అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులు పరిశీలించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర.

On
అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులు పరిశీలించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113) 

సారంగాపూర్ మే 30 (ప్రజా మంటలు)

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జగిత్యాల దివాకర సారంగాపూర్ మండలంలోని లచ్చక్కపేట మరియు నాగునూరు గ్రామాల మండల ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న అమ్మ ఆదర్ష పాఠశాల పనుల ప్రగతిని గురువారం రోజున పరిశీలించడం జరిగింది.

మండలంలో గుర్తించబడిన 10 పాఠశాలలో నిర్మాణ పనులను 31వ తారీఖు వరకు పూర్తి చేయాల్సిందిగా ఆదేశించినారు. పాఠశాలకు కావాల్సిన అన్ని వసతులు కల్పించాల్సిందిగా పనులలో నాణ్యత ఉండేటట్లుగా ఆదేశించడం జరిగినది. ఇట్టి కార్యక్రమములో పంచాయతీ రాజ్ ఈ ఈ, డిప్యూటీ ఈ ఈ, ఏ ఈ,ఎంపిడిఓ, ఎంపీఓ మరియు కార్యదర్శులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags