరం ఖానాపూర్ అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రమేశ్ రాథోడ్. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. జూన్ 2021 లో ఈటెల రాజేందర్ తోపాటు భారతీయ జనతా పార్టీలో చేరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
