సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేసిన షెడ్డు నిర్మాణం పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ.

On
సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేసిన షెడ్డు నిర్మాణం పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల మే 23( ప్రజా మంటలు) : 

జగిత్యాల పట్నంలోని పాత బస్టాండ్ సమీపంలో ఇటీవల ఓ ఖాళీ స్థలంలో వ్యాపార నిమిత్తమై తాత్కాలికంగా షెడ్డు నిర్మాణం జరిగింది.

నిర్మాణంలో ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా నిర్మించారని స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో చైర్ పర్సన్ కు స్థానికులు అధికారుల అలసత్వం పై ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ నిజనిర్ధారణకై నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. యదార్ధంగా సెట్ బ్యాక్ లేకపోవడంతో నిర్మాణదారులు తమకు తాముగా సెట్ బ్యాక్ చేసుకొని నిర్మించుకోవాలని లేనట్లయితే మున్సిపల్ అధికారులచే తొలగించవలసి వస్తుందని నిర్మాణదారులకు చైర్పర్సన్ సూచించారు.

Tags