ఓసి ల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి. ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)
జనవరి 11న హన్మకొండ లో లక్ష మందితో ఓసి ల సింహగర్జన సభ.....
హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి ఓసి ల సింహగర్జన సమరభేరి సభను జయప్రదం చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తో పాటు పలువురు ఓసి ఐకాస రాష్ట్ర నాయకులు పిలుపు నిచ్చారు.

జనవరి 11న వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన ఓసి ల సింహగర్జన సభ ఏర్పాట్లపై సోమవారం జగిత్యాల లోని పద్మ నాయక ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జగిత్యాల జిల్లా స్థాయి ఓసి ఐకాస నాయకుల సన్నాహక సమావేశంలో రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా
ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలాడి రామారావు , మాట్లాడుతూ ఓసిలందరూ ఐకమత్యం తో ఉంటేనే తమ హక్కులు కాపాడుకోగలమని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ పబ్బo కోసం కొన్ని దుష్ట శక్తులు చేస్తున్న అసత్య ప్రచారాలు, పన్నుతున్న కుట్రలను సాగనువ్వబోమని హెచ్చరించారు.
ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఈ క్రింది డిమండ్లను ఉంచాం
.jpg)
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ రాష్ట్ర స్థాయిలో చట్ట బద్దత గల ప్రత్యేక ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలి.
ఓసి విద్యార్థులకు టెట్ రాత పరీక్ష అర్హత మార్కులను 90 నుంచి 70 కి తగ్గించాలి. ఈడబ్లూఎస్ అభ్యర్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షలలో వయో పరిమితిని పెంచాలని, ఈడబ్లూఎస్ సర్టిఫికెట్ జారీకి ఎలాంటి షరతులు లేకుండా 5 ఏండ్ల కాలపరిమితి కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని. ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే వెంటనే భర్తీ చేయాలని,
ఈడబ్లూఎస్ సర్టిఫికెట్ జారీకి వార్షిక ఆదాయ పరిమితిని 10 లక్షలకు పెంచాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు నిరుపేద ఓసి విద్యార్థులకు వర్తింప చేయాలనే డిమండ్ల తో జనవరి నెల 11 న లక్ష మంది ఓసి సామాజిక వర్గీయుల తో రాష్ట్ర స్థాయి ఓసి ల సింహగర్జన సభ ను హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్నామని పార్టీలకతతంగా రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ కమ్మ, మార్వాడి లందరూ పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పోలాడి రామారావు, ఐకాస నాయకులు కోరారు. ఈసందర్భంగా ఓసి ల సింహగర్జన సమరభేరి సభ కు సంబంధించిన గోడ ప్రతులను, కరపత్రాలను సమావేశంలో ఐకాస నాయకులు ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నం కిషన్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు చీటి శిరీష ఎన్ . అపర్ణ, తో పాటు రెడ్డి సంఘాల ప్రతినిధులు కొప్పెర వెంకట్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, బద్దం నారాయణ రెడ్డి, వెలమ సంఘం ప్రతినిధులు అయిల్నేని సాగర్ రావు, వొద్దినేని పురుషోత్తం రావు, చీటి సంతోష్ రావు, వెంకటేశ్వర్ రావు, అయిలినేని స్వప్న, వైశ్య సంఘం ప్రతినిధులు పుల్లూరి సత్యనారాయణ, మహంకాళి రాజన్న, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, సిరిసిల్ల శ్రీనివాస్ ఉమాపతి శర్మ, ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ రావు, సిరిసిల్ల రాజేంద్ర శర్మ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల నీటి పారుదల శాఖ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)నీటి పారుదల శాఖ సమావేశం మందిరం నందు ఏర్పాటుచేసిన నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశానికి టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఉద్యోగుల అడాక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ శ్రీ సంగెo లక్ష్మణరావ, టిఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్... ఓసి ల సింహగర్జన సమరభేరిని విజయవంతం చేయాలి. ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు)జనవరి 11న హన్మకొండ లో లక్ష మందితో ఓసి ల సింహగర్జన సభ.....హన్మకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష మందితో, రెడ్డి, వైశ్య, వెలమ బ్రాహ్మణ, కమ్మ, మార్వాడిల సంఘాల తో ఏర్పడిన రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ... టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు
జగిత్యాల డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్‌కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందిస్తూ ఆయన శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత... అసెంబ్లీలో జగిత్యాల నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 29 (ప్రజా మంటలు):
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీ పురాతనమైనదని, పట్టణ అభివృద్ధిలో భాగంగా యావర్ రోడ్డును 60 అడుగుల నుంచి 100 అడుగుల వరకు విస్తరించేందుకు 2021లో మాస్టర్ ప్లాన్ రూపొందించామని ఆయన... తపస్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నికగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్... లక్ష్మీపూర్ హత్య కేసు చేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘు చందర్
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో హత్యకు గురైన బుర్ర మహేందర్ అనే వ్యక్తి హత్య కేసును ఛేదించారు పోలీసులు... ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు వీడియోలు బయట పెడతానని మహేందర్ వేధింపులకు గురి చేయడంతోనే అక్క చెల్లెలుతో పాటు కుటుంబ సభ్యులు కలిసి హత్యకు పాల్పడినట్లు... కాసుగంటి సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 28 (ప్రజా మంటలు)
ప్రముఖ విద్యావేత్త , శ్రీ సరస్వతిశిశు మందిర్ ,శ్రీవాణి సహకార జూనియర్ కళాశాల,గోదావరి వ్యాలీ వ్యవస్థాపకులు కాసుగంటి సుధాకర్ రావు అనారోగ్యం తో హైదరాబాదులో మరణించగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ సుధాకర్ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించి,వారి కుమారుడు కాసుగంటి జగదీష్ చందర్ రావును,... సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి – మార్త సత్యనారాయణ
కాగజ్ నగర్, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లపై జరుగుతున్న వేధింపులు, నిర్లక్ష్య ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, వారి రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి మార్త సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో... ఎస్‌సి రెసిడెన్షియల్ హాస్టల్ నిర్వహణపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం
సికింద్రాబాద్, డిసెంబర్ 28 ( ప్రజామంటలు) :
రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్–నాదర్‌గుల్–కందుకూర్ ఎస్‌సి రెసిడెన్షియల్ హాస్టల్‌లో నెలకొన్న దారుణ పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదుతో హెచ్‌ఆర్‌సీ కేసు నం. 8122/2025 నమోదు చేసి విచారణ చేపట్టింది.హాస్టల్‌లో మురుగు పొంగిపొర్లడం, తలుపులు–కిటికీలు లేని... అలరించిన ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఫ్యాషన్ షో
సికింద్రాబాద్, డిసెంబర్ 28 (ప్రజామంటలు):
ర్యాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల్లో మార్పుకు నాంది పలుకుతుందని చీఫ్ గెస్ట్ మిసెస్ తెలంగాణ క్రౌన్ సుధా నాయుడు అన్నారు. బేగంపేట ఫ్యామిలీ వరల్డ్‌లో ఫెమి–9 ఉమెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీ ఫ్యాషన్ మీట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా... జగిత్యాల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి ఘన విజయం.
జగిత్యాల డిసెంబర్ 28 (ప్రజా మంటలు)టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎల్లాల రాజేందర్ రెడ్డి ఘన విజయం సాధించినట్లు ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్నికల అధికారి బెజ్జంకి సంపూర్ణ చారి తెలిపారు.
ఆదివారం స్థానిక దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో రాజేందర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి... ఇబ్రహీంపట్నంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28 (ప్రజా మంటలు):
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి ప్రజాస్వామ్య... 