ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనమివ్వాలి ఎన్‌ హెచ్‌ ఎం జిల్లా అధ్యక్షురాలు మధురిమ

On
ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనమివ్వాలి  ఎన్‌ హెచ్‌ ఎం జిల్లా అధ్యక్షురాలు మధురిమ

ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనమివ్వాలి

ఎన్‌ హెచ్‌ ఎం జిల్లా అధ్యక్షురాలు మధురిమ

జగిత్యాల ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు): ఎన్‌ హెచ్‌ ఎం ఉద్యోగులందరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఎన్‌ హెచ్‌ ఎం జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు గాండ్ల మధురిమ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

 జగిత్యాల ఎన్‌.హెచ్‌.ఎం. ఆల్‌ క్యాడర్స్‌ సమావేశం  కార్మిక భవన్‌ సుభాష్‌ నగర్‌ లో  జరిగింది.ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఐటియుసి కడారి రాములు అధ్యక్షత జరుగగా సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐటియుసి ఎన్‌.హెచ్‌.ఎం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్‌ ఖాన్నా హాజరయ్యారు.  జగిత్యాల జిల్లా ఎన్‌.హెచ్‌.ఎం నాయకులు వెన్న మహేష్‌ , సిరిసిల్ల జిల్లా ఎన్‌ హెచ్‌ ఎం నాయకురాలు రాణి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల ఎన్‌ హెచ్‌ ఎం ఆల్‌ క్యాడర్స్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధురిమ మాట్లాడుతూ.... ఎన్‌ హెచ్‌ ఎం ఉద్యోగులందరికీ వెంటనే ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రత హెల్త్‌ కార్డులు ,వేతనాల పెంపు చేయాలని , పి.ఆర్‌.సి ఏరియర్స్‌ 7 నెలలు వెంటనే విడుదల చేయాలిని, సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

 

జగిత్యాల జిల్లా ఎన్‌.హెచ్‌.ఎం. అధ్యక్షులుగా గాండ్ల మధురిమ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రజిత, వైస్‌ ప్రెసిడెంట్లుగా అనురాధ, బడుగు శిరీష, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా వడ్నాల చందులు ఎన్నికయారని మధురిమ తెలిపారు.

Tags