హనుమాన్ చాలీసా భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, ప్రత్యేక పూజలు.

On
హనుమాన్ చాలీసా భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, ప్రత్యేక పూజలు.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల జూన్ 1 (ప్రజా మంటలు)

జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో హనుమాన్ చాలీసా భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు ప్రత్యేక పూజలు...

ఈ సందర్భంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శనివారం రాత్రి 7 గంటలకు. విశేష సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం, భక్తి పాటలతో భజనలు అంగరంగ వైభవంగా ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు.

అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

కార్యక్రమంలో హనుమాన్ చాలీసా భక్త బృందం, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, సంగనభట్ల నరేందర్ శర్మ, కంజర్ల అనంతాచారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags