POCSO case - Praja Mantalu

కాకినాడ అత్యాచారయత్నం కేసులో నిందితుడి ఆత్మహత్య.. చెరువులోకి దూకి మృతి
కాకినాడ అక్టోబర్ 23:

కాకినాడ జిల్లా తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికపై జరిగిన లైంగిక దాడి యత్నం కేసు విషాదంగా మారింది. నిందితుడు నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువులోకి దూకి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే— నిన్న మధ్యాహ్నం సమయంలో నారాయణరావు అనే వ్యక్తి, తాను బాలికకు తాతయ్యనని చెప్పి గురుకుల పాఠశాల నుంచి తీసుకెళ్లాడు. అనంతరం సమీపంలోని తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడి ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, స్థానికుడు అనుమానం వ్యక్తం చేసి నిలదీయడంతో ఈ విషయం బయటపడింది.

బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు వెళ్తున్న సమయంలో, టాయిలెట్‌కు వెళ్తానని చెప్పి నారాయణరావు చెరువులోకి దూకాడు. రాత్రంతా వెతికినా మృతదేహం దొరకలేదు.

ఉదయం ఫైర్ సిబ్బంది, పోలీసుల సహాయంతో గజ ఈతగాళ్లు చెరువులో శోధించగా మృతదేహం బయటపడింది.
“నారాయణరావు చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని లేదా ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నాం,” అని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలి బంధువులు,“తాతయ్యనని చెబితే పాఠశాల నుంచి ఎలా పంపించారో?”అని గురుకుల నిర్వాహకులను ప్రశ్నించారు.

ఇక, పోలీసులు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను కూడా విచారిస్తున్నారు.ఈ ఘటనతో తుని పరిసరాల్లో ఆందోళన నెలకొంది.